CM KCR new year gift

CM KCR new year gift to govenment employees | cm kcr announces prc in telugu news | ఉద్యోగుకుల‌కు సీఎం కేసీఆర్ వ‌రాల జ‌ల్లు

Spread the love

CM KCR new year gift

CM KCR new year gift to govenment employees | cm kcr announces prc in telugu news | ఉద్యోగుకుల‌కు సీఎం కేసీఆర్ వ‌రాల జ‌ల్లుHyderabad: చాలా కాలం త‌ర్వాత తెలంగాణ రాష్ట్రం సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు తీపి క‌బురు చెప్పారు. రెండ్రోజుల్లో నూత‌న సంవ‌త్స‌రం ప్రారంభ‌మ‌వుతుండ‌గా, రాష్ట్ర ప్ర‌జ‌ల‌పైన‌, ఉద్యోగ‌స్థుల‌పైన సీఎం కేసీఆర్ సంక్షేమ వ‌రాలు కురిపించారు. రాష్ట్రంలో అన్ని ర‌కాల ప్ర‌భుత్వ ఉద్యోగుల వేత‌నాల‌ను పెంచాల‌ని, ఉద్యోగ విర‌మ‌ణ వయ‌స్సును పెంచాల‌న, అన్ని శాఖ‌ల్లో ఉద్యోగాల భ‌ర్తీ ప్ర‌క్రియ ప్రారంభించాల‌ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్ర‌గ‌తి భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం ఉన్న‌తాధికారుల స‌మీక్షా స‌మావేశం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..ప్ర‌భుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఉద్యోగులు, వ‌ర్క్‌ఛార్ట‌డ్ ఉద్యోగులు, డెయిలీ వేజ్ ఉద్యోగులు, కాంటింజెండ్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగ‌న్‌వాడీ వ‌ర్క‌ర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఆశ వ‌ర్క‌ర్లు, విద్యా వాలంటీర్లు, సెర్ఫ్ ఉద్యోగులంద‌రికీ ప్ర‌యోజ‌నం క‌లిగేలా వేత‌నాల పెంపు చేస్తామ‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు.

అన్ని ర‌కాల ఉద్యోగులు క‌లిపి తెలంగాణ‌లో 9,36,976 మంది ఉంటార‌ని, అందరికీ వేత‌నాల పెంపు వ‌ర్తిస్తుంద‌ని సీఎం చెప్పారు. ప్ర‌భుత్వ ఉద్యోగుల‌తో పాటు త‌క్కువ వేత‌నాలు క‌లిగిన ఉద్యోగులున్న ఆర్‌టీసీలో కూడా వేత‌నాలు పెంచాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు సీఎం తెలిపారు.

వేత‌నాల పెంపుతో పాటు ఉద్యోగ విర‌మ‌ణ వ‌య‌స్సు పెంపు, ప‌దోన్న‌తులు ఇవ్వ‌డం, అవ‌స‌ర‌మైన బదిలీలు చేయ‌డం, స‌ర‌ళ‌త‌ర‌మైన స‌ర్వీసు నిబంధ‌న‌ల రూప‌క‌ల్ప‌న ఉద్యోగ సంబంధ అంశాల‌న్నీ రిటైర్ అయ్యే రోజే ఉద్యోగుల‌కు ఫిబ్ర‌వ‌రిలోగా సంపూర్ణంగా ప‌రిష్క‌రించ‌నున్న‌ట్టు తెలిపారు.

CM KCR new year gift

ఫిబ్ర‌వ‌రి నుంచే ఉద్యోగ

నియామ‌కాల ప్ర‌క్రియ: కేసీఆర్‌

అన్నిశాఖ‌ల్లో ఖాళీల‌ను గుర్తించి ఫిబ్ర‌వ‌రి నుండి ఉద్యోగ నియామ‌కాల ప్ర‌క్రియ‌ను చేప‌ట్టున్న‌ట్టు సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించారు. ఈ అంశాల‌న్నింటిపై అధ్య‌యనం చేయ‌డానికి, ఉద్యోగ సంఘాల‌తో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డానికి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్ ను అధ్య‌క్షుడిగా, ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి రామ‌కృష్ణారావు, నీటిపారుద‌ల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి ర‌జ‌త్ కుమార్ స‌భ్యులుగా త్రిస‌భ్య అధికారుల సంఘాన్ని ముఖ్య‌మంత్రి నియ‌మించారు.

ఈ క‌మిటీ జ‌న‌వ‌రి మొద‌టి వారంలో వేత‌న స‌వ‌ర‌ణ సంఘం నుండి అందిన నివేద‌క‌ను అధ్య‌య‌నం చేస్తుంద‌న్నారు. రెండో వారంలో ఉద్యోగ సంఘాల‌తో స‌మావేశం అవుతుంద‌ని, వేత‌న స‌వ‌ర‌ణ ఎంత చేయాలి? ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సు ఎంత‌కు పెంచాలి? స‌ర్వీసు నిబంధ‌న‌లు ఎలా రూపొందించాలి? ప‌దోన్న‌తుల‌కు అనుస‌రించాల్సిన మార్గ‌లేమిటి? జోన‌ల్ విధానంలో ప్ర‌స్తుతం ఉన్న న్యాయ‌ప‌ర‌మైన చిక్కుల‌ను అధిగ‌మించే వ్యూహ‌మేమిటి? త‌దిత‌ర అంశాల‌పై ఈ క‌మిటీ ప్ర‌భుత్వానికి సూచ‌న‌లు చేస్తుంద‌న్నారు. అనంత‌రం క్యాబినేట్ స‌మావేశ‌మై తుది నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్టు తెలిపారు.

CM KCR new year gift

ఉద్య‌మంలో ఉద్యోగుల పాత్ర కీల‌కం: కేసీఆర్‌

తెలంగాణ రాష్ట్ర సాధింపు ఉద్య‌మంలో ఉద్యోగుల పాత్ర ఎంతో గొప్ప‌ద‌ని సీఎం కేసీఆర్ అన్నారు. స‌మైఖ్య ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో కూడా తెలంగాణ ప్రాంత ఉద్యోగులు టీఎన్జీవో పేరుతో తెలంగాణ అస్థిత్వాన్ని గొప్ప‌గా నిలుపుకున్నార‌న్నారు. ప్ర‌త్యేక రాష్ట్రంగా ఏర్ప‌డితే తెలంగాణ క‌చ్చితంగా ధనిక రాష్ట్రం అవుతుంద‌ని అప్ప‌ట్లో అంచనా వేశామ‌న్నారు. అనుకున్న‌ట్టే తెలంగాణ రాష్ట్రం వ‌చ్చింద‌ని, ధ‌నిక రాష్ట్రంగా మారింద‌న్నారు. రైతుల కోసం, పేద‌ల కోసం ఎన్నో సంక్షేమ కార్య‌క్ర‌మాల‌ను ప్ర‌భుత్వం అమ‌లు ప‌రుస్తోంద‌న్నారు.

ఉద్యోగుల సంక్షేమ కోసం ఎన్నో చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని, రాష్ట్రం ఏర్ప‌డిన వెంట‌నే ఉద్యోగుల‌కు 42 శాతం ఫిట్ మెంట్ తో వెత‌నాలు పెంచింద‌ని గుర్తు చేశారు. ఉద్యోగులు, పెన్ష‌న‌ర్ల‌తో పాటు అన్ని ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లో ప‌నిచేస్తున్న అన్ని ర‌కాల ఉద్యోగుల‌కు వేత‌నాలు పెంచామ‌న్నారు. మ‌రొక్క‌సారి ఉద్యోగుల‌కు ఖ‌చ్చితంగా ఎంతో కొంత వేత‌నాలు పెంచాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింద‌ని తెలిపారు.

ఎన్నిక‌ల హామీకి క‌ట్టుబ‌డి ఉన్నాం

ప్ర‌భుత్వ ఉద్యోగుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సును పెంచుతామ‌ని టిఆర్ఎస్ ఎన్నిక‌ల మ్యానిఫెస్టో లో హామీ ఇచ్చింద‌ని, దీనికి ప్ర‌భుత్వం క‌ట్టుబడి ఉంద‌ని కేసీఆర్ అన్నారు. ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సును ఎంత‌కు పెంచాల‌నే విష‌యంలో అధికారుల క‌మిటీ ఉద్యోగ సంఘాల నాయ‌కుల‌తో చ‌ర్చిస్తుంద‌న్నారు. అనంత‌రం ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్నారు. మార్చి నుండి అన్ని ర‌కాల ఉద్యోగులంతా స‌మ‌స్య‌ల నుండి శాశ్వ‌తంగా విముక్తి కావాల‌ని సీఎం అధికారుల‌ను ఆదేశించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ తో వివాదం కార‌ణంగా పోలీసు, రెవెన్యూ త‌దిత‌ర శాఖ‌ల్లో ప‌దోన్న‌తులు ఇవ్వ‌డం సాధ్యం కాలేద‌న్నారు. ప్ర‌స్తుతం అన్ని శాఖ‌ల్లో ప‌దోన్న‌తులు ఇవ్వాల‌ని, అన్ని శాఖ‌ల్లో వెంట‌నే డీపీసీలు నియమించాల‌ని సూచించారు. ప‌దోన్న‌తులు ఇవ్వ‌గా ఖాళీ అయిన పోస్టుల‌ను వెంట‌నే భ‌ర్తీ చేయాల‌న్నారు. శాఖ‌ల వారీగా ఖాళీల‌ను గుర్తించి ఫిబ్ర‌వ‌రి మాసంలో ఉద్యోగ నియామ‌కాల ప్ర‌క్రియ ప్రారంభించాల‌ని సీఎం కేసీఆర్ అన్నారు.

CM KCR new year gift

ఎలాంటి పైర‌వీలు ఆస్కారం ఉండొద్దు

ప్ర‌తి ఉద్యోగి తాను ఉద్యోగంలో చేరిన నాడే తాను ఏ స‌మ‌యానికి ప‌దోన్న‌తి పొందుతాడో తెలిసి ఉండాల‌ని సీఎం కేసీఆర్ అన్నారు. రిటైర్డ్ అయ్యే నాటికి ఏ స్థాయికి వెళ‌తాడో స్ప‌ష్ట‌త ఉండాల‌ని, దీనికి అనుగుణంగా చాలా స‌ర‌ళ‌మైన రీతిలో ఉద్యోగుల స‌ర్వీసు రూల్సు రూపొందించాల‌న్నారు. ప‌దోన్న‌తుల కోసం ఎవ‌రి వ‌ద్దా పైర‌వీ చేసే దుస్థితి ఉండొద్ద‌న్నారు. ఏ ఆఫీసుకూ తిరిగే అవ‌స‌రం రావ‌ద్ద‌న్నారు. స‌మ‌యానికి ఉద్యోగికి రావాల్సిన ప్ర‌మోష‌న్ ఆర్డ‌ర్ వ‌చ్చి తీరాల‌న్నారు. ఉద్యోగుల‌కు త‌మ కెరీర్ విష‌యంలో అంతా స్ప‌ష్ట‌త ఉండే విధంగా స‌ర్వీస్ రూల్సు ఉండాల‌న్నారు. ఆయా శాఖ‌ల్లో శాఖాధిప‌తులు ఉద్యోగుల సంక్షేమాన్ని క‌చ్చితంగా ప‌ట్టించుకోవాల‌ని సీఎం ఆదేశించారు.

గౌర‌వంగా వీడ్కోలు ప‌ల‌కాలి :కేసీఆర్‌

ఉద్యోగులు దాదాపు 35 సంవ‌త్స‌రాల పాటు ప్ర‌భుత్వం కోసం, ప్ర‌జ‌ల కోసం విధులు నిర్వ‌ర్తిస్తారన్నారు. అలాంటి ఉద్యోగుల‌కు చాలా గౌర‌వంగా వీడ్కోలు ప‌ల‌కాల్సిన అవ‌స‌రం బాధ్య‌త ఉంద‌న్నారు. నాల్గో త‌ర‌గ‌తి ఉద్యోగి నుండి శాఖాధిప‌తి వ‌ర‌కు ఎవ‌రైనా స‌రే ప‌ద‌వీ విమ‌ర‌ణ పొందితే వారికి ఆ కార్యాల‌యంలోనే ఘ‌నంగా స‌న్మానం జ‌ర‌పాల‌ని సూచించారు. ప్ర‌భుత్వ వాహ‌నంలోనే ఇంటికి తీసుకెళ్లి గౌర‌వంగా వీడ్కోలు ప‌ల‌కాల‌న్నారు.

రిటైర్డ్ రోజే రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ అందాల‌ని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్ర‌భుత్వ ఉద్యోగం చేస్తూ మ‌ర‌ణించిన వారి కుటుంబ స‌భ్యుల‌కు ఉద్యోగ అవ‌కాశం క‌ల్పించే కారుణ్య నియామ‌కాల విష‌య‌లో జాప్యం జ‌ర‌గ‌డం అత్యంత విషాద‌క‌ర ‌మ‌న్నారు. దుఃఖంలో ఉన్న కుటుంబం ఉద్యోగం కోసం కార్యాల‌యాల చుట్టూ తిరిగే అవ‌స‌రం ప‌డొద్ద‌ని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖ‌ల్లో వెంట‌నే కారుణ్య నియామ‌కాల ప్ర‌క్రియను పూర్తి చేయాల‌ని తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు.

CM KCR new year gift

ఈ సంద‌ర్భంగా సీఎం కేసీఆర్ నిర్ణ‌యం ప‌ట్ల ఉద్యోగ సంఘాలు హ‌ర్షం వ్య‌క్తం చేశాయి. టీఎన్జీవోల సంఘం నాయ‌కులు సీఎం కు కృత‌జ్ఞ‌త‌లు తెలిశాయి. కార్య‌క్ర‌మంలో సంఘం టీఎన్జీవోల సంఘం నాయ‌కులు రాజేంద‌ర్‌, రాయ‌కంటి ప్ర‌తాప్‌, అధ్య‌క్ష‌రాలు వి.మ‌మ‌త సీఎం కేసీఆర్‌ను క‌లిసి కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేశారు.

Lockdown : తెలంగాణ‌లో లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్ స్పంద‌న‌!

Lockdown : తెలంగాణ‌లో లాక్‌డౌన్ పై సీఎం కేసీఆర్ స్పందించారు. ఎట్టి ప‌రిస్థితుల్లో లాక్డౌన్ పెట్టే ఆలోచ‌న లేద‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్షా Read more

Sharmila vs Kcr : ద‌ళితుల‌పై కేసీఆర్ ప్రేమ అదే మ‌రీ! : ష‌ర్మిల

Sharmila vs Kcr : ద‌ళితుల‌పై కేసీఆర్ ప్రేమ అదే మ‌రీ! : ష‌ర్మిల Sharmila vs Kcr : గొర్రెల‌ను బ‌లిస్తారు.. కానీ సింహాల‌ను బ‌లివ్వ‌ర‌ని Read more

Telangana CM KCR : 10న న‌ల్గొండ‌కు సీఎం కేసీఆర్‌

Telangana CM KCR : Hyderabad: తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు ఈ నెల 10వ తేదీన న‌ల్గొండ జిల్లాలో ప‌ర్య‌టించ‌నున్నారు. జిల్లాలో రూ.3000 వేల Read more

Electric Vehicles : తెలంగాణ స‌ర్కార్ బంప‌ర్ ఆఫ‌ర్‌ | ఎల‌క్ట్రిక్ వాహ‌నాల‌పై నో ట్యాక్సీ, నో రిజిస్ట్రేష‌న్‌!

Electric Vehicles :Hyderabad: తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం వాతావ‌ర‌ణ కాలుష్యాన్ని త‌గ్గించే దిశ‌గా కృష్టి చేస్తోంది. ఇందులో భాగంగా వాహ‌నాల నుండి వ‌చ్చే పొగ కాలుష్యాన్ని నియం‌త్రించేందుకు Read more

Leave a Comment

Your email address will not be published.