cm kcr announces job notification | సీఎం కేసీఆర్ తెలంగాణ లో నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు. బుధవారం అసెంబ్లీలో మాట్లాడిన సీఎం కేసీఆర్ ఉద్యోగ ప్రకటన చేయడంతో రాష్ట్రంలో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ 91,142 వేల ఖాళీ పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలిపారు. దీంతో ఒక్కసారిగా అసెంబ్లీలో హర్ష ధ్వనులు వినిపించాయి. నిన్న సీఎం కేసీఆర్ ఓ సభలో మాట్లాడుతూ బుధవారం ఉదయం 10 గంటలకు నిరుద్యోగులు టీవీలు చూడండి అంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు. ఈ సందర్భంగా గడిచిన గంటల వ్యవధిలో నిరుద్యోగులు కేసీఆర్ ప్రకటన కోసం ఎదురు (cm kcr announces job notification)చూశారు.
అనుకున్న విధంగానే సీఎం కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేశారు. అదే విధంగా కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా పర్మినెంట్ చేస్తున్నట్లు సర్కార్ నిర్ణయం తీసుకుందని కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపి కబరు చెప్పారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణ సాధించుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో అని అసెం బ్లీలో ప్రకటించారు.టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రాజెక్టులను ఒక్కొక్కటి పూర్తి చేసుకుంటూ ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తూ తెలంగాణను పూర్తిగా సస్యశ్యామలం చేసిందని అన్నారు.
ఉద్యోగ నోటిఫకేషన్ ప్రకటిస్తారేమోనని ఆశగా రాష్ట్రంలో ప్రతి నిరుద్యోగి టివిలు చూస్తున్న సందర్భంలో సీఎం కేసీఆర్ ప్రకటనతో టిఆర్ఎస్ కార్యకర్తలు సంబురాలు జరుపుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉద్యోగాల నోటిఫికేషన్ రాకపోవడంతో ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఎన్నో కుటుంబాలు కుమారులను కోల్పోయి తీవ్ర శోక సంద్రంలో బ్రతుకుతున్నాయి. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఇన్నాళ్లకు ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటించడం పట్ల ప్రతి పక్షాలు ఎన్నికల హడవుడి కోసమేనని విమర్శలు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధిత శాఖల నుంచి ఈ రోజే నోటిఫికేషన్లు విడుదల అవ్వనున్నట్టు సీఎం ప్రకటించారు.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ