Ali Rajya Sabha Ticket అమరావతి: ప్రముఖ కమెడియన్ సినీ నటుడు, వైసీపీ నేత అలీకి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారని తెలుస్తోంది. అలీని మరో వారంలో కలుద్దామని సీఎం జగన్ చెప్పినట్టు సమాచారం. త్వరలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్న నేపథ్యంలో అందులో ఒకటి మైనార్టీలకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. పార్టీలో చేరినప్పటి నుంచి అలీ సీఎం జగన్ వెన్నంటి ఉన్నారు. పాదయాత్రలో కూడా జగన్తో కలిసి(Ali Rajya Sabha Ticket) తిరిగారు.
అనంతరం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎం జగన్ను పలుమార్లు కలిసి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా కీలక పదవి కోసం రెండున్నరేళ్లుగా ఎదురుచూస్తున్న అలీకి జగన్ ఏదైనా పదవి ఇస్తాడనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే అనుకున్నదే తడువుగా ఈ రోజు సినీ ప్రముఖులు సీఎం వైస్ జగన్ను కలిశారు. అందులో సినీనటుడు అలీ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా అలీకి రాజ్యసభ సీటు ఇస్తారనే వార్త బయటకు వచ్చింది.

ఇక చిరంజీవి పెద్దగా సీఎం వైఎస్. జగన్తో జరిగిన సినీ పరిశ్రమ సమస్యలు ఈ రోజుతో ఒక కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. మంత్రి పేర్ని నాని ఆధ్వర్యంలో ముఖ్యమంత్రిని కలిసి చర్చలు జరిపిన తర్వాత బయటకు వచ్చిన మెగస్టార్ చిరంజీవి, రాజమౌళి, మహేష్, ప్రభాస్, కొరటాల శివ, ఆర్.నారాయణ మూర్తి, పోసాని కృష్ణ మురళి, అలీ మీడియా ఎదుట సంతోషంగా మాట్లాడారు. త్వరలో ప్రభుత్వ జీవో విడుదల చేయబోతోందని చిరంజీవి తెలిపారు. ఈ క్రమంలో అలీకి కూడా సీఎం జగన్ శుభవార్త చెప్పటినట్టు తెలుస్తోంది.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ