CM Jagan Command for Unlimited Network Services in AP
గ్రామాలకు అన్లిమిటెడ్ ఇంటర్నెట్
ఐటి, డిజిటల్ టెక్నాలజీపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష
Thadepalligudem : ‘గ్రామాల్లో అంతరాయాలు లేకుండా ఇంటర్నెంట్ నెట్ వర్క్ అందించాలి. ఏ స్థాయి కనెక్షన్ కావాలన్నా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. గ్రామంలో నెట్వర్క్ పాయింట్ వద్ద ఇంటర్నెట్ లైబ్రరీ ఉండాలి. తద్వారా సొంత ఊళ్లలోనే వర్క్ ఫ్రం హోం సదుపాయం కల్పించవచ్చు. ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేయాలి.’ అని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. శుక్రవారం ఐటి, డిజిటల్ టెక్నాలజీ పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా గ్రామాలకు అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ నెట్ వర్క్ అందించాలని, అంతరాయం లేకుండా ఇంటర్నెట్ సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గ్రామాల్లో ఇంటర్నెట్ కనెక్షన్లు, అమ్మఒడి పథకంలో ఆప్షన్ గా ఇచ్చే ల్యాప్ టాప్ల పంపిణీపై సంబంధిత మంత్రి, ఉన్నతాధికారులతో చర్చించారు.
అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అమ్మఒడి పథకంలో ఆప్షన్‌గా విద్యార్థులకిచ్చే ల్యాప్ టాప్లపైన అధికారులు ఆలోచన చేయాలన్నారు. వచ్చే ఏడాది అమ్మఒడి చెల్లింపుల నాటికి ల్యాప్ టాప్‌లు ఇచ్చేందుకు సిద్దం కావాలన్నారు. ల్యాప్ టాప్ చెడిపోయిందని గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇస్తే, వారం రోజుల్లో మరమ్మతులు చేసి మళ్లీ విద్యార్థులకు ఇచ్చే విధంగా సిస్టమ్ ఉండాలి. ఆ రకంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు.
తాడేపల్లిలో సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశానికి ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ఛైర్మన్ పి.గౌతం రెడ్డి, పరిశ్రమలు, వాణిజ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, గృహ నిర్మాణ శాఖ ముఖ్యమంత్రి కార్యదర్శి అజయ్‌జైన్, ఏపీ ట్రాన్స్ కో సీఎండీ నాగులపల్లి శ్రీకాంత్, ఏపీ ఫైబర్ నెట్ సంస్థ ఎండీ ఎం.మధుసూధన్ రెడ్డి , ఇతర ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.
అంతుచిక్కని వ్యాధిపై సీఎం జగన్ ఆరా!
Thadepalligudem : పశ్చిమ గోదావరి జిల్లా పూళ్లలో అంతుచిక్కని వ్యాధిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అధికారులు వెంటనే వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో పూళ్లకు సీఎస్ ఆధిత్యనాథ్‌దాస్, వైద్యాఆరోగ్య శాఖ కార్యదర్శి, కమిషనర్, ఉన్నత అధికారులు బయలు దేరారు. పూళ్లలో పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ జరుగుతోందని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు సూచించారు. ఉన్నట్టుండి కళ్లు తిరిగి కింద పడిపోతున్నట్టు గ్రామస్థులు చెబుతున్నారు.


అలా పడిపోయిన వారిలో కొందరికి ఫిట్స్ లక్షణాలు ఉన్నాయి, వైద్య అధికారులు అప్రమత్తమై వెంటనే గ్రామంలో వైద్య బృందాలు ఏర్పాటు చేశారు. ఇంటింటికి వెళ్లి అదికారులు సర్వే చేస్తున్నారు. ఆశ వర్కర్లు గ్రామంలోని 6 నీళ్ల ట్యాంక్ లో వాటర్ శాంపిల్స్ తీసుకుని ల్యాబ్‌కు పరీక్షల కోసం పంపించారు. ప్రస్తుతం బాధితులంతా ప్రత్యేక చికిత్స పొందుతున్నారు. వారంతా ఆరోగ్యంగా ఉన్నారని వైద్య అధికారులు చెబుతున్నారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.
ఇది చదవండి : బెదిరింపులకు భయపడేవాళ్లం కాదు!
ఇది చదవండి : నా విజయం వెనుక అమ్మ ఉంది
ఇది చదవండి : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఇది చదవండి : నకిలీ మిరపనారు..లబోదిబోమంటున్న రైతన్నలు
ఇది చదవండి: 19న నితిన్ కొత్త సినిమా ‘చెక్’ విడుదల