cm jagan – chiranjeevi అమరావతి: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగనమోహన్ రెడ్డి తో తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మెగాస్టార్ చిరంజీవి భేటి గురువారం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి సీఎం జగన్‌తో గంటకు పైగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సినిమా పరిశ్రమకు సంబంధించి టికెట్ల వ్యవహారం తో పాటు పలు విషయాలను చర్చించినట్టు తెలుస్తోంది. భేటీ అనంతరం చిరంజీవి విలేకర్ల సమావేశంలో (cm jagan – chiranjeevi)మాట్లాడారు.

ఒక సోదరుడుగా చూశారు: చిరంజీవి
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తో భేటీ చాలా సంతృప్తికరంగా ఉందని, ఆనందంగా జరిగిందని చిరంజీవి అన్నారు. ఈ పండుగ పూట ఒక సోదరుడుగా నన్ను ఆహ్వానించి విందు భోజనం పెట్టడం ఆనందంగా ఉందన్నారు. సినిమా పరిశ్రమకు సంబంధించి కొన్ని ఇబ్బందుల గురించి చర్చించామన్నారు. తాను సినీ పరిశ్రమకు సంబంధించి టిక్కెట్ల వ్యవహారాన్ని, సినిమా హాల్ గురించి సిఎం జగన్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. అయితే ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి తన సలహా కూడా తీసుకొని తుది నిర్ణయం తీసుకుందామని సిఎం చెప్పినట్టు పేర్కొన్నారు. సినీ పరిశ్రమలో ఎవరూ అధైర్య పడవద్దని సూచించారన్నారు. అందరి ఆమోగ్యమైన తరువాత జీవోను విడుదల చేస్తామని అన్నారు.
సిఎంపై అనవసరంగా మాట్లాడొద్దు
సిఎం జగన్‌పై సినీ పరిశ్రమలో ఎవరూ తొందరపడి వ్యాఖ్యలు చేయవద్దని ఒక సినిమా బిడ్డగా ఆదేశించారు.సకాలంలో సినీ పరిశ్రమకు సంబంధించి సమస్యలన్నీ పరిష్కారమయ్యేందుకు ప్రభుత్వం చొరవ చూపనుందనే ధీమా వ్యక్తమవుతోందని అన్నారు. మళ్లీ తనను సీఎం జగన్ ఆహ్వానించ నున్నారన్నారు. ఇక సినీ వివాదం పై పుల్‌స్టాఫ్ పడనుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్టు చిరంజీవి తెలిపారు.

ప్రయాణం సాగిందిలా!
చిరంజీవి తొలుత గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి మెగాస్టార్ చిరంజీవి తాడేపల్లికి బయల్దేరారు. ఈ సందర్భంగా తాడేపల్లిలో సీఎం జగన్ నివాసం వద్దకు కారులో చేరుకున్నారు. మీడియా ప్రశ్నించగా తాను సినీ ఇండస్ట్రీ తరపున సీఎం జగన్‌ను కలిసేందుకు వచ్చానని తెలిపారు. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడుతానని తెలిపారు. సీఎం జగన్ నివాసంలో చిరంజీవికి జగన్ స్వాగతం పలికారు. అనంతరం శాలువాతో సన్మానించారు. అనంతరం ఇరువురు మధ్యాహ్నం మర్యాద పూర్వక లంచ్ భేటీ జరిగింది.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!