Delhi లో వారం పాటు lockdown ప్ర‌కటించిన CM Arvind Kejriwal

Delhi లో వారం పాటు lockdown ప్ర‌కటించిన CM Arvind Kejriwal

lockdown: ఢిల్లీ : దేశ రాజ‌ధాని ఢిల్లీలో లాక్‌డౌన్ విధించ‌నున్న‌ట్టు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌జేశారు. క‌రోనా మ‌హ‌మ్మారి విల‌య‌తాండ‌వం చేస్తున్న ఈ స‌మ‌యంలో ఢిల్లీ ప‌రిస్థితిపై లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ తో చ‌ర్చ‌లు జ‌రిపిన అనంత‌రం సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు పేర్కొన్నారు. ఇవాళ రాత్రి అన‌గా సోమ‌వారం రాత్రి 10 గంట‌ల నుంచి వ‌చ్చే సోమ‌వారం (ఏప్రిల్ 26) వ‌ర‌కు ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కూ ఆరు రోజుల పాటు లాక్‌డౌన్ విధిస్తున్న‌ట్టు ఢిల్లీ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో లాక్‌డౌనే శ‌ర‌ణ్య‌మ‌ని సీఎం కేజ్రీవాల్ భావించారు. ఆంక్ష‌లు క‌ఠినంగా ఉంటాయ‌ని ప్ర‌జ‌లంద‌రూ స‌హ‌క‌రించాల‌ని కోరారు.

ఆరోగ్య వ్య‌వ‌స్థ ప‌రిమితికి మించి కేసులు న‌మోదువుతున్న నేప‌థ్యంలో లాక్‌డౌన్ నిర్ణ‌యం తీసుకున్న‌ట్టు సీఎం తెలిపారు. క‌రోనా పాజిటీవ్ రేట్‌, ఇన్‌ఫెక్ష‌న్లు భారీగా పెరుగుతున్నాయ‌ని, ఆస్ప‌త్రుల్లో ప‌డ‌క‌ల కొర‌త ఏర్ప‌డింద‌ని వివ‌రించారు. ఈ విధంగా ఆసుప‌త్రుల్లో చేరే వారి సంఖ్య పెరిగితే ప్ర‌జారోగ్య వ్య‌వ‌స్థ ప్ర‌మాదంలో ప‌డుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఇవ‌న్నీ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని లాక్‌డౌన్ నిర్ణ‌యం తీసుకుంటున్న‌ట్టు సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ప్ర‌క‌టించారు.

CM Arvind Kejriwal

అత్య‌వ‌స‌ర సేవ‌లు కొన‌సాగుతాయి!

లాక్‌డౌన్ లో భాగంగా నిత్య‌వ‌స‌రాలు, ఆహార సంబంధిత, వైద్యం స‌హా ఇత‌ర అత్య‌వ‌స‌ర సేవ‌లు కొన‌సాగుతాయి. ప్రైవేటు కార్యాల‌య‌న్నీ ఇక‌నుంచి వ‌ర్క్ ఫ్రం హోం ద్వారానే న‌డిచేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. వివాహ వేడుక‌లకు కేవ‌లం 50 మందితో మాత్ర‌మే జ‌రుపుకోవాల‌ని సూచించారు. ఇందుకు ప్ర‌త్యేక పాసులు జారీ చేస్తామ‌న్నారు. వ‌ల‌స కూలీల విష‌యంలో ‘చేతులెత్తి మొక్కుతున్నా!‘ అని సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఈ ఆరురోజుల పాటు కొన‌సాగే చిన్న లాక్‌డౌన్ మాత్ర‌మే. ద‌య‌చేసి ఎవ్వ‌రూ ఢిల్లీని వ‌దిలి వెళ్లొద్ద‌ని సూచించారు. మర‌లా దీన్ని పొడ‌గించాల్సిన అవ‌స‌రం రాద‌ని తాను భావిస్తున్న‌ట్టు తెలిపారు. ప్ర‌తి ఒక్క‌ర్నీ ప్ర‌భుత్వం జాగ్ర‌త్త‌గా చూసుకుంటుంద‌ని హామీ ఇచ్చారు.ఇదిలా ఉండ‌గా గ‌డిచిన 24 గంట‌ల్లో ఢిల్లీలో రికార్డు స్థాయిలో క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 25,462 కోవిడ్ కేసులు ఒక్క రోజులో న‌మోద‌య్యాయి. 161 మ‌ర‌ణాలు సంభ‌వించాయి. దేశ‌వ్యాప్తంగా కూడా ఇదే ప‌రిస్థితి ఉన్న‌ది. రోజువారీ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో 2,73,810 ఉండ‌గా, 1,619 మంది క‌రోనాతో మృతి చెందారు.

చ‌ద‌వండి :  Life with Corona : కరోనా అంద‌ర్నీ ప‌ల‌క‌రించ‌బోతోంది!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *