Online class : చెట్టు కింద చ‌దువులు ఆ ఉపాధ్యాయురాలి ఆలోచ‌న‌కు జేజేలు!

0
17

Online class : చెట్టు కింద చ‌దువులు ఆ ఉపాధ్యాయురాలి ఆలోచ‌న‌కు జేజేలు!

Online class : భార‌త‌దేశంలో చెట్టుకింద చ‌దివి మేధావులు, రాజ‌కీయ వేత్త‌లు అయిన వారి గురించి మ‌నం వింటుంటే ఉంటాం. అంతెందుకు మ‌న తాత‌లు, తండ్రుల్లో కొంద‌రు గ్రామాల్లో చెట్ల కింద‌, ఇసుక దిబ్బ‌ల‌పైన అక్ష‌రా లు రాసి నేర్చుకున్న వారూ ఉన్నారు. ప్ర‌స్తుతం అత్యాధునిక కాలం కాబ‌ట్టి ఇప్పుడు చ‌దువు కుంటున్న కొంద‌రు పిల్ల‌ల‌కు ఏసీ గ‌దులు, బేంచీలు, డిజిట‌ల్ బ్లాక్ బోర్డులు వ‌గైరా విలాస‌వంత‌మైన సౌక‌ర్యాల‌ను ప్ర‌భుత్వ‌, ప్రైవేటు స్కూళ్లు క‌ల్పిస్తున్న విష‌యం అందిరికీ తెలిసిన విష‌య‌మే. ఇప్పుడు చెట్టు కింద చ‌దువు చెప్పే ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్య త‌గ్గిన‌ప్ప‌టికీ దేశంలో మాత్రం ఇంకా ఆ సంస్కృతి మాత్రం పోలేద‌నేది మాత్రం వాస్త‌వం. అందుకు ఉదాహ‌ర‌ణే జార్ఞంఢ్ రాష్ట్రంలో ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో క‌నిపించిన దృశ్యం. ఇప్పుడు ఆ ఫొటో సోష‌ల్ మీడియా(Linkedin)లో వైర‌ల్ అవుతుంది.

జార్ఘండ్ రాష్ట్రానికి చెందిన ప్ర‌భుత్వ ఉపాధ్యాయురాలు 24 ఏళ్ల ప‌విత్ర ఇచాగుతు(Pavitra Ichagutu) తాను టీచ‌ర్‌గా ప‌నిచేసే ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో విద్యార్థుల‌కు ఓ చెట్టు కింద పాఠాలు బోధిస్తూ క‌నిపించింది. ఆ ఉపాధ్యాయురాలు విద్యార్థుల‌కు ఇంగ్లీష్ , హిందీ మ‌రియు గ‌ణితంను బోధిస్తున్నారు. ప్ర‌స్తుతం క‌రోనా ప్ర‌భావం వ‌ల్ల పిల్ల‌లు ప్ర‌శాంతంగా చ‌దువుకునే అవ‌కాశం లేకుండా పోయింది. రోజురోజుకూ ముంచు కొస్తున్న క‌రోనా ముప్పుతో దేశంలోని ఆయా రాష్ట్రాల ప్ర‌భుత్వాలు శెల‌వులు ప్ర‌క‌టించాయి. కొన్ని త‌ర‌గ‌తుల పిల్ల‌ల‌ను డైరెక్ట్‌గా ప‌రీక్ష‌లు రాయ‌కుండానే పాస్ చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల ప్ర‌భుత్వాలు మాత్రం అక్క‌డ‌ ఆన్‌లైన్ క్లాసు(Online class)లకు మాత్ర‌మే అనుమ‌తి ఇచ్చాయి. ఇందులో భాగంగానే జార్ఞండ్ రాష్ట్రం కూడా ఆన్‌లైన్ క్లాసు(Online class)ల‌ను బోధించేందుకు ఉపాధ్యాయుల‌కు అనుమ‌తి ఇచ్చింది.

చెట్టు కింద పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయురాలు ప‌విత్ర ఇచాగుతు (Linkedin)

ప‌విత్ర ఇచాగుతు అనే ఉపాధ్యాయురాలు ప‌నిచేసే పాఠ‌శాల విద్యార్థులు అత్యంత పేద‌రికంకు చెందిన వారు. వారి కుటుంబాలు స్మార్ట్ ఫోన్ క‌లిగి లేనందున ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హించ‌డానికి అక్క‌డ ఉపాధ్యాయుల‌కు క‌ష్టంగా మారింది. ఒక వేళ స్మార్ట్ ఫోన్ ఉన్న‌ప్ప‌టికీ ఇంట‌ర్ నెట్ సేవ‌లు అధ్వానంగా ఉన్నాయి. దీంతో ఆ ఉపాధ్యాయురాలు త‌ర‌గ‌తి గ‌దిగా ఓ చెట్టును ఎంచుకున్నారు. ప్ర‌తి ఒక్క విద్యార్థికి మాస్కులు అంద‌జేశారు. విద్యార్థికి విద్యార్థికి మ‌ధ్య మీట‌ర్ దూరం ఉండేలా కూర్చోబెట్టారు. ఒక ప్ర‌క్క క‌రోనా నిబంధ‌న‌లు పాటిస్తూ, మ‌రో ప్ర‌క్క విద్యార్థుల‌కు పాఠాలు బోధిస్తూ ఉన్న ప‌విత్ర ఇచాగుతును ఎవ‌రో ఫొటో తీసి సామాజిక మాధ్య‌మాల్లో పెట్ట‌డంతో ఇప్పుడు ఆ ఫొటో వైర‌ల్ అవుతుంది. అంతే కాకుండా ఆ ఉపాధ్యాయురాలు తీసుకున్న నిర్ణ‌యానికి ప్ర‌తి ఒక్క‌రూ అభినంద‌న‌లు తెలుపుతూ ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

Latest Post  Life with Corona : కరోనా అంద‌ర్నీ ప‌ల‌క‌రించ‌బోతోంది!

”మూసివేసిన త‌ర‌గ‌తి గ‌దుల్లో విద్యార్థుల‌కు ప‌రిమితి మించి క్లాసులు నిర్వ‌హించ‌డం క‌న్నా ఇలా చెట్టు కింద బోధించ‌డ‌మే ఎంతో శ్రేయ‌స్క‌రం.ఇంటి నుండి ఆన్‌లైన్ లో పాఠాలు పేరుతో ఫోన్ల‌కు పిల్లలు అంకిత‌మై పోకుండా ఇలా సూర్య‌ర‌శ్మి కింద మంచి వాతావ‌ర‌ణంలో బోధ‌న చేయంతో పిల్ల‌ల‌కు జ్ఞాప‌క శ‌క్తి పెరుగుతుంది. మంచి ఆలోచ‌న‌లు కూడా వ‌స్తాయి. చెట్టు కింద బోధ‌న వ‌ల్ల ప్ర‌కృతి చాలా ఒత్తిడిని త‌గ్గిస్తుంది. ఇది ప్ర‌స్తుతం ఉన్న విద్యార్థుల‌కు ఎంతో ఉప‌యోగ‌క‌రం.” – Lopa OLLIVIER(Linkedin)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here