Cinnamon benefits to health: ప్రతి వంటింట్లో దాల్చిన చెక్క ఉంటుంది కదా!. కానీ ఉపయోగించేది మాత్రం చాలా తక్కువ సందర్భాల్లోనే. ఏదో చికనో, మటనో వండుకున్నప్పుడు దానిని ఉపయో గిస్తుంటాం. నిజానికి దాల్చిన చెక్కలో ఎన్ని అద్భుత ఔషధ గుణాలున్నాయనుకున్నారు. అవి తెలిస్తే అవునా? నిజమా? అనాల్సిందే మీరు. ఇంతకు ఆ విశేషాలు ఏమిటంటే?
ఔషధాల దాల్చిన చెక్క (Cinnamon benefits to health)
దాల్చిన చెక్క రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తుందని పరిశోధనల్లో తేలింది. డయాబెటిస్(diabetes), హైపోగ్లైసిమిక్తో బాధపడే వారు దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల మంచ ప్రయోజనం చేకూరుతుంది. టైప్ 2 డయాబెటిస్తో బాధపడే వారు రోజూ 1 గ్రాము దాల్చిన చెక్క పొడిని తీసుకుంటే వ్యాధి పూర్తి నియంత్రణ లోకి వస్తుంది. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోనూ దాల్చిన చెక్క ఉపయోపడుతుంది. రోజూ 120 మిల్లీ గ్రాముల దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్(cholesterol) బాగా తగ్గిపోతుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. రక్తపోటును తగ్గించడంలోనూ ఉపయోగపడుతుందని అధ్యయానాల్లో తేలింది.
దాల్చిన చెక్కలో సిన్నమాల్డిహైడ్ అనే కెమికల్ ఉంటుంది. ఇది పిరియడ్స్(periods) సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుంది. స్త్రీలలో ప్రొజెస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తిని పెంచుతుంది. టెస్టోస్టిరాన్ హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది. హార్మోన్ల సమతుల్యతకు దోహదపడుతుంది. అల్జీమర్స్, పార్కిన్సన్స్, మల్టిపుల్ స్లెరొసిస్, బ్రెయిన్ ట్యూమర్, మనింజైటిస్ వంటి వ్యాధుల నివారణలో దాల్చిన చెక్క చక్కగా ఉపయోగపడు తోందని అద్యయనంలో వెల్లడయింది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. పాలీఫెనాల్స్ అనే యాంటీఆక్సిడెంట్లు వ్యాధుల భారినపడకుండా కాపాడతాయి.

క్యాన్సర్(cancer) దరి చేరకుండా చూడటంలోనూ కీలకపాత్ర పోషిస్తుంది. కేన్సర్ కణాల పెరుగుదలను అడ్డు కోవడంలో ఇది సమర్థవంతంగా పనిచేస్తోందని పరిశోధనల్లో వెల్లడయ్యింది. బ్యాక్టీరియా, ఫంగల్ ఇన్ఫెక్షన్లపై పోరాటానికి పనిచేస్తుంది. ఫంగస్ కారణంగా వచ్చే శ్వాసకోశ ఇన్ఫెక్షన్లను దూరం చేయ డంలో దాల్చిన చెక్క నూనె సమర్థవంతంగా పనిచేస్తున్నట్టు వెల్లడయింది. నోటి దుర్గంధాన్ని దూరం చేస్తుంది. దంతక్షయాన్ని నివారిస్తుంది. HIV తో బాధపడే వారు రోజూ దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ