Chyawanprash Recipe: చ్యవన్‌ప్రాశ్ మంచి రసాయన ఔషధంగా చెప్పవచ్చు. ఇది రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు. వార్థక్య లక్షణాలు త్వరగా రాకుండా కాపాడుతుంది. దీని తయారీలో దాదాపు 45 నుంచి 50 రకాల మూలికలు వినియోగిస్తారు. ఇంటి వద్ద దీన్ని తయారు చేసుకోవడం కొంచెం కష్టం. కాబట్టి ఇందులో ప్రధానంగా వాడే మూలిక ఉసిరికాయ. దీన్ని ఉత్తమ రసాయనం అంటారు. దీనికి తేలికగా లభ్యమయ్యే మరికొన్ని మూలికలను కలిపి ఇంట్లోనే (Chyawanprash Recipe) తయారుచేసుకోవచ్చు. అదెలాగంటే!
కావాల్సిన పదార్థాలు: ఉసిరికాలయు-50, వెదురు ఉప్పు -20 గ్రా, పిప్పళ్ల చూర్ణం – 10 గ్రా, దాల్చిన చెక్క పొడి-పావు చెంచా, యాలకుల పొడి-పావు చెంచా, తేనె-30 గ్రా, నెయ్యి-30 గ్రా, నువ్వుల నూనె-30 గ్రా, చక్కెర-250 గ్రాములు.
చ్యవన్‌ప్రాశ్ తయారీ! (Chyawanprash Recipe)
ఉసిరికాయలను శుభ్రంగా కడిగి పలుచని వస్త్రంలో మూటకట్టాలి. కుక్కర్‌లో ఆవిరిపై ఉడికించాలి. మెత్తగా ఉడికిన తరువాత స్టీలు జల్లెడలో వేసి చేతితో రుద్దుతుంటే గింజలు, పీచు పైన ఉండిపోయి, మెత్తటి గుజ్జు కిందకి వస్తుంది. ఆ తరువాత మూడుకు వేడిచేసి నువ్వుల నూనె, నెయ్యి వేసి ఉసిరికాయ గుజ్జున అందులో బాగా వేయించాలి. వేరే గిన్నెలో చక్కెర పాకం పట్టి, వేయించిన గుజ్జును వేసి దగ్గరపడేవరకు ఉడికించాలి.
Chyawanprash Recipe: తరువాయత చల్లార్చి తేనె, వెదురు ఉప్పు, పిప్పళ్ల చూర్ణం, దాల్చి చెక్క పొడి, యాలకుల పొడి కలిపి శుభ్రమైన గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. ఉసిరికాయలు యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేసి శరీరంలో వ్యాధికారకాలు, మలినాలు చేరకుండా కాపాడతాయి. ఇలా తయారు చేసుకున్న ఈ చ్యవన్‌ప్రాశ్‌ను అయిదు నుంచి 10 గ్రాముల పరిమాణంలో ఉదయం, సాయంత్రం భోజనానికి కనీసం గంట ముందు తీసుకోవాలి. వెంటనే అరకప్పు గోరువెచ్చని పాలు లేదా నీళ్లు తాగాలి. ఈ విధంగా కనీసం ఏడాది పాటు తీసుకుంటే Healthకి చాలా మంచిది.