Christmas Prayer 2022: ప్ర‌తి ఒక్క‌రికీ ప్రార్థ‌న‌, ఉప‌వాసం అవ‌స‌రం

Christmas Prayer 2022: ప‌ర‌లోకం నుంచి దేవుని శ‌క్తి విడుద‌లకు చేసే విన్న‌ప‌మే ప్రార్థ‌న‌. ఇది ఒక బ‌ల‌మైన శ‌క్తి. నీతిమంతుడు మ‌న‌సులో చేసిన విజ్ఞాప‌న చాలా బ‌లం క‌లిగి ఉంటుందని యాకోబు 5:16 చివ‌ర‌లో చెప్పారు. నీతిమంతుడు నిజాయితీగా ప్రార్థిస్తే దేవుని శ‌క్తి విడుద‌ల అవుతుంది. ప్రార్థ‌న‌తో జీవితంలో గొప్ప మార్పు వ‌స్తుంది. గొప్ప మార్పు ఏమిటంటే జీవితం అత్య‌ద్భుతంగా సానుకూల‌ప‌డుతుంది.

అయితే ఉట్టి ప్రార్థ‌న‌లు స‌రిపోవు. అవి ఉప‌వాసంతో కూడిన ప్రార్థ‌న‌లుగా ఉండాలి. బాలుడి నుంచి ద‌య్యాన్ని వెళ్ల‌గొట్ట‌లేక పోవ‌డానికి కార‌ణం అవిశ్వాసం అని యేసు మ‌త్త‌యి 17:20 లో చెప్పాడు. మ‌రికొన్ని వ‌చ‌నాలు త‌ర్వాత ఆయ‌నే తిరిగి అన్నాడు. ద‌య్యాలు కేవ‌లం ప్రార్థ‌న‌, ఉప‌వాసాల ద్వారానే వ‌దిలి వెళ్లిపోతాయి అని. ప్రార్థ‌న – ఉప‌వాసం గురించి బైబిల్‌లో ఎంతో విపులంగా వివ‌రించ‌డం జ‌రిగింది. ఇవి ఎలా ఉండాలి? ఎప్పుడ చెయ్యాలి? వీటిని వివ‌రంగా ప‌రిశీలిద్ధాం!.

Christmas Prayer 2022: దేవుడికి మ‌నం దూరంటే ఉంటే

మ‌నం దేవుడి స‌హ‌వాసానికి దూరంగా ఉన్న‌ప్పుడు ఉప‌వాసం (fasting) ఉండాలి. పాపం మ‌న‌ల్ని దేవుడి నుంచి దూరంగా ఉంచుతుంది. అంతేకాక‌, మ‌న‌కు మ‌ర‌ణాన్నిస్తుంది. అయితే యేసు మ‌న‌కు ఇచ్చే పాప శిక్ష‌ణ‌ను శిలువ‌లో ఆయ‌నే అనుభ‌వించారు. ఈ విమోచ‌నా కార్యాన్ని విశ్వ‌సించిన‌ట్ట‌యితే దేవుడితో మ‌న సంబంధాలు బాగుప‌డ‌తాయి. అప్పుడు మ‌నం దేవుడికి దూరంగా ఉండం. ధీర‌త్వం, మారు మ‌న‌సు, పాక క్ష‌మాప‌ణ అనేవి దేవుని కృప‌ను బ‌ట్టి పొంద‌గ‌లం. మ‌న హృద‌యాలు దేవుని వాక్యం ప‌ట్ల ఎప్పుడు చ‌ల్ల‌బ‌డ‌తాయో అప్పుడు వెంట‌నే ప్రార్థ‌న‌, ఉప‌వాసాలుండాలి.

ఉప‌వాసం అనేది దేవుని (jesus) ప‌ట్ల మ‌న విధేయ‌త‌ను చూపుతుంది. ద‌మ‌స్ము మార్గంలో యేసును చూడ‌గానే పౌలు గుర్తించాడు. అత‌ను దేవుడిని ఎదురించి ఆయ‌న బిడ్డ‌ల‌నే హింసిస్తున్నాన‌ని, అందుకే మూడు రోజులు ప్రార్థ‌న, ఉప‌వాసం ఉన్నాడు. అప్పుడు ప‌రుశుద్ధాత్మ అనే వ‌రాన్ని పొంది, సువార్త‌ను అన్యుల వ‌ద్ద‌కు తీసుకొని వెళ్లేందుకు పిలుపును పొందాడు. అత‌ను దేవుడి కృప‌ను పొందేందుకు విన‌యాన్ని ఉప‌వాసం ద్వారా చూపాడు.

ఉప‌వాసంతో ప‌శ్చాత్తాపం

అవిశ్వాసులైన ఇశ్రాయెలీయుల‌పై దేవుడి కోపాన్ని తెలియ‌జేసి, ఆ కోపాన్ని ఉప‌వాసంతో కూడిన ప‌శ్చాత్తాపం ద్వారా ఆపించాల‌ని చెప్పాడు. ఇప్పుడైనా మీరు ఉప‌వాసం ఉండి, క‌న్నీరు కార్చుచూ, మ‌న‌స్పూర్తిగా తిరిగి నా వ‌ద్ద‌కు రండి. మీ వ‌స్త్రాల‌ను కాకుండా, మీ హృద‌యాల‌ను చింపుకుని ఆయ‌న చుట్టూ తిర‌గండి. ఆయ‌న మ‌న‌సు మార్చుకుని, ప‌శ్చాత్తాప‌డి, మీ దేవుడిఐన యోహోవాకు త‌గిన నైవేద్యాన్ని, పానార్ఫ‌ణాన్ని మీకు దీవెన‌గా అనుగ్ర‌హిస్తాడు. అదే విధంగా కొత్త నిబంధ‌న‌ లో దేవుని వ‌ద్ద‌కు రండి, అప్పుడు ఆయ‌న మీ వ‌ద్ద‌కు వ‌స్తాడు.

పాపులారా, మీ చేతుల్ని శుభ్రం చేసుకుండి. ద్విమ‌న‌స్కులారా, మీ హృద‌యాల‌ను ప‌రిశుద్ధ‌ప‌రుచుకోండి. వ్యాకుల‌ప‌డండి. దుఃఖ‌పడండి. ఏడ‌వండి. మీ న‌వ్వును దుఃఖానికి, మీ ఆనందాన్ని చింత‌కు మార్చుకొనుడి. ప్ర‌భువు దృష్టిలో మిమ్మ‌ల్ని మీరు త‌గ్గించుకోండి. అప్పుడు ఆయ‌న మిమ్మ‌ల్ని హెచ్చిస్తాడు. ఉప‌వాసం ఒక‌రి న‌లిగిన హృద‌యాన్ని చూప‌డ‌మే నిజ‌మైన ప‌శ్చాత్తాపానికి గుర్తు.

ఉప‌వాసం ద్వారా దేవుడిక క్ష‌మాప‌ణ‌

ఆహాబు ఇజ్రాయేలు రాజు. ప్ర‌భువు దృష్టిలో ఇత‌ర రాజులంద‌రి క‌న్నా ఎక్కువ చెడు చేసిన‌వాడు. అత‌నితో ఏలియా ద్వారా ప్ర‌వ‌చ‌నా రీతిగా అత‌నికి వ‌చ్చే శిక్ష‌ను గురించి దేవుడు తెలుప‌గా, ఆహాబు ఆ మాట‌లు విని త‌న వ‌స్త్రాల‌ను చింపుకుని, గోనెప‌ట్టా క‌ట్టుకుని,ఉప‌వాసం ఉన్నాడు. అది యెహోవా దేవుడు చూసి, ఏలియాతో ఆహాబు నాకు భ‌య‌ప‌డి విన‌యంగా ప్ర‌వ‌ర్తించ‌డం వ‌ల్ల ఆ అపాయం అత‌నికాలంలో (Christmas Prayer 2022) సంభ‌వింప‌కుండా ఆపి, అత‌ని కుమారుని కాలంలో కుటుంబీకుల మీద‌కు ర‌ప్పిస్తాను. అని అన్నాడు.

ఆహాబును క్ష‌మించిన దేవుడు ఈ ఉప‌వాస‌, ప్రార్థ‌న (prayer) రోజుల‌లో త‌న ప్ర‌జ‌ల‌ను కూడా క్ష‌మిస్తాడు. విన‌యంతో కూడిన ఉప‌వాసం, ప్రార్థ‌న క్ష‌మాప‌ణ‌ను తీసుకుని వ‌స్తుంది. దేవుడి వైపు మ‌న హృద‌యం చ‌ల్ల‌గా మారు తుంది. ప్రార్థ‌న‌, ఉప‌వాసాల ద్వారా విన‌యంతో ప్ర‌భువు స‌న్నిధిలో గ‌డ‌ప‌డం ద్వారా పోగొట్టుకున్న ప్ర‌భువు స‌హ‌వాసాన్ని పొంద‌గ‌లం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *