christmas message 2021

christmas message 2021:విశ్వాసానికి సాక్ష్య‌మే క్రిస్మ‌స్‌!

Spread the love

christmas message 2021 దేవుడు ఉన్నాడ‌ని, ఆయ‌న మ‌న్న‌లి ప్రేమిస్తున్నాడ‌ని నిరూపించే గొప్ప ఆపేక్షా పూరిత సాక్ష్య‌మే క్రిస్మ‌స్‌. మ‌న‌లో చాలామంది దేవుడున్నాడ‌ని విశ్వ‌సిస్తాం. ఆయ‌న ఉన్నాడ‌ని న‌మ్ముతాం. కానీ ఎక్క‌డ‌, ఏ విధంగా అని మ‌నం ఎరుగ‌ము. ఆయ‌న‌ను చూడ‌గ‌లిగిన‌ట్ల‌యితే, తాక గ‌లిగి ఉన్నట్ల‌యితే ఎంత బాగుండును! ఆయ‌న‌తో మాట్లాడి మ‌న‌కున్న ప్ర‌శ్న‌ల‌ను అడిగిన‌ట్ల‌యితే ఎంత బాగుండును! అస‌లు ఆయ‌న(christmas message 2021) ఎక్క‌డుంటాడు!

ఆయ‌న ఏం చేస్తాడు? ఆయ‌న ఎలాంటివాడు? భూలోకంలోని కీడును ఎందుకు నిర్మూలం చేయ‌డం లేదు? ఎందుకు మాట్లాడ‌డు? ఎందుకు క‌నిపించ‌డు? సార్వ‌త్రికంగా మ‌నంద‌రి వాంఛ ఇదే మ‌నం విశ్వ‌సించిన దేవుడ్ని చూడాల‌ని, తాకాల‌ని. విశ్వాసం అంటే క‌నిపించ‌నిది న‌మ్మ‌టం. కానీ ఆలా న‌మ్మ‌టానికి ఏదైనా(christmas message) ఆధారం ఉండాలి. లేన‌ట్ల‌యితే అది మూఢ‌న‌మ్మ‌కం లేక ఊహ‌గా ఉంటుంది. అటువంటి విశ్వాసం గుడ్డి విశ్వాసం అంటారు. చాలా మంది విశ్వాసానికి ఆధారాలు అవ‌స‌రం లేదు అనుకుంటారు.

కానీ మ‌నం జీవించ‌డానికి ఆధారాలు లేన‌ట్ల‌యితే జీవించ‌డం క‌ష్టం. క్రిస్మ‌స్‌, దేవుడున్నాడు, ఆయ‌న మ‌న్న‌లి ప్రేమిస్తున్నాడు అన్నవిశ్వాసానికి నిశ్చ‌య‌త‌ను ఇస్తుంది. ఎందుకంటే 2020 సంవ‌త్స‌రాల క్రితం దేవుడు మ‌న‌ప‌ట్ల ప్రేమ‌ను బ‌ట్టి వ్య‌క్తిగ‌తంగా ఆ మొద‌టి క్రిస్మ‌స్ దినాన మ‌న‌ల్ని ద‌ర్శించాడు. ఇందుచేత క్రిస్మ‌స్ దినాన సంబ‌రాలు చేసుకుంటున్నాము. దేవుడు మాన‌వుడిగా ఒక క‌న్య‌క‌కు, బెత్తెహేము అను గ్రామంలో (డిసెంబ‌ర్ 25) దినాన జ‌న్మించారు. దేవుడు శ‌రీరధారిగా ఏసుక్రీస్తుగా రావ‌డం మ‌న విశ్వాసానికి దృఢ‌నిశ్చ‌య‌త‌ను ఇస్తుంది. ఆయ‌న‌ను చూసిన వారు ఆయ‌న‌లో జీవించిన వారు ఆయ‌న‌ను గూర్చి బైబిల్(christmas message) గ్రంథంలో రాశారు.

దేవుడున్నాడు. ఆయ‌న భూలోకానికి మాన‌వుడుగా వ‌చ్చాడు. మ‌న‌ప‌ట్ల ఆయ‌న ప్రేమ వాస్త‌వం. ఆయ‌న‌యే యేసుక్రీస్తు. ఈ క్రిస్మ‌స్ దినం మీరు దేవుని ప్రేమ‌తో నింప‌బ‌డి, ఆయ‌న‌ను అనుభ‌వించిన దినంగా ఉందునుగాక‌! (మా ఖ‌మ్మంమీకోసం.కామ్ వెబ్‌సైట్‌ను చూస్తున్న, ఆద‌రిస్తున్న ప్ర‌తి ఒక్క‌రికీ క్రిస్మ‌స్ శుభాకాంక్ష‌లు.)

Annamayya Keerthanalu: శ్రీ వెంక‌టేశ్వ‌ర స్వామి వారి అన్న‌మ‌య్య సంకీర్త‌న‌లు

Annamayya Keerthanalu | నానాదిక్కుల న‌రులెల్లావాన‌ల‌లోన‌నె వ‌త్తురు గ‌ద‌లి స‌తులు సుతులుబ‌రిస‌రులు బాంధవులుహితులు గొలువ‌గా నింద‌ర‌నుశ‌త‌స‌హ‌స్ర యోజ‌న‌వాసులునువ్ర‌త‌ముల‌తోడ‌నే వ‌త్తురు గ‌ద‌లి ముడుపులు జాళెలు మొగిద‌ల‌మూట‌లుక‌డ‌లేని ధ‌న‌ముగాంత‌లునుక‌డుమంచిమ‌ణులు క‌రులుదుర‌గ‌ములువ‌డిగొని Read more

Veda Vyasa: చీక‌టిని తొల‌గించే శ‌క్తి గురువు వేద‌వ్యాసుడు Guru Purnima గురించి చెప్పిన నీతి సూత్రం ఇదే!

Veda Vyasa | ఏక‌రాశిగా ఉన్న వేదాల్ని నాలుగు భాగాలుగా విభజించి వ్యాసుడు Veda Vyasaడిగా పేరొందారు. అష్టాద‌శ పుర‌ణాల‌ను, 18 ఉప పురాణాల‌ను, విజ్ఞాన స‌ర్వ‌స్వ‌మైన Read more

Mangal Chandika: మంగ‌ళ చండీ వ్ర‌తం అంటే ఏమిటి? ఈ పూజ ఎలా చేయాలి?

Mangal Chandika | కుటుంబం చ‌ల్ల‌గా వ‌ర్థిల్లాలంటే శుభ‌ప్ర‌దంగా పుత్ర పాత్రాభివృద్ధి జ‌ర‌గాలంటే మంగ‌ళ చండీ పూజ చేయ‌డం మేలంటోంది. దేవీ భాగ‌వతం తొమ్మిదో స్కంధంలోని ఈ Read more

Good Friday 2022 Message: నీ విశ్వాసం నిన్ను స్వ‌స్థ ప‌రిచింది (స్టోరీ)

Good Friday 2022 Message | ఒక ఒంట‌రి ముస‌లాయ‌న త‌న ఇంటికి ద‌గ్గ‌రి దారి అవుతుంద‌ని ఒక పాడుబ‌డిన ఫ్యాక్ట‌రీలో నుంచి వెళుతున్నాడు. ఓ పెద్ద Read more

Leave a Comment

Your email address will not be published.