Christmas day 2022: యేసు జననం సమస్త మానవాళికి శుభదినం. ఆ వార్తే సువార్తమానం. ఆయన జననం వల్ల దేవునికి భూమి మీద సమాధానం దొరికింది. యేసు జననం (jesus born) తో జరిగిన సంఘటనను గుర్తు చేసుకుందాం. ప్రభుత్వ కాంతి వారి చుట్టూ ప్రకాశించడంతో వారు భయపడ్డారు. అయితే ఆ దూత భయపడ కండి, ఇదిగో, ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోకరమైన సువర్తమానం నేను మీకు జేస్తున్నాను. దావీదు పట్టణంలో ఈ రోజున రక్షకుడు మీ కోసం పుట్టాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు.
Christmas day 2022: రక్షకుడు మీ కోసం పుట్టాడు
కన్యక మరియకు ప్రసవ దినాలు నిండాయి. ఆమె తన తొలి చూలు కుమారుని కని, పొత్తి గుడ్డలతో చుట్టి, సత్రంలో స్థలం లేనందున ఆ బాలుడిని పశువుల తొట్టిలో పరుండబెట్టారు. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరు లు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా, ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచారు. ప్రభువు కాంతి వారి చుట్టూ ప్రకాశించడంతో ఇదిగో, ప్రజలందరికీ కలుగబోయే మహా సంతోషకర మైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణంలో ఈ రోజున రక్షకుడు మీ కోసం పుట్టాడు.
ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీకు ఆనవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టి ఉండి తొట్టిలో పడుకొని ఉండ టం మీరూ చూడండి. అని వారితో చెప్పారు. వెంటనే పరలోక సైన్య సమూహం ఆ దూతతో కూడా ఉండి, సర్వో న్నత మైన స్థలంలో దేవుడికి, ఆయనకు ఇష్టులైన మనుషులకు భూమి మీద ప్రయోజనం కలుగును గాక.. అని దేవుని స్తోత్రం చేశారు. వెంటనే గొర్రెల కాపరులు బయలుదేరి బెత్లెహేము చేరుకుని యేసును కనుగొని దేవుడి మహిమను వెల్లడించారు.
మార్గం, సత్యం, జీవం ఆయనే!
యేసు ఈ లోకానికి తన జననం ద్వారా ఉపశమనాన్ని(Christmas day 2022) తీసుకొని వచ్చాడు. ప్రజలందరూ పాపాన్ని వదిలి, సంతోషంతో దేవునితో తమ ఇరుగు పొరుగుతో కలిసి ఉండాలనేదే ఆయన ఉద్దేశం. అందుకే యేసుకున్న మరో పేరు షాలోము రాజు. అంటే సమాధాన కర్తను ప్రార్థించాలి. ఆయనను నమ్మినవాడు సంతోషంగా ఉంటాడు అనే మాట సత్యం. అందుకే యేసు అన్నాడు. నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని. సత్యం అంటేనే యేసు, భూలోక ప్రజలకు సమాధానాన్ని, సంతోషాన్ని పంచే రాజు జననం ఒక సువర్తమానం. ఒక గొప్ప పండుగ. అందుకే క్రిస్మస్ జరుపుకుందాం. Christmas day 2022 లో మీకు సంతోషం కలగాలి. యేసు ఉన్న హృదయంలో ఆనందం ఉంటుంది.
పరలోక రాజ్యము ప్రభువు తీర్పు
ప్రభువు మహిమలో వచ్చినప్పడు ప్రజలకు తీర్పు చెప్పు విధానం వివరించబడింది. ప్రభువు మహిమ సింహాసనాసీనుడై యుంటాడు. దేవదూత గణములు ఆయనతో ఉంటారు. సమస్త జనుములు ఆయన యొదుట కూడుదురు. గొల్లవాని వలె మేకలలో నుండి గొఱ్టెలను వేరుపరిచి, గొఱ్టెలను కుడివైపునను, మేకలను ఎడమ వైపునను నిలువబెట్టును. ఇది తీర్పు సభ, గొఱ్టెలు దేవుని చేత ఆశీర్వదించబడినవారు. మేకలు శపించబడిన వారు.
కుడి వైపునున్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా, రండి, లోకము పుట్టినది మొదలు కొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి..మత్తయి 25:34. వీరు ఆకలిగొన్న వారికి ఆహారము, దప్పిగొన్నవారికి దాహము, పరదేశులకు ఆశ్రయము, దిగంబరులకు బట్టలు, రోగులను దర్శించ డము, చెరలోనున్న వారిని సందర్శించుట చేసిన వారు. తన ఎడమ వైపునున్న వారిని చూచి, శపింపబడిన వారలారా, నన్ను విడిచి అపవాదికిని, వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి పోవుడి (మత్తయి 25:41). వీరు దేవుని పేరిట అల్పులైన సోదరులకు పైన ఆశీర్వదింపబడిన వారు చేసినట్టూ ఏమి చేయలేదు.