Christmas Cake Recipe: క్రిస్టమస్ పండుగ వస్తుంది. అందరి ఇళ్లల్లో పిండి వంటలు ప్రారంభమవుతాయి. ముఖ్యంగా కేక్ అనేది పిల్లలకి చాలా ఇష్టం. దాని కోసం బయట దుకాణాలకు వెళ్లి కొనుక్కోవాల్సి వస్తుంది. బయట దొరికే కేక్‌లు కొందరు ఇష్టపడరు. ఎందుకంటే అవి ఎప్పుడు తయారు చేస్తారో, ఏఏ రసాయాలను వేసి తయారు చేస్తారోనని భయం. కాబట్టి ఇంటిలోనే చేసుకుంటే అందరికీ ఆరోగ్యం. కింద తెలిపిన విధంగా క్రిస్మస్ ప్లమ్ కేక్, బటర్ స్కాచ్ కేక్, ఆరెంజ్ ఫ్రూట్ కేక్ తయారీ తెలుసుకోని Christmas Cake Recipe ఇంటిలోనే చేసుకోండి.
Christmas Cake Recipe : క్రిస్టమస్ కేక్‌లు తయారీ
క్రిస్మస్ ప్లమ్ కేక్ తయారీ (Christmas Plum Cake)
కావాల్సిన పదార్థాలు:
వెన్న : 100 గ్రాములు
చక్కెర : 100 గ్రాములు
మైదా : 100 గ్రాములు
రమ్ : మూడు చెంచాలు
కాజు : కొద్దిగా
కిస్మిస్ : కొన్ని
కొబ్బరి పౌడర్ : చెంచాడు
తయారు చేసే పద్ధతి:
ఒక చిన్న గిన్నెలో మూడు చెంచాల రమ్ వేసుకోవాలి. అందులో కాజు, కిస్మిస్లను నాలుగు గంటలు నానబెట్టాలి. మరొక గిన్నెలో వెన్న, చక్కెర బాగా కలగలిసేలా కలపాలి. ఎటువంటి ముద్దలు లేకుండా కలుపుకొని ఒక కేక్ బేసిన్ తీసుకొని, దాని అంచుకు మైదా, నూనె రాయాలి. తర్వాత ఇంతకు ముందు చేసిన మిశ్రమాన్ని ఈ గిన్నెలో వేసుకోవాలి. తర్వాత మైక్రోవేవ్‌లో అరగంట పాటు మీడియం హీట్‌లో కేక్ మధ్య బాగం వేగే వరకూ ఉంచి తీయాలి. తర్వాత చాకొలెట్ సిరప్ కానీ, చెర్రీస్తో కానీ కేక్ మీద అలంకరించుకోండి. ఇప్పుడు ఎంతో ఊరింతే క్రిస్మస్ ప్లమ్ కేక్ తయార్.
బటర్ స్కాచ్ కేక్ (Butterscotch cake)
కావాల్సిన పదార్థాలు:
మైదా పిండి : 100 గ్రాములు
వెన్న : 100 గ్రాములు
పంచదార పొడి : 100 గ్రాములు
కోడి గుడ్లు : రెండు లేదా మూడు
బేకింగ్ పౌడర్ : ఒక టీ స్పూన్
వంట సోడా : అర టీ స్పూన్
పాల పొడి : రెండు టేబుల్ స్పూన్లు
బటర్ స్కాచ్ ఎసెన్స్ : ఒక టీ స్పూన్
లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ : తగినంత
ఐసింగ్ కోసం..
వెన్న : 100 గ్రాములు
ఐసింగ్ షుగర్ : 200 గ్రాములు
లెమన్ ఎల్లో కలర్ : కఒన్ని చుక్కలు
బటర్ స్కాచ్ కాండీస్ : అర కప్పు
వేడి నీరు : కొద్దిగా
తయారు చేసే విధానం :
ఒక పాత్రలో కొంత మైదా పిండి, బేకింగ్ పౌడర్, వంట సోడా, పాల పొడి, వెన్న, పంచదార వేసి కలపాలి. తరువాత ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి గిలకొట్టాలి. దీనికి కోడిగుడ్ల సొన, బటర్ స్కాచ్ ఎసెన్స్, లెమన్ ఎల్లో ఫుడ్ కలర్ చేర్చి మళ్లీ ఒకసారి మిక్సీలో గిలకొట్టాలి. మరీ పలచగా అనిపిస్తే మైదాపిండిని కొద్దికొద్దిగా చేర్చూతూ మళ్లీ మిక్సీలో గిలకొట్టాలి. తరువాత ఎలక్ట్రిక్ ఓవెన్లోని గిన్నెలో కొద్దిగా డాల్టా రాసి, ఈ మిశ్రమాన్ని ఆ గిన్నెలో పోసి 180 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 40 – 50 నిమిషాలు బేక్ చేయాలి. బేకింగ్ పూర్తయి చల్లారాక కేక్‌పైన ఐసింగ్ చేయాలి.
ఐసింగ్ (icing) ఇలా : వెన్న, ఐసింగ్ షుగర్లను ఒక పాత్రలో వేసి నురుగు వచ్చేంత వరకూ గిలకొట్టాలి. దీనికి ఎసెన్స్, ఫుడ్ కలర్, కొద్దిగా వేడి నీరు చేర్చి మళ్లీ గిలకొట్టాలి. ఈ మిశ్రామాన్ని కేక్‌పైన పల్చగా పోసి బటర్ నైఫ్ సహాయంతో కేక్ అంతటా సమంగా సర్థాలి. ఆపైన బటర్‌స్కాచ్ క్యాండీస్‌తో అలంకరించాలి.
ఆరెంజ్ ఫ్రూట్ కేక్ (Orange Fruit Cake)

కావాల్సిన పదార్థాలు:
మైదా పిండి : 100 గ్రా
వెన్న : 100 గ్రా
పంచదార పొడి : 100
చెర్రీస్, కిస్మిస్, టూటీ ఫ్రూటీ ముక్కలు : 100 గ్రా
కోడిగుడ్లు : రెండు
బేకింగ్ పౌడర్ : ఒక టీ స్పూన్
వంట సోడా : అర టీ స్పూన్
పాల పొడి : రెండు టేబుల్ స్పూన్లు
ఆరెంజ్ ఎసెన్స్ : ఒక టీ స్పూన్
కమలా పండు తొనలు : అర టీ స్పూన్
ఆరెంజ్ ఫుడ్ కలర్ : కొన్ని చుక్కలు
తయారు చేసే విధానం :
మైదా పిండి, బేకింగ్ పౌడర్, వంట సోడా, పాల పొడి, వెన్న, పంచదార మిక్సీలో వేసి బాగా గిలకొట్టాలి. దీనికి కోడిగుడ్ల సొన, ఆరెంజ్ ఎసెన్స్, ఫుడ్ కలర్ చేర్చి మళ్లీ ఒకసారి మిక్సీలో గిలకొట్టాలి. ఒక వేళ పిండి మిశ్రమం పలచగా ఉంటే మైదా పిండిని కొద్దికొద్దిగా చేర్చుతూ గిలకొడుతూ పోయాలి. ఇందులో కిస్మిస్, చెర్రీ, టూటీఫ్రూటీ ముక్కలు, కమలాపండు తొనల ముక్కలు వేసి బాగా కలపాలి. తరువాత కేక్ తయారు చేసే పాత్రలో కొద్దిగా డాల్టా రాసి, ఈ మిశ్రమాన్ని ఆ గిన్నెలో పోసి దాన్ని ఎలక్ట్రిక్ ఓవెన్లో ఉంచి, 180 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 40-50 నిమిషాలు బేక్ చేయాలి. ఇకేముంది ఆరెంజ్ ఫ్రూట్ కేక్ రెడీ.