cholesterol and onions కొందరు వ్యక్తులు అధిక కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతుంటారు. దీనికి సంబంధించి ఆరోగ్య చిట్కాలు పాటించకుంటే ఊభకాయంతో పాటు గుండె సంబంధిత వ్యాధులు తీవ్రమవుతాయి. అంతే కాకుండా ఇతర హానికారక వ్యాధులు సంభవించే అవకాశమూ ఉంది. కాబట్టి కొలెస్ట్రాల్‌ను క్రమ క్రమంగా తగ్గించుకుంటూ ఉంటే నిత్యం ఆరోగ్యంగా మెరిసిపోవచ్చు. కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవడానికి ఎంతో కష్టపడాల్సిన అవసరం లేదు. వ్యాయామం చేయడం, ఇతర కష్టతర పనులు చేయాల్సిన అవసరం లేదని నిపుణులు అంటున్నారు. ప్రతిరోజూ పచ్చి ఉల్లిపాయ(onions) తీసుకుంటే చాలు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు వెల్లడిస్తున్నారు.
షుగర్ ను తగ్గించు గుణం ఉల్లిపాయలో!
ఉల్లిపాయలో క్రోమియం ఎక్కువ మోతాదులో నిల్వ ఉంటుంది. దాని వల్ల షుగర్‌లెవల్స్ క్రమబద్ధం చేస్తూంది. అదే విధంగా టైప్-2 డయాబెటిస్ ను ఉల్లిపాయ నివారిస్తుంది. పచ్చి ఉల్లిపాయ నిత్యం తీసుకుంటే అధిక కొలెస్ట్రాల్(cholesterol and onions)ను అతి తక్కువ సమయంలో తగ్గించుకోవచ్చు. ఉల్లిపాయ గొప్ప యాంటీ ఇన్ల్పమెంటరీ, యాంటీ సెప్టిక్, యాంటీ బయోటిక్, యాంటీ మైక్రో బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఇందులో విటమిన్ సి, బి1, బి6, విటమిన్ కె. బయోటిన్, క్రోమియం,క్యాల్షియం, ఫోలిక్ యాసిడ్, డైటరీ ఫైబర్ వంటివి పుష్కలంగా ఉన్నాయి. ఇన్ని పోషక విలువలు కలిగిన ఉల్లిపాయను ప్రతిరోజూ డైటింగ్‌లో చేర్చుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు.

ఆస్తమాకు ఉల్లిపాయతో పరిష్కారం!
ఉల్లిపాయ సాధారణ జలుబు, దగ్గు, శ్వాసనాళపు వాపు, ప్ల్యూమోనియ, అధిక జ్వరం, ఆస్తమా వంటి జబ్బుల్ని నివారిస్తుంది. ఇంకా పొట్ట సమస్యలు, వికారం, డయేరియాను నివారించడానికి దోహదపడుతుంది. ఇందులో ఉండే యాంటీ క్యాన్సర్ పవర్ క్యాన్సర్‌ను దరిచేరనివ్వదు. ఈ ఉల్లిపాయ కేవలం ఆరోగ్య పరంగానే కాదు బ్యూటీపరంగాను ఉపయోగపడుతుంది. ఉల్లిపాయ రసంను అప్లై చేయడం వల్ల జుట్టు మృదువుగా తయారవుతుందని బ్యూటీషియన్లు అంటున్నారు. అలాగే చర్మ సమస్యల్ని నివారించుకోవడానికి ఈ ఉల్లిపాయతో ఎన్నో రెమెడీస్ చేసుకోవచ్చని వారు సూచిస్తున్నారు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!