Chocolate Day 2022: ప్రేమ వారోత్సవాల్లో ఒకటైన చాక్లెట్ డే కు ప్రత్యేకత ఉంది. ప్రేమను చాటుతూ ఇచ్చే చాక్లెట్ బంధాన్ని పెంచుతుంది. చాక్లెట్ తింటే మానసిక ఉల్లాసం, ఉత్సాహం కలుగుతుందని సైన్స్ చెబుతోంది. ఇవి తింటున్నప్పుడు ఇచ్చిన వారు గుర్తొచచి వారి పట్ల ప్రేమ పెరుగుతుందని చాలా మంది నమ్మకం. మీ మనసులోని వారికి ఈ రోజు (February 9) చాక్లెట్ ఇచ్చి వారి కళ్లల్లోని(Chocolate Day 2022) ఆనందాన్ని చూడండి.
తియ్యని అందం!
చాక్లెట్ చూస్తే నోరూరనిది ఎవరికి! అయితే దీన్ని అందాన్ని మెరుగుపర్చడంలోనూ ఉపయోగించవచ్చని ఎంత మందికి తెలుసు! మీరు వాడే చాక్లెట్లో కోకా 70 శాతానికి పైగా ఉంటే ఇంకా మంచిదట. టేబుల్ స్పూన్ చొప్పున కరిగించిన చాక్లెట్, అలీవ్ నూనె, కోడిగుడ్డులోని తెల్లసొన కలిపి బాగా కలపాలి. ఆ తరువాత మెడకీ, ముఖానికీ పూతలా వేయాలి. పావు గంట ఆగి గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా తరుచూ చేయడం వల్ల చర్మానికి తగిన తేమ అంది తాజాగా కనిపిస్తుంది.
చర్మం నిగారింపు కోల్పోయింది అనుకున్నప్పుడు చాక్లెట్లు ఫేస్ ప్యాక్ చక్కని పరిష్కారం చూపుతుంది. చర్మానికి సాగే గుణాన్ని అందిస్తుంది. చాక్లెట్ను కరిగించి దానికి చెంచా యాపిల్, అరటిపండు, స్ట్రాబెర్రీ గుజ్జులను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకీ, చేతులకూ రాసుకోవాలి. 15 నిమిషాల పాటు ఆరనిచ్చి ఆపై చన్నీళ్లతో కడిగేసుకోవాలి. అలా చేయడం వల్ల చర్మం కాంతిమంతంగా మారుతుంది.

కాలుష్యం, దుమ్మూ దూళితో కొన్నిసార్లు చర్మం గరుకుగా మారుతుంది. ఇలాంటప్పుడు టేబుల్ స్పూన్ కరిగించిన చాక్లెట్లో అంతే పరిమాణంలో పాలమీగడా, తేనె కలిపి, దాన్ని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాలయ్యాక కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తుంటే చర్మం మృదువుగా మారుతుంది. చూశారా..! చాక్లెట్ కు ప్రేమను పంచడమే కాదు.. అందానికీ కూడా ఉపయోగపడుతుందని తేలిపోయింది.
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ