Chittoor news: చిత్తూరు: ఆవుని చేలో ఎందుకు మేపుతున్నావు అని అన్నందుకు ఓ వ్యక్తి పళ్లు ఊడిపోయేలా దాడి చేసిన సంఘటన చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం గంగవరం మండలం గండ్రాజు పల్లి పంచాయతీ పెద్ద ఓగిని గ్రామంలో యూనస్ అనే వ్యక్తి కి చేను ఉంది. అతని చేనులో ఒక ఆవు మేస్తుండగా, చేలో ఎందుకు మేపుతున్నావు? అని ఆవు యజమానిని ప్రశ్నించారు.
దీంతో కోపోద్రోక్తుడైన ఆవు యజమాని రాజా సాహెబ్ తన కుమారులతో కలిసి యూనుస్ పై దాడి చేశారు. ఈ దాడిలో బాధితుడి పళ్లు ఊడిపోయాయి. దీంతో సొమ్మసిల్లి పడిపోయిన యూనుస్‌ను పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.తనను చితకబాదిన వ్యక్తులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు.
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!