Chittoor News | Computer విడిభాగాలను చోరీ చేసి తిరుగుతున్న అంతర్రాష్ట దొంగలను Putalapattu పోలీసులు అరెస్టు చేశారు. వీరు సెల్‌ఫోన్లు వాడకుండా పోలీసులు కన్నుగప్పి తప్పించుకుని తిరుగు తున్నారు. తమిళనాడు, ఆంధ్రా, కర్ణాటకలలోని ఇంజనీరింగ్ కాలేజీ Computer ల్యాబ్‌లలో ర్యాం, ప్రాససర్, మానిటర్, సిపియులను భారీ ఎత్తున చోరీ చేసి చెన్నై, వేలూరు, బెంగళూరు లోని చోర్ మార్కెట్లలోకి విక్రయిస్తున్నట్టు Policeలు తెలిపారు.
గత 12 సంవత్సరాలుగా మొత్తం 28 collegeల్లో చోరీ చేసిన ఈ ముఠా ఎట్టకేలకు చిత్తూరు(Chittoor News) జిల్లా పోలీసులకు చిక్కారు. ముఠాకు చెందిన 5 గురిని అరెస్టు చేశారు. వీరి వద్ద నుండి 940 ర్యాంలు, 95 ప్రాససర్లు, 5 మానిటర్లు, 3 CPUలు, లక్ష రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాను పట్టుకోవడానికి కృషి చేసిన చిత్తూరు DSP సుధాకర్ రెడ్డి, పాకాల CI ఆశీర్వాదం, పూతలపట్టు ఎస్సై మనోహర్, సిబ్బందిని అభినందిస్తూ రివార్డులను చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి అందజేశారు.