Chittoor Murder News: Premonmadi Suicide
Chittoor: చిత్తూరులో సంచలనం సృష్టించిన ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన యువతి గాయత్రీ ఘటనకు ముగింపు పడింది. పైశాచికంగా దాడి చేసి హతమార్చిన ప్రేమోన్మాది ఢిల్లీబాబు పెనమూరు అడవిలోకి వెళ్లి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
చిత్తూరు జిల్లాలో మంగళవారం చోటు చేసుకున్న యువతి గాయత్రి హత్య వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. తనను ప్రేమించాలంటూ వేధిస్తూ గాయత్రిని అతికిరాతకంగా కత్తితో దాడి చేసి హత్య చేసిన ఢిల్లీబాబు మంగళవారం పెనుమూరు అటవీ ప్రాంతాల్లోకి పారిపోయాడు. దీంతో పోలీసులు అతనిపై నిర్భయ, దిశ చట్టం కింద కేసు నమోదు చేశారు. అలాగే యువతి గాయత్రి బంధువులు ఆగ్రహానికి లోనై ఢిల్లీబాబు ఇంటిపై దాడికి దిగారు.
ఢిల్లీబాబు గ్రామమైన చింతమాలకుపల్లె లో భయానక వాతావరణం కనిపించింది. దీంతో పోలీసులు గ్రామాన్ని చుట్టుముట్టి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గట్టి చర్యలు చేపట్టారు. ఇకపోతే గాయత్రీని హత్యచేసి పరారైన ప్రేమోన్మాది బుధవారం మృతి చెందాడు. పెనుమూరు అటవీ ప్రాంతంలో చెట్టకు ఉరివేసుకుని విగత జీవిగా కనిపించాడు. కాగా పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేశారు.
ఇది చదవండి : అత్యంత దారుణంగా యువతిని హత్య చేసిన ప్రేమోన్మాది
ఇది చదవండి : తిట్ల మీద ఉన్న పట్టు శాఖపై లేదు: అచ్చెన్నాయుడు
ఇది చదవండి :చెట్టుకు ఉరేసుకొని ప్రేమికుల ఆత్మహత్య