Chittoor District Latest news | VRA Geeta, Ramachandrapuram Mandal | చంటి బిడ్డతో ప్రభుత్వ విధులకు హాజరైన వీఆర్ఏ
Chittoor District Latest news | VRA Geeta, Ramachandrapuram Mandal | చంటి బిడ్డతో ప్రభుత్వ విధులకు హాజరైన విఆర్ఓChittoor: ప్రభుత్వ ఉద్యోగం చేసే వారిలో కొందరిలో నిర్లక్ష్యం అప్పుడప్పుడు మీడియా కంటికి కనిపిస్తూ ఉంటుంది. ప్రభుత్వ ఆఫీసుల్లో సమయానికి రాని ఉద్యోగులు, ఖాళీగా దర్శినమిస్తున్న కుర్చీలు, పడిగాపులు కాస్తున్న ప్రజలు.. ఇలా ఎన్నో శీర్షికలతో చూస్తూనే ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగమంటే ఏదో ఆఫీసుకు వచ్చి పూటగడిచిందా? లేదా అనే విధంగా వ్యవహరించే వారూ ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగమంటే ఒక దైవంలా భావించి, నిజాయతీగా తమ కర్తవ్యాన్ని పాటించేవారూ ఉన్నారు. ఏదేమైనా ప్రజలకు మాత్రం వారి చేసే సేవలు మెచ్చుకోవాల్సిందే.
అయితే ఈ ఫొటోలో ఉన్న ఒక మహిళా ఉద్యోగిని గమనించారా? ఒక చంటి పిల్లాడిని ఒడిలో ఉంచుకుని ఏదో పేపర్లు సీరియస్గా పరిశీలిస్తుంది కదా!. ఆ మహిళా ఉద్యోగిని పేరు గీత. ఆమె చిత్తూరు జిల్లా రామచంద్రాపు రం మండలం తహశీల్దార్ పరిధిలో వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నారు.అయితే విఆర్ఏగా విధులు నిర్వహిస్తున్న గీత ఏడాది బిడ్డతో కలిసి శనివారం విధులకు హాజరయ్యారు.
అసలే ఎన్నికల హడావుడి ప్రారంభమవ్వడంతో తన చంటి బిడ్డతో విధుల్లో నిమగ్నమయ్యారు. మండంలోని పనులు నిమిత్తం కార్యాలయానికి వచ్చిన పలువురు ప్రజలు తల్లి ఒడిలో నిద్రపోతున్న చంటి బిడ్డకు ఏమాత్రమూ ఇబ్బంది కలగకుండా విధుల్లో నిమగ్నమైన వీఆర్ఏ గీతను చూసి ఆశ్చర్యపోతున్నారు. ప్రభుత్వ విధుల పట్ల తన నిబద్ధతను పలువురు ప్రశంసిస్తున్నారు. అన్నట్టు ఈ ఫొటోను దామోదర్ రెడ్డి అనే జర్నలిస్టు (ఏపీ క్రైం న్యూస్ మీడియా వాట్సాప్ గ్రూపు) ద్వారా షేర్ చేశారు.
ఇది చదవండి:మోగిన స్థానిక సంస్థల ఎన్నికల గంట! మరి సజావుగా నడిచేనా?
ఇది చదవండి:ముదురుతున్న స్థానిక సంస్థల ఎన్నికల “రాజకీయ” పంచాయతీ
ఇది చదవండి : బెదిరింపులకు భయపడేవాళ్లం కాదు!
ఇది చదవండి : నా విజయం వెనుక అమ్మ ఉంది
ఇది చదవండి : నకిలీ మిరపనారు..లబోదిబోమంటున్న రైతన్నలు
ఇది చదవండి: 19న నితిన్ కొత్త సినిమా ‘చెక్’ విడుదల
ఇది చదవండి: గ్రామాలకు సీఎం జగన్ శుభవార్త
ఇది చదవండి: కస్టమర్లగా వచ్చారు. కోట్లలో లూటీ చేశారు!