Fake Currency

Fake Currency : న‌కిలీ నోట్ల క‌ల‌కలం – ఇంట్లోనే ప్రింటింగ్ సెట‌ప్ పెట్టి!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌

Fake Currency : న‌కిలీ నోట్ల క‌ల‌కలం – ఇంట్లోనే ప్రింటింగ్ సెట‌ప్ పెట్టి!

Fake Currency : ప్ర‌కాశం జిల్లా చీరాల‌లో న‌కిలీ నోట్లు త‌యారు చేస్తున్న ముఠా గుట్టుర‌ట్ట‌య్యింది. చీరాల బాల సాయి న‌గ‌ర్ లో ఓ ఇంట్లో దొంగ నోట్లు త‌యారు చేస్తున్న ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ప‌రారీలో ఉన్న మ‌రో ఇద్ద‌రి కోసం గాలింపు చేప‌ట్టారు. అరెస్ట్ అయిన వారి వ‌ద్ద నుంచి న‌కిలీ నోట్లు త‌యారీకి వినియోగిస్తున్న ముద్ర‌ణ అచ్చులు, కంప్యూట‌ర్‌, జిరాక్స్ మిష‌న్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు రూ.80 వేలు న‌కిలీ క‌రెన్సీ సీజ్ చేశారు.

ప‌క్కా స‌మాచారం రావ‌డంతోనే!

చీరాల బాల సాయి న‌గ‌ర్ లో ఓ ఇంట్లో దొంగ నోట్లు త‌యారు చేస్తున్నార‌న్న ప‌క్కా స‌మాచారంతో రాత్రి పోలీసులు దాడి చేశారు. దొంగ నోట్ల త‌యారీలో నిమ‌గ్న‌మై ఉన్న ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దాడి స‌మ‌యంలో అక్క‌డే ఉన్న మ‌రో ఇద్ద‌రు ప‌రార‌య్యారు. ప‌రారైన వారి కోసం పోలీసులు గాలింపు చేప‌ట్టారు. ఇంట్లో దొంగ నోట్ల తయారీకి వినియోగిస్తున్న ముద్ర‌ణ అచ్చులు, ఒక కంప్యూట‌ర్‌, ఒక జిరాక్స్ మిష‌న్‌తో పాటు రూ.50 వేలు న‌కిలీ క‌రెన్సీ స్వాధీనం చేసుకున్నారు. రూ.500, రూ.200, రూ.50 న‌కిలీ క‌రెన్సీ త‌యారు చేస్తున్న‌ట్టు పోలీసులు గుర్తించారు. ప్ర‌ధాన నిందితుడు మ‌ధుసూద‌న‌రావు గ‌తంలో ఒక‌సారి దొంగ నోట్ల తయారు చేసి జైలుకు వెళ్లి వ‌చ్చిన‌ట్టు పోలీసులు గుర్తించారు.

Share Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *