Chintamani Natakam | తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు పేరుగాంచిన చింతామణి నాటకంపై కొన్ని నెలల కిందట ఏపీ ప్రభుత్వం నిషేధం విధించిన విషయం విధితమే. అయితే ఈ నాటకంపై ఆధారపడి జీవిస్తున్న ఎంతో మంది పేద, నిరుపేద కళాకారులు ఇప్పుడు దిక్కుతోచని పరిస్థితుల్లో జీవనం కొనసాగిస్తున్నారు. Chintamani Natakam నిషేధంపై కొందరు సమర్థించగా, మరికొందరు విమర్శలు చేశారు. తాజాగా నాటకాన్ని నిషేధించడంపై MP రఘురామకృష్ణ రాజు హైకోర్టును ఆశ్రయించారు.
రఘురామకృష్ణరాజు తరపున వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది Umesh చింతామణి నాటకాన్ని నిషేధించడం వాక్ స్వాంతంత్య్రాన్ని హరించడమేనని ధర్మాసనం ఎదుట తమ వాదనలు వినిపించారు. నాటకాన్ని నిషేధించిన కారణంగా పలువురు కళాకారులు జీవన ఉపాధి కోల్పో్యారని తెలిపారు. దేవదాసి చట్టానికి వ్యతిరేకంగా ఈ నాటకం వచ్చిందని కాబట్టి నాటకాన్ని నిషేధించాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు.
Chintamani Natakamన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై స్టే ఇవ్వాల్సిందిగా న్యాయవాది ఉమేష్ అభ్యర్థించారు. అయితే ఉమేష్ అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. కానీ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి మాత్రం హైకోర్టు ధర్మాసనం అంగీకరించింది. Chintamani Natakamకి సంబంధించిన అసలు పుస్తకం ట్రాన్సేట్ వెర్షన్ సమర్పించాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఈ కేసు ఆగస్టు 17కు వాయిదా పడింది.