Chinta Chiguru | ఏ రుతువులో దొరికే పండ్లు, కూరలను ఆ రుతువులో వాటడం మన ఆరోగ్యానికి మంచిది. ఈ సీజన్లో విరివిగా లభించే చింత చిగురు తినడం వల్ల కలిగే లాభాలు చెప్పలేన్ని అయితే వాటిలో కొన్ని ఇక్కడ తెలియజేస్తున్నాం!.
చింత చిగురు వల్ల లాభాలు!
Chinta Chiguruలో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉండటం వల్ల విరేచనం సులభంగా అయ్యేలా చేస్తుంది. మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. ఫైల్స్ ఉన్న వారికి చింత చిగురు మంచి మందు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం వల్ల చెడు కొలెస్టరాల్ను తగ్గించి మంచి కొలెస్టరాల్ను పెంచుతుంది. చలి జ్వరం తగ్గాలంటే చింత చిగురును వాడాలి. ఎందుకంటే ఇందులోని ఔషధ కారకాలు ఇన్ఫెక్షన్లపై పోరాడుతాయి. చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి.
యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు Chinta Chiguru లో ఉన్నాయి. వేడి వేడి మసాలా పదార్థాలు తినడం వల్ల నోటిలో వచ్చే పగుళ్లు, పూతలను చింత చిగురు తగ్గిస్తుంది. Heart జబ్బులు రాకుండా చూస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. కడుపులో Nuli Puruguల సమస్యతో బాధ పడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది.


Chinta Chiguru లో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. ఇందువల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థ పటిష్టపడుతుంది. పలు క్యాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు చింత చిగురులో ఉన్నాయి. తరుచూ చింత చిగురును తింటే ఎముకలు దృఢత్వాన్ని సంతరించుకుంటాయి. Thyroid, డయాబెటిస్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు చింత చిగురును ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. నేత్ర సంబంధ సమస్యలను చింత చిగురు దూరం చేస్తుంది. కళ్లు దురదగా ఉన్నప్పుడు కాస్తంత చింత చిగురు తింటే ఉపశమనం కలుగుతుంది.