Chinta Chiguru Benefits | చింత చచ్చినా పులుపు చావలేదన్న సామెతను పలు సందర్భాల్లో పోలిక కోసం ఉపయోగిస్తుంటాం. పులుపు సంగతి ఎలా ఉన్నా చింత చిగురు వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనం ఉంది. ఈ కాలంలో విరవిగా లభ్యమయ్యే చింత చిగురుతో ఎన్నో లాభాలున్నాయి. చింత చిగురులో రైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది సహజ సిద్ధమైన లాక్సేటివ్గా పనిచేసి విరేచనం సులభంగా అయ్యేలా చేసుంది. మలబద్ధకం సమస్య తొలగిస్తోంది. పైల్స్ ఉన్న వారికి కూడా చింత చిగురు చాగా (Chinta Chiguru Benefits)పనిచేస్తోంది.
ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కవుగా ఉండటం వల్ల చింత చిగురు చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. ఇందులోని ఔషధ కారకాలు వైరస్ ఇన్ఫెక్షన్లపై పోరాడుతాయి. చలి జర్వం లాంటివి పోగొడుతుంది. చింత చిగురును ఉడికించిన నీటిని పుక్కలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు తగ్గుతాయి. యాంటీ ఇన్ఫార్మేటరీ గుణాలు చింత చిగురులో ఉన్నాయి.
వేడి వేడి మసాలా పదార్థాలు తినడం వల్ల నోటిలో వచ్చే పగుళ్లు, పూతలను చింత చిగురు తగ్గిస్తుంది. గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. శరీరంలో ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు చింత చిగురులో ఉన్నాయి. కడుపులో నులి పురుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది.
జీర్ణశయ సంబంధ సమస్యలను తొలగించడంలో చింత చిగురు బాగా ఉపయోగపడుతుంది. చింత చిగురులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధి లభిస్తాయి. ఇందు వల్ల ఇది శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తుంది. యాంటీ సెప్టిక్, యాంటీ వైరల్ గుణాలు దీంతో ఉన్నాయి. పలు రకాల క్యాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు చింత చిగురులో ఉన్నాయి. తరుచూ చింత చిగురును తింటే ఎముకలు ధృడత్వాన్ని సంతరించుకుంటాయి.
థైరాయిడ్ సమస్యలతో బాధపడుతున్న వారి చింత చిగురును తమ ఆహారంలో భాగం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. డయాబెటిస్ ఉన్న వారు కూడా చింత చిగురును వాడవచ్చు. ఇది వారి రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. ఆల్కహాలు ఎక్కువుగా సేవించడం వల్ల కలిగే హ్యాంగోవర్ నుంచి ఉపశమనం కలిగేలా చేస్తుంది. చింత చిగురును పేస్ట్ చేసి దానిని కీళ్లపై ఉంచితే నొప్పులు, వాపులు తగ్గిపోతాయి. అర్థరైటిస్ సమస్యతో బాధ పడుతున్న వారికి ఇది మేలు చేస్తుంది.

శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపే గుణాలు చింత చిగురులో ఉన్నాయి.ఇది యాస్ట్రిజెంట్లా పనిచేస్తుంది. నేత్ర సంబంధ సమస్యలను కూడా చింత చిగురు దూరం చేస్తుంది. కళ్లు దురదగా ఉన్నప్పుడు కొంత చింత చిగురును తింటే ఉపశమనం కలుగుతుంది.
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!