Chinese New Year 2022 Animal: ఈ ఏడాది చైనా నూత‌న వేడుక‌ల చిహ్న‌మైన జంతువు ఏమిటో తెలుసా?

Chinese New Year 2022 Animal ప్ర‌పంచ వ్యాప్తంగా 2022 నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లు మ‌న ముందుకు రావ‌డానికి కొన్ని గంట‌ల స‌మ‌య‌మే ఉంది. ఈ నూత‌న సంవ‌త్స‌ర 2022 వేడుక‌ల‌ను ప్ర‌పంచంలోని అన్ని దేశాలు జ‌రుపుకుంటాయి. ఈ వేడుక‌ల‌ను ఆయా దేశాల్లో వారి వారి స్టైల్ లో వేడుక‌లు జరుపుకుంటారు. అయితే 2021 సంవ‌త్స‌రం పాత జ్ఞాప‌కాల‌ను ఈ కొద్ది గంట‌ల వ‌ర‌కు గుర్తు చేసుకుంటూ కొత్త సంవ‌త్స‌రం 2021 మ‌రింత ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాల‌ని ఆలోచిస్తుంటారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా..ఇప్పుడు చైనా దేశంలో 2022 న్యూ ఇయ‌ర్ వేడుక‌లు మాత్రం కాస్త కొత్త ప‌ద్ధ‌తిలో అక్క‌డ ప్ర‌జ‌లు జరుపుకుంటారు. ప్ర‌తి ఏడాది లాగానే చైనీయులు ఈ నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌ను కూడా ఒక ప్ర‌త్యేక వేడ‌క‌గా జ‌రుపుకునేందుకు సంసిద్ధ‌మ‌వుతున్నారు.

చైనా దేశంలో చైనీయులు ప్ర‌తి సంవ‌త్స‌రం నూత‌న వేడుక సంద‌ర్భంగా ఒక జంతువును కేటాయించుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌తారంట‌. అదే విధంగా ఈ 2022 సంవ‌త్స‌రంలో కూడా ఒక జంతువును కేటాయించుకున్నారు. ఈ సాంప్ర‌దాయం దాదాపు 20 సంవ‌త్స‌రాల నుండి చైనా ప్ర‌జ‌లు పాటిస్తున్నారు.

Chinese New Year 2022 Animal

ఈ 2022 నూత‌న సంవ‌త్స‌రానికి (Chinese New Year 2022 Animal)గాను చైనీయులు పులి సంవ‌త్స‌రంగా పిలుస్తున్నారు. ఈ జంతువు పేరు ఎందుకు పెట్టారంటే..ఈ భూమిపైన అన్ని జంతువుల‌కు పులి రాజుగా పిలువ‌బ‌డుతుంది కాబ‌ట్టి.

The Year Of the Tiger

మ‌నం(ఇండియా) రాశి, ఫ‌లాలు చూసుకుని కేటాయించుకున్న‌ట్టు చైనా దేశంలో కూడా ఈ ప‌ద్ధ‌తిని పాటిస్తార‌ట‌. ఇప్పుడు ఈ ఏడాది మాత్రం వారికి రాశిచ‌క్రం పులిగా ఎంపిక చేసుకున్నారు. పులి బ‌ల‌మైన‌ది కాబ‌ట్టి వారి వారి పిల్ల‌లు, వారు బ‌లంగా, ధైర్యంగా ఉండాల‌ని కోరుకుంటున్నారు. చాలా మంది చైనీస్ పిల్ల‌లకి పులి బొమ్మ ఉన్న టోపీల‌ను, బూట్ల‌ను ధ‌రింప జేస్తారు. ఎందుకంటే వారిని ధైర్య‌వంతులుగా ఉంచ‌టానికి అంట‌. చైనాలో రాశి చ‌క్రంలో పులి మూడోవ స్థానంలో ఉంద‌ట‌. 12 రాశి చ‌క్ర జంతువులు కూడా ఈ క్ర‌మంలో ఉన్నాయ‌ట‌. ఎలుక‌, ఎద్దు, పులి, కుందేలు, డ్రాగ‌న్‌, పాము, గుర్రం, మేక‌, కోతి, రూస్ట‌ర్‌, కుక్క మ‌రియు పంది ఇలా వారి రాశిలో ఉన్నాయ‌ట‌. ప్ర‌తి సంవ‌త్స‌ర కాల చ‌క్రం ప్ర‌కారం ఒక జంతువు గుర్తును వారు నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌కు ఎంపిక చేసుకోవడం ఆన‌వాయితీగా వ‌స్తుంది.

ఇక చైనాలో 2022 న్యూ ఇయ‌ర్ వేడుక‌లు జ‌న‌వ‌రి 31 నుంచే ప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం ఉంది. అదే విధంగా చైనాలో జ‌రిగే లంత‌రు పండుగ ఫిబ్ర‌వ‌రి 15వ తేదీతో ఈ వేడుకులు అత్యంత వైభ‌వంగా ముగుస్తాయి.

Share link

Leave a Comment