Maglev Train: మాగ్లెవ్ ట్రైన్‌…దీనికి మించిన వేగ‌వంత‌మైన‌ది ప్ర‌పంచంలోనే లేద‌ట‌!

Maglev Train: బుల్లెట్ రైళ్లంటే ఠ‌క్కున గుర్తొచ్చేది చైనా దేశం. అలాంటి ఆ దేశం ఇప్పుడు మ‌రొ కొత్త ఆవిష్క‌ర‌ణ‌కు తెర‌తీసింది. ఈ భూమ్మీద‌నే అత్యంత వేగ‌వంత‌మైన రైలును త‌యారు చేసి మంగ‌ళ‌వారం ప్రారంభించింది. బుల్లెట్ ట్రైన్ కంటే ఎక్కువ వేగంగా వెళ్లే ఈ ట్రైన్ గురించి కొన్ని విష‌యాలు..!

గంట‌కు 600 కిలోమీట‌ర్ల వేగంతో ఈ మాగ్లెవ్ రైలు(maglev train) ప‌రుగులు పెడుతుంది. బీజింగ్ నుంచి షాంగైకి వెయ్యి కిలోమీట‌ర్ల దూరాన్ని కేవ‌లం రెండున్న‌ర గంట‌ల్లో చేరుకోవ‌చ్చు. అదే స‌మ‌యంలో అయితే దాదాపు 3 గంల స‌మ‌యం ప‌డుతుంది. అంటే విమానం క‌న్నా వేంగా అది ప్ర‌యాణించేస్తుద‌న్న‌మాట‌. అయితే మామాలు రైళ్ల‌కు ఇది పూర్తిగా భిన్న‌మైన‌ది. ప‌ట్టాలున్నా.. ప‌ట్టాల‌పై అది ప‌రుగులు తీయ‌దు. ప‌ట్టాల‌కు ఆన‌కుండా విద్యుద‌య‌స్కాంత శ‌క్తితో గాల్లో కొంచెం ఎత్తులో ఆ రైలు తేలియాడుతుంది. ఆ శ‌క్తితోనే దూసుకెళ్తుంది. ఖింగ్దావ్ లో ఆ రైలును చైనా అభివృద్ధి చేసింది.

వాస్త‌వానికి ఇంత‌కుముందు నుంచే చైనాలో మాగ్లెవ్ టెక్నాల‌జీతో రైళ్లు న‌డుస్తున్నాయి. అయితే, అవి ప‌రిమిత సంఖ్య‌లో ఉన్నాయి. అది కూడా కొద్ది దూర‌మే న‌డుస్తున్నాయి. షాంఘైలోని విమానాశ్ర‌యం నుంచి సిటీకి ఓ రైలు న‌డుస్తోంది. ఇప్పుడు జ‌పాన్‌, జ‌ర్మ‌నీ వంటి దేశాలు మాగ్లెవ్ రైలును అభివృద్ధి చేసేందుకు ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టాయి. అయితే, దానిక‌య్యే ఖ‌ర్చు, ప‌ట్టాల మౌలిక వ‌స‌తులే అడ్డంకిగా మారుతున్నాయ‌ట‌.

Share Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *