Chilamathur Mandal : Anathapur: ఊర కుక్కల దాడిలో సుమారు 20 గొర్రెలు మృతి చెందిన సంఘటన అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కోడూరు పంచాయతీ పరిధిలోని కనిశెట్టిపల్లి గ్రామంలో సోమవారం రాత్రి 10 గంటలకు చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన ప్రాథమిక వివరాలు మేరకు కనిశెట్టిపల్లి గ్రామానికి చెందిన ఉప్పన నల్ల సజ్జప్ప సాయంత్రం ఇంటికి చేరుకొన్న గొర్రెలను ఎప్పటిలాగానే కంచె వేసుకున్న రప్పంలోకి తోలాడు. ఇదే సమయంలో రాత్రి 8 గంటల సమయంలో కాపరి భోజనం చేయడానికి ఇంటికి వెళ్లాడు. ఇంటికి, గొర్ల మంద ఉన్న స్థలానికి దూరం ఉంది.
ఉప్పరనల్ల సజ్జప్ప భోజనం చేసి గొర్రెల మంద స్థలానికి చేరుకొని చూడగా గొర్రెల్లన్నీ చెల్లచెదురుగా బడి ఉన్నాయి. గొర్రెల మందల వద్ద ఊర కుక్కలు కనిపించాయి. గ్రామస్థులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. కుక్కలను తరిమికొట్టారు. అప్పటికే దాదాపు 20 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెల జీవనాధారంపై బతుకుతున్న బాధితుడు సజ్జప్ప కుటుంబం కన్నీరు పెట్టుకున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని విన్నంవించుకుంటున్నారు. ఈ ఘటన స్థానికులను కలిచి వేసింది.
ఇది చదవండి:మార్చి 10 నుంచి మున్సిపల్ ఎన్నికలు
ఇది చదవండి:ఖమ్మం పాత బస్టాండ్‌పై పెద్దల కన్ను
ఇది చదవండి:జమిలి ఎన్నికల దిశగా కేంద్రం అడుగులు!
ఇది చదవండి: ఫాస్టాగ్ పై కేంద్రం కొత్త నిబంధనలు..ఇక జరిమానానే!
ఇది చదవండి: నాగచైతన్య ఖాతాలో మరో కొత్త లవ్‌స్టోరీ సాంగ్!