chhatriwali movie | రకుల్ ప్రీతి సింగ్ కు ఇప్పుడు టాలీవుడ్ సినిమాలు ఏమీ లేనట్టు ఉంది. కావున ఇప్పుడు బాలీవుడ్లో తన సత్తా చూపించేందుకు ప్రయత్నిస్తుంది. ఇక ఏదేమైనా సరే అన్నట్టుగా వైవిధ్యమైన చిత్రాలు చేయడానికి సిద్ధమైంది. అదే కోవలో ఛత్రివాలి సినిమా డైరెక్టర్ Tejas Prabhaa Vijay Deoskar ఆధ్వర్యంలో రకుల్ ప్రీతి సింగ్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రకుల్ కండోమ్ టెస్టర్(chhatriwali movie)గా కనిపించబోతుంది. ఇప్పటికే ఈ సినిమా పోస్ట్‌ప్రొడక్షన్ పనులు అన్నీ పూర్తి చేసుకుంది. మొదటి సారి ఈ పాత్రలో ఆమె నటిస్తున్నప్పుడు రకుల్ ప్రీతి సింగ్ ఇలాంటి పాత్రలో నటిస్తుందేమిటని ఆమెపై ట్రోలింగ్ ప్రారంభించారు. అయితే ఈ ట్రోలింగ్స్‌పై రకుల్ స్పందించింది. ఒక చిన్న పట్టణం నుంచి వచ్చిన అమ్మాయి కండోమ్ టెస్టర్‌గా ఎలా మారిందనేది కథ. ఇందులో ఎలాంటి తప్పుడు సందేశం లేదని,ఈ పాత్ర ఎంచుకునేటప్పుడు తన తల్లిదండ్రులను అడిగానని, వారు ఒప్పుకున్నారని చెప్పుకొచ్చింది.
ఫెయిల్యూర్స్‌లో రకుల్
రకుల్ ప్రీతి సింగ్‌కు కొంత కాలంగా టాలీవుడ్‌లోనూ, బాలీవుడ్ లోనూ ఫెయిల్యూర్స్ చవిచూడాల్సి వచ్చింది. ఈ ప్రభావం తన వ్యక్తి గత జీవితంపైన కూడా ప్రభావం చూపింది. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోయిన తర్వాత డ్రగ్స్ కేసు బాలీవుడ్‌ను చుట్టుముట్టింది. రియా చక్రవర్తి అరెస్టుతో ఈ ఇష్యూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ లోపు కరోనా సెకండ్ వేవ్ వచ్చి డ్రగ్స్ కేసుకు కొంత బ్రేక్ ఇచ్చింది. అయితే ఆర్యన్ ఖాన్ అరెస్టు తర్వాత మళ్లీ డ్రగ్స్ కేసులు, సమన్లు మొదలయ్యాయి. ఈ డ్రగ్స్ కేసుతో రకుల్ ప్రీతి సింగ్‌కు jackky bhagnani తో ప్రేమకు బ్రేకప్ పడిందని అంటున్నారు సినీ ప్రముఖులు. డ్రగ్స్ కేసులో ఇప్పటికే రెండు చోట్ల(బాలీవుడ్,టాలీవుడ్) రకుల్ సమన్లు అందుకొని విచారణకు హాజరయ్యింది.

రకుల్‌పై పొలిటికల్ టాక్
రకుల్ ప్రీతి సింగ్ పై తెలంగాణలో గతేడాది డ్రగ్స్ కేసు విషయంలో మీడియాతో టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి మాట్లాడారు. తెలంగాణలో డ్రగ్స్ కేసు విషయంలో ప్రభుత్వం అందరికీ నోటీసులు ఇవ్వడంపై రేవంత్ అప్పట్లో మాట్లాడుతూ డ్రగ్స్ కేసులో ఆర్థిక లావాదేవీలు కూడా జరిగాయని అన్నారు. హవాలా ద్వారా నగదు బదిలీ అయ్యిందా, అది ప్రక్క రాష్ట్రం నుండి జరిగిందా, ప్రక్క దేశాల నుండి జరిగిందా అనేది ప్రభుత్వం విచారణ చేపట్టాలన్నారు. రకుల్ ప్రీతి సింగ్ మంత్రి కేటీఆర్‌తో సంబంధాలు ఉన్నాయనే మాట ఒక అపోహగా, ఆరోపణగా మీడియా అడగగా ఆమె ఒక సెలబ్రిటీ, కేటీఆర్ మంత్రి వాళ్లకు వాళ్లకు మధ్య ఏమి ఉన్నాయో తెలియదని, ఇలాంటి లింకులు తనకు తెలియదని రేవంత్ రెడ్డి అన్నారు.
బాయ్‌ఫ్రెండ్‌ను పరిచయం చేసిన రకుల్!
గతేడాది తన పుట్టిన రోజు సందర్భంగా రకుల్ ప్రీతి సింగ్ తన బాయ్‌ఫ్రెండ్‌ను సోషల్ మీడియాలో పరిచయం చేసింది. బాలీవుడ్ నిర్మాత jackky bhagnani తో తన ప్రేమలో ఉన్నట్టు బహిరంగంగానే తెలియజేసింది. ఈ మేరకు సోషల్ మీడియాలో అతనితో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేయడమే కాకుండా, తన పుట్టిన రోజు సందర్భంగా తన బాయ్‌ఫ్రెండ్ కోసం ఒక స్వీట్ మెస్సేజ్ కూడా రాసిందట. ఈ ఏడాది(2021) తనకు ఒక పెద్ద బహుమతి జాకీ అని చెప్పుకొచ్చింది.

రకుల్ Plastic Surgery చేయించుకుందా?
రకుల్ ప్రీతి సింగ్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సెలబ్రిటీలలో ఆమె ఒకరు. అయితే ఆమె ఇటీవల ఒక ఫొటో షేర్ చేసింది. అందులో రకుల్ ఫేస్ మార్పుగా కనిపించింది. అయితే ఆమె ప్లాస్టిక్ సర్జరీ చేయించు కుందా? అని నెటిజన్లు కామెంట్లు చేశారు. గతంలో రకుల్ ఫొటోలను, ఇప్పటి ఫొటోలను ప్రక్కన పెట్టి షేర్లు చేశారు. గతంలో ముక్కుకు సర్జరీ చేయించుకున్న ఆమె ఇప్పుడు పెదాలకు కూడా సర్జరీ చేయించుకుందా? అనేది ఫొటోలో ఉన్న ఫేస్‌ను బట్టి అర్థమవుతుందని అనుకుంటున్నారు. ప్లాస్టిక్ సర్జరీలు అనేవి సినిమా ఇండస్ట్రీలు మామూలే. తన అందాన్ని రెట్టింపు చేసుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకొని ఉండొచ్చని రకుల్‌పై అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!