Chettu Meeda Koilamma: Singer Madhuppriya తెలుగు రాష్ట్రాల్లో సుపరిచిత అమ్మాయి. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనని అంటూ చిన్న వయసులోనే తన గొంతుతో పాడిన పాట కొద్ది సంవత్సరాల కిందట ఒక సంచలనంగా మారింది. ఆడపిల్లలపై వివక్షను పాట రూపంలో చూపింది. ఎన్నో ప్రభుత్వకార్యక్రమాల్లో, సభల్లో అప్పట్లో ఈ పాట మారుమ్రోగింది. ఇప్పటికీ తన స్వరంతో ఎన్నో పాటలను అందించిన మధుప్రియ ఇప్పుడు అన్నల పాట పాడి మరోసారి అభిమానులకు చేరువయ్యింది.
Chettu Meeda Koilamma: చెట్టు మీద కోయిలమ్మ గొంతు
చెట్టు మీద కోయిలమ్మ గొంతు అంటూ సింగర్ మధుప్రియ పాడిన ఈ పాట ఇప్పుడు తన అఫిషియల్ యూట్యూబ్ ఛానెల్ ద్వారా విడుదల చేసింది. ఇప్పుడు ఆ పాట కామ్రేడ్లను, ఎర్రజెండా అభిమానులను అలరిస్తోంది. అడవుల్లో ప్రజల కోసం అన్నలు పడుతున్న కష్టాలను ఒక్కొక్కటిగా చెబుతూ మధుప్రియా పాట రూపంలో తెలియజేసింది. ఇప్పటికే అన్నలపై ఎన్నో పాటలు వచ్చాయి అలరించాయి. ఇప్పుడు ఈ పాట కూడా అన్నల సాంగ్స్‌లో ఒకటిగా నిలిచిపోనుంది.
Chettu Meeda Koilamma సాంగ్‌కు వై.వెంకన్న లిరిక్స్ అందించారు. పాటలో ప్రతి పదం అన్నల త్యాగాలను గుర్తు చేస్తుంది. వారి ఉద్యమాలను నేటి సమాజంలో తెలియజేసేందుకు తన కలంతో పాటను రాసిన వెంకన్నకు ప్రతి ఒక్కరూ ముఖ్యంగా కామ్రేడ్లు అభినందనలు తెలియజేస్తున్నారు. పాటను మధుప్రియ చాలా ఎమోషనల్‌గా పాడింది. అన్నలపై ఉన్న ప్రేమను పాట రూపంలో తెలియజేసింది. ఈ సందర్భంగా మధుర గానంలో అలరించిన మధుప్రియను అభిమానులు ప్రశంసిస్తున్నారు. ఇక సంగీతం నవీన్ జె అద్భుతంగా అందించారు. పాటకు తగ్గట్టుగా మ్యూజిక్ అందించి గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈ పాటను నల్గొండ జిల్లా Dindi అడవుల్లో చిత్రీకరించారు. ఈ పాటలో అన్నలు ఉండే విధానాన్ని, వారి సిద్ధాంతాలను చూపించారు. ఈ సన్నివేశాల్లో మహేష్, రవి, అజయ్, శృతిప్రియా, నిత్య, సిద్దు, శివతో పాటు మధుప్రియ కూడా నటించారు. పాటను విన్న ప్రతి ఒక్కరూ సూపర్‌గా ఉందని, చాలా రోజుల తర్వాత మరో ఉద్యమ పాటను వింటున్నామని అంటున్నారు.
కొమ్మల్లో,రెమ్మలో కమ్మగా కూసేటి
నల్లని కోయిలమ్మ గొంతుతో,
తెల్లని మనసుతో…
చిరుజల్లు కురిపించటానికి
చిరునవ్వుతో….
మరో మధుర గానంతో అలరించిన మధుప్రియకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ పాటను ఇప్పటికే వేల సంఖ్యలో విన్నారు. మధుప్రియ అభిమానులు తమ అభిమానాన్ని కామెంట్ల రూపంలో తెలుపుతున్నారు. నేటి సమాజానికి ఇలాంటి పాటలు చాలా అవసరం అని తెలియజేస్తున్నారు. ఇలాంటి పాటలు మరెన్నో రావాలని కోరుతున్నారు. ఈ పాటను వింటుంటే రోమాలు నిక్కరబొడుచుకుంటున్నాయని, ఇలాంటి పాటలు ముఖ్యంగా అన్నల కోసం మరెన్నో పాటలు రావాలని అంటున్నారు. ఈ పాటను రాసిన వారికి, పాడిన వారికి, నటించిన వారికి అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. మీరు ఈ పాటను వినాలంటే లింక్ ఇచ్చాము. డౌన్లోడ్ చేసుకోవాలన్నా కింద లింక్ ఉన్నది.
Song Credits:
Song Name | Chettu Meeda Koilamma (2022) |
Lyrics | Y .Venkanna (Anveshi) |
Singer | Madhuppriya |
Music | Naveen J |
Director | Krish |
Dop | Sudhakar |
Editor | Saiteja Kundarapu |
Location : | Dindi |
Youtube Video Song | Link |