Chest Burning Remedyఅప్పుడప్పుడు ఛాతీలో నుంచి మంట వస్తుంది. ఈ సమస్యతో తరుచూ ఇబ్బంది పడుతున్నారా? అయితే చక్కటి గృహ వైద్యం గురించి తెలుసుకోండి. ముందుగా భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క చప్పరిస్తే ఛాతీ మంట రాదు. కప్పు నీటిలో ఒక టీ స్పూన్ సోంపు వేసి మరగించి మూత పెట్టాలి. రాత్రంతా అలాగే ఉంచి, ఉదయం వడపోసి టీ స్పూన్ తేనె కలిపి పరగడుపున తాగితే అసిడిటీ(acidity) తగ్గుంది.
ఒక లవంగం ఒక ఏలక్కాయిను పొడి చేసి బుగ్గన పెట్టుకుంటే ఛాతీ మంట రాదు. ఇది నోటి శుభ్రతకు (mouth freshener) కూడా ఉపకరిస్తుంది. అర లీటరు నీటిలో ఒక టీ స్పూన్ షాజీర వేసి సన్నటి మంట మీద 15 నిమిషాల సేపు మరగించాలి. గోరు వెచ్చగా ఉన్నప్పుడు తాగాలి. ఇలా రోజుకు రెండు, మూడు సార్లు ఐదారు రోజులు పాటు తాగితే అసిటిటీ సమస్య పూర్తిగా (Chest Burning Remedy)తగ్గిపోతుంది.


అసిడిటీ ఉంటే జీర్ణరసాలు జీర్ణాశయం నుంచి పైకి ఎగజిమ్మి ఆహార నాళం లోకి వస్తుంటాయి. దీంతో ఛాతీలో మంట అనిపిస్తుంది. కడుపులో జీర్ణరసాలు వాటి నియమిత సమయానికి విడుదలవుతుంటాయి. కానీ సమయానికి భోజనం చేయకపోతే, ఆమ్ల పూరిత రసాల కారణంగా కడుపులో మంట వస్తుంటుంది. అలాగే ఘాటు మసాలాలతో కూడిన ఆహారం ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు ఆమ్లాలు పైకి ఎగజిమ్మడంతో ఛాతీలో మంట వస్తుంది.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?