cheddi gang history1987 నుండి చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలు చేస్తూ వస్తోంది. కానీ ఇలాంటి గ్యాంగ్ ఒకటి ఉందని, వీరే దొంగతనాలు చేస్తున్నారని పోలీసులకి తెలిసింది మాత్రం 1999లో. అంటే 10 సంవత్సరాలకు పైగా వీరు ఉన్నారని కూడా ఎవ్వరికీ తెలియకుండా పోయింది. 90వ దశకం చివరిలో సామాన్య ప్రజలు సీసీ కెమెరాలను వాడటం మొదలు పెట్టారు. ఆ దృశ్యాలలో వీరు రికార్డు అవ్వడంతోనే మొదటిసారిగా చెడ్డీ గ్యాంగ్ గురించి బయట ప్రపంచానికి తెలిసింది. అప్పటి నుంచి చెడ్డీ గ్యాంగ్ పట్టుకోవడం అనేది పోలీసులకి తలకి మించిన (cheddi gang history)భారం అయ్యింది.
గుజరాత్లో ఆవిర్భావం..
అసలు చెడ్డీ గ్యాంగ్(cheddi gang) పుట్టింది గుజరాత్(gujarat)లోని ధవోద్(dahod) జిల్లాలోని గూద్ బాలా తాలూకాలో ఉన్న నహేడా అనే గిరిజన గ్రామంలో. అడవిలో పోడు భూములలో వ్యవసాయం చేసుకోవడం, అక్కడ జీవులను వేటాడటం వీరు ప్రధాన వృత్తి. ఫేస్ పార్థి తెగ అని వీరికి పేరు ఉంది. మొదట్లో వీరు ఎలాంటి దొంగతనాలు చేయకుండా తమకి ఉన్నంతలో కష్టపడే బతుకుతూ వచ్చారు. కానీ ప్రకృత్తి వీరిపై పగ పట్టింది. అడవిలోని పోడు భూముల్లో వ్యవసాయం అంటే నీటి సౌకర్యం ఉండదు. అతి వృష్టి, అనావృష్టి లేకుండా వర్షం పడితేనే పంట చేతికి వస్తుంది. కానీ తరువాత ప్రకృతి సహకరించకపోవడంతో వీరికి వ్యవసాయం కలిసి రాలేదు.

చెడ్డీ గ్యాంగ్ పేరంటేనే వణుకు…
ఇదే సమయంలో అడవిలో జంతువులను వేటాడటం ప్రభుత్వం నిషేధించింది. చెడ్డీ గ్యాంగ్(cheddi gang history) ఈ పేరు వినగానే చాలా మంది భయంతో వణికిపోతారు. కొంత మందికి కంటి మీద కునుకు కూడా పట్టదు. ఇక ఎందుకంటే వీరికి పట్టుకోవడానికి కుదరదు. ఒళ్ళంతా ఆయిల్ పూసుకుని, ఒంటి మీద ఒక చిన్న చెడ్డీ వేసుకుని మాత్రమే ఉంటారు. దొంగతనం చేయడంలో విచిత్రమైన పద్ధతి వీరిది. క్రూరత్వంతో నిండిన జీవన విధానం, డబ్బు కోసం ఈజీగా ప్రాణలు తీసేసే స్వభావం వారిది. ఇది చెడ్డీ గ్యాంగ్ స్టైల్(style).
ఎవరీ ఈ చెడ్డీ గ్యాంగ్?
ఈ చెడ్డీ గ్యాంగ్ విషయాలు తెలుసుకున్నా కొద్ది చెమటలు పట్టేంతా ఉంటుంది వీరి నేర చరిత్ర. వీరు చోరీలు(దొంగతనాలు) ఏడాది పాటు చేయరట. వారి అవసరాలకి తగ్గట్టు సీజనల్ గా కొన్ని రోజులు మాత్రమే దొంగతనాలు చేస్తారట. దొంగతనం చేయాలని నిర్ణయించుకున్న నగరానికి చెడ్డీ గ్యాంగ్ నెల రోజులు ముందే చేరుకుంటుంది. వీరిలో కొంతమంది కూలీలుగా పనికి కుదురుతారు. మరికొంత మంది పగటి వేళ్లల్లో కుర్తా, ఫైజామ్ ధరించి భిక్షాటన చేస్తూ బెల్లూన్లు, పక్క పిన్నీసులు అమ్ముతూ మారు వేషాల్లో ఇళ్లపై రెక్కీ నిర్వహిస్తారు.

వీరికి చదువు లేదు!
వీరు చదువుకోలేదు. ప్రభుత్వం నుండి వీరికి ఎలాంటి గుర్తింపు కార్డు లేదు. ప్రభుత్వ పథకాలు అందేది లేదు. ఇలా వీరి జీవనానికి ముప్పు వచ్చి పడింది. ఇలాంటి సమయంలో ఆ తెగ పెద్ద రాంజీ ఒక 5 మంది కుర్రాళ్లతో చెడ్డీ గ్యాంగ్‌ని తయారు చేశాడు. వారికి బాగా ట్రైనింగ్ ఇచ్చాడు. నాయకుడు రాంచీ వీరికి దొంగతనాలు చేయడానికి కొన్ని సూత్రాలను పాటించాలని కూడా చెప్పాడు. అలా మొదలైన ఆ ఒక్క గ్యాంగ్ ఇప్పుడు పెరుగుతూ వచ్చింది. ఈ తెగలోనే కొన్ని 10 సంఖ్యలో గ్యాంగ్స్ పుట్టుకొచ్చాయి.
చోరీ చేయడంలో వీరి స్టైయిలే వేరు!
దొంగతనాలు చేయడంలో చెడ్డీ గ్యాంగ్ స్టైయిలే వేరు. ఇప్పటికీ ప్రతి చెడ్డీ గ్యాంగ్(cheddi gang) కూడా గురువు రాంచీ చెప్పిన ఆ సూత్రాలనే పాటిస్తూనే దొంగతనాలు చేస్తోంది. ఆ సూత్రాలు వింటే ఒక్కొక్కరికి వెన్నులో వణుకు పుట్టక తప్పదు. సరిగ్గా అంతా గాఢ నిద్రలోకి జారుకునే సమయమైన అర్ధరాత్రి(తెల్లవారు జామున) 3 గంటల ప్రాంతంలో వీరి అటాక్ మొదలవుతుంది. అటాక్ చేసే ముందు వీరు తమ డ్రెస్ కోడ్‌లోకి మారిపోతారు. శరీరం అంతా ఆయిల్ పూసుకుంటారు. ఒంటి మీద ఒక్క చెడ్డీ తప్ప ఏమీ ఉంచుకోరు. చెప్పులు కాలికి వేసుకోకుండా నడుముకు కట్టుకుంటారు. పదునైన కత్తులు తమతో ఉంచుకుంటారు. కొంతమంది ఇనుప రాడ్స్ చేత పట్టుకుంటారు.

ఇక ఎంచుకున్న ఇంట్లోకి మాత్రం వీరు నక్కి నక్కి ప్రవేశిస్తారు. కానీ ఇంట్లోకి ఎంటర్ అయ్యే విధానం, దోచుకునే విధానం అంతా చాలా ఆటవికంగా ఉంటుంది. నేరుగా తలుపులు, కిటికీలు, తాళాలు పగలకొట్టే వీరు ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఇంట్లోని వారు భయపడి కామ్‌గా ఉండిపోతే చాలా వరకు మనుషుల మీద అటాక్ చేయరు. ఒక వేళ ఎదురు తిరిగితే మాత్రం విచక్షణ లేకుండా దాడి చేస్తారు. దొంగతనం చేసిన ఇంట్లోనే భోజనం చేయడం, అదే ఇంటి మధ్యలో మలం కూర్చోవడం వీరికి అలవాటు. ఈ రెక్కీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. దొంగతనం చేయాలనుకున్న ఇల్లు సిటీకి దూరంగా ఉండేలా చూసుకుంటారు.

దోచుకునే ఇంటిపైన నిఘా!
ఆ ఇంటి ముందు ఆరేసిన ఖరీదైన బట్టలు, పార్కింగ్ చేసిన బైకులు, కార్లను బట్టి ఆ ఇంట్లో ఎంత వరకు డబ్బు దొరకొచ్చో అంచనా వేసుకుంటారు. ఒక్కో ఇంటిపై వీరి రెక్కీ మొత్తం రెండు రోజుల పాటు ఉంటుంది. ఆ రెండు రోజుల్లోనే ఆ ఇంట్లో వాళ్లు ఎన్ని గంటలకు నిద్ర పోతున్నారు? ఆ ఇంట్లో ఎంత మంది నివశిస్తున్నారు? ఆ ఇంట్లో కాపలాకి కుక్క ఉందా? లేదా? అన్న విషయాలను పసిగడతారు. చెడ్డీ గ్యాంగ్ తాము దొంగతనం చేయాల్సిన ఇంటి పరిసరాలకు చాలా త్వరగానే చేరుకుంటాయి. అంటే రాత్రి 12 గంటలలోపే చేరుకుంటారు. అక్కడ ఎదైనా నిర్మానుష ప్రాంతంలో నక్కి, దాడి చేయడానికి రెడీ అవుతారు. ఒక్కోసారి మన ఇళ్ల మిద్దెల మీదే చేరి, దర్జాగా తగు సమయం కోసం ఎదురు చూస్తుంటారు. పొరపాటున వీరిలో ఏ ఒక్కరు దొరికినా మిగతా వారి ఆచూకీ మాత్రం చెప్పరు. వీరిలో అంత యూనిటీ ఉంటుందన్నమాట.

తెలుగు రాష్ట్రాలపై కన్ను!
ఈ కారణంగా ఇన్ని రాష్ట్రాల పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా చెడ్డీ గ్యాంగ్స్ ని పూర్తిగా నిర్వీర్యం చేయలేకపోతున్నారు. ఈ ముఠాలు ముందుగా ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, జార్ఞండ్, ముంబై వంటి ప్రాంతాల్లో దొంగతనాలు చేసేవి. కానీ చాలా ఏళ్ల తరువాత అక్కడ పోలీసులు వీరి ఆట కట్టించడంతో సౌత్(తెలుగు రాష్ట్రాలు)పై కన్నేశారు. చెడ్డీ గ్యాంగ్‌లోని ఒక్కో గ్రూప్‌లో 6 నుండి 8 మంది సభ్యులు ఉంటారు. తమకి కావాల్సినంత సొత్తు వచ్చాక, ఆ డబ్బుని పంచుకుని వీరు విడివిడిగా మాత్రమే తమ గమ్యస్థానాలకు చేరుకుంటారు. ఇది కూడా కేవలం రెండు మార్గంలోనే. ఎందుకంటే వీరు రైలులో గుంపుల మధ్య తప్ప ఇక ఎందులోను ప్రయాణం చేయడానికి ఇష్టపడరు. వీరి టార్గెట్ ఆంధ్రప్రదేశ్‌పై పడింది. వీరు ఏపీని టార్గెట్‌ను చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో వీరు 25 ఇళ్లల్లో దొంగతనాలు చేశారు. ఇప్పుడు మాత్రం వరుస చోరీలతో రెచ్చిపోతున్నారు.
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి