Cheating lady arrested in Vanasthalipuram: బ్లాక్ మెయిల్ లేడీ అరెస్ట్‌

మోసాల‌కు పాల్ప‌డుతున్న Cheating lady arrested అయ్యిది. న‌గ‌రంలోని Vanasthalipuram పోలీసులు Cheating lady arrested తో ప‌లు షాకింగ్ విష‌యాలు తెలిపారు.

Hyderabad: మ‌గ‌వాళ్ల‌ను త‌న ట్రాక్‌లో దింపుకొని అవ‌స‌రాల‌కు వాడుకొని వాళ్ల‌ని బ్లాక్‌మెయిల్ చేస్తూ ప‌బ్బం గ‌డుపుతున్న ల‌తారెడ్డి అనే కిలాడి లేడిని హైద‌రాబాద్‌లోని వ‌న‌స్థ‌లిపురం పోలీసులు ఎస్‌సిఎస్‌టికేస్‌లో అరెస్టు చేశారు. ల‌తా రెడ్డి గ‌తంలో 6 గురు ఎస్సైల‌పై ఉన్న‌తాధికారుల‌కు త‌న‌ను వేధిస్తున్నార‌ని ఫిర్యాదు చేసి డ‌బ్బులు వ‌సూలు చేసింది.

ఈ సారి మాయ‌లేడిని అరెస్టు చేసింది మాత్రం మ‌గ‌ళ‌వాళ్ల మోసం చేసిన కేసులో మాత్రం కాద‌ని తెలుస్తోంది. వ‌న‌స్థ‌లిపురం పోలీస్‌స్టేష‌న్ ప‌రిధిలోని నివ‌సిస్తున్న ల‌తారెడ్డి అనే మ‌హిళ కొంత‌మంది ఎస్సీ, ఎస్టీ వాళ్ల‌తో గొడ‌వ పడింది. స్థానికంగా ఈమెకు ఓ టైల‌ర్ షాప్ ఉంది. అక్క‌డ జ‌రిగిన గొడ‌వ‌లో ఒక మ‌హిళ త‌ల ప‌గిలింది. ఆ కేసులో ల‌తారెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు న‌మోదైంది. అయితే పోలీసులు ఈమె గురించి ఆరా తీయ‌గా కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి.

విచార‌ణ‌లో బ‌య‌ట‌ప‌డ్డ కిలాడీ లేడి మోసాలు!

ల‌తారెడ్డి గ‌త 13 సంవ‌త్స‌రాలుగా త‌న భ‌ర్త‌కు దూరంగా ఉంటూ ఇద్ద‌రు పిల్ల‌ల‌తో వ‌న‌స్థ‌లిపురంలో నివాసం ఉంటుంది. అనంత‌రం ఒక వ్య‌క్తితో వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. అయితే ఆయ‌నతో గొడ‌వ‌ప‌డి వ‌న‌స్థ‌లిపురం ఎస్ఐ రామ‌య్య, నాగ‌రాజు, రాజు వీరు న‌న్ను మాన‌సికంగా వేధించార‌ని అర్థ‌రాత్రి ఫోన్ చేసి వేధిస్తున్నారంటూ అబాండాలు వేసిన ల‌తా రెడ్డి ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు కూడా చేసింది.

అంతేకాకుండా రాజేంద్ర‌న‌గ‌ర్ ఎస్ఐ అత‌ని స్నేహితుడు మ‌ధుసూద‌న్ రెడ్డి ఎస్సై త‌న స్నేహితుడు అరుణ్ కుమార్ ఎస్సై వికారాబాద్‌లో ప‌నిచేస్తున్న స‌మ‌యంలో స్నేహంగా ఉన్న‌ట్టు న‌టిస్తూ వారిపై కేసులు పెట్టి డ‌బ్బులు డిమాండ్ చేసింది. ఎంతైనా ప్ర‌భుత్వ ఉద్యోగులు క‌దా చేస‌ది ఏమీ లేక ఆ మ‌హిళ‌కు రావాల్సిన డ‌బ్బులు ఇచ్చి కేసులు మాఫీ చేయించుకున్నారు స‌ద‌రు అధికారులు.

అనంత‌రం కొద్ది రోజుల క్రితం త‌న కూతుర్రి మాన‌భంగం చేశారంటూ త‌న స‌హ‌జీవ‌నం చేస్తున్న వ్య‌క్తిపై మ‌రో కేసు పెట్టి జైలుకు పంపింది. ఇలా ప్ర‌తి సారి పోలీసుల చుట్టూ తిరుగుతూ స్టేష‌న్ల చుట్టూ తిరుగుతూ ఈ మాయ‌లేడి అంద‌రికీ వ‌ల‌వేస్తూ డ‌బ్బులు లాగుతూ ఉంటుంది. చివ‌రికి ఇలా ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులో చివ‌రికి మాయ‌లేడి ల‌తారెడ్డి క‌‌ట‌క‌టాల్లోకి వెళ్లింది.

ఇది చ‌ద‌వండి:కొత్త పార్టీపై ష‌ర్మిల బిజీ! ఖ‌మ్మం నేత‌ల‌పై ఫోక‌స్‌!

చ‌ద‌వండి :  Lawyer couple murdered case : హ‌త్య‌లు వెనుక టిఆర్ఎస్ పాత్ర: ఉత్త‌మ్‌కుమార్ రెడ్డి

ఇది చ‌ద‌వండి: ఆ చేప మ‌హా డేంజ‌ర్‌! త‌గిలితే అంతే సంగ‌తులు!

ఇది చ‌ద‌వండి: అన్న‌పై ఎంత అభిమాన‌మో!

ఇది చ‌ద‌వండి: విషాదం: యువ జంట ఆత్మ‌హ‌త్యాయత్నం‌‌..యువ‌కుడు మృతి!

ఇది చ‌ద‌వండి: family health optima insurance plan: తెలుగులో తెలుసుకోండి!

ఇది చ‌ద‌వండి:నిఘా నీడ‌న పంచాయ‌తీ ఎన్నిక‌లు!

ఇది చ‌ద‌వండి:జ‌గ్గ‌య్య‌పేట‌లో కొన‌సాగుతున్న పోలింగ్

ఇది చ‌ద‌వండి:అట‌వీ శాఖ‌కు బాలుడు ఫిర్యాదు,రూ.67వేలు జ‌రిమానా!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *