cheating case: జగ్గయ్యపేట: ప్రభుత్వ లోన్ల పేరుతో మోసం చేసిన సంఘటన కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం మాగొల్ల గ్రామంలో వెలుగు చూసింది. అదే గ్రామానికి చెందిన నూకతోటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి తమను మోసగించి డబ్బులు వసూలు చేశాడని అతనిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని మంగళవారం జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్లో పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు.
వివరాల్లోకి వెళితే మంగొల్లు గ్రామానికి చెందిన నూకతోటి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి ప్రభుత్వానికి సంబంధించిన ముద్ర లోన్లు, పిఎం ఈ జి పి లోన్లు, ఇతర అనేకర రకాలైన ప్రభుత్వం లోన్లు ఇప్పిస్తామని, తనకు పెద్ద పెద్ద అధికారులతో సంబంధాలు ఉన్నాయని పలువురిని మోసగించినట్టు బాధితులు పేర్కొన్నారు. తమ వద్ద నుండి ఒక్కొక్కరి నుంచి రూ.3 వేలు నుండి రూ.15 వేలు వరకు వసూలు చేశాడని తెలిపారు. కొంత మందికి తనకు బ్యాంకు అధికారులతో ఉన్న సంబంధాలతో ముద్ర లోన్ లు ఇప్పించి, వారికి లోన్ తాలూకా డబ్బులు మొత్తం ముట్టినట్టు సంతకాలు తీసుకుని ఆ డబ్బులు కూడా అతనే వాడుకున్నాడని తెలిపారు. తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని అతని ఇంటికి వెళ్లగా బాధితులపై అతని కుటుంబ సభ్యులు మా మీదే కేసు పెడతామని వారి ఫోన్ ద్వారా వీడియోలు , ఫొటోలు తీసి బెదిరిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నిసార్లు అడిగినా పొంతన లేని సమాధానాలు చెబుతుండటంతో చివరకు జగ్గయ్యపేట పోలీస్ స్టేషన్ను ఆశ్రయించి చీటింగ్ కేసు నమోదు చేయాలని కోరినట్టు తెలిపారు. ఈ విషయంపై జగ్గయ్యపేట ఎస్సై బి వి రామారావు స్పందిస్తూ సదరు వ్యక్తిపై చీటింగ్ కేసు నమోదు చేయాలని పలువురు ఫిర్యాదు చేశౄరని, అతనిపై చీటింగ్ కేసు(cheating case) నమోదు చేస్తామని తెలిపారు. మాయమాటలు చెప్పే వ్యక్తులను నమ్మి డబ్బులు ఇచ్చి ఎవరూ మోసపోవద్దని, అప్రత్తమతంగా ఉండాలని తెలిపారు.
- Nelluri Nerajana Song lyrics:నెల్లూరి నెరజానా నీ కుంకుమల్లె మారిపోనా లిరిక్స్ | Oke Okkadu Movie
- surface tension: వర్షపు బిందువుల, Soap bubble, పాదరస బిందువులు గోళాకారంలోనే ఎందుకుంటాయి?
- Viscosity: రక్తం వేగాన్ని నియంత్రించుకోవాలన్నా, సముద్రంలో కెరటాలు తాకిడి తగ్గాలన్నా స్నిగ్థతే కారణం!
- Hands: అందమైన చేతుల తళతళా మెరవాలంటే ఇలా చేయండి!
- Vangaveeti Radha: జూలై 4న మూహుర్తమా? జనసేన పార్టీలోకి వంగవీటి రాధా!