grama ward Sachivalayam : సచివాలయ వ్యవస్థలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టింది రాష్ట్ర ప్రభుత్వం. రెవెన్యూ వ్యవస్థ బలోపేతానికి చర్యలు ప్రారంభించింది. ఇకపై సచివాలయ పరిపాలన పర్యవేక్షణ బాధ్యత ఆర్డిఓ, తహశీల్దార్లదే నని ప్రభుత్వం స్పష్టం చేసింది. సచివాలయ డిడిఓలు పంచాయతీ సెక్రటరీలను తొలగించి విఆర్వోలకు అధికార పగ్గాలు అప్పగిస్తూ ప్రభుత్వం తాజా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధంగా గ్రామ సచివాలయం వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మానస పుత్రికలైన గ్రామ సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లు ఇక రెవెన్యూ పరిధిలోకి వెళ్ల నున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన విప్లవాత్మక జీవోలో సచివాలయ పరిపాలనా బాధ్యతలను పంచాయతీ సెక్రటరీల నుండి తొలగించి రెవెన్యూ శాఖలోని వీఆర్వోలకు అప్పగించింది. దీంతో గ్రామ సచివాలయ పరిపాలన బాధ్యతలు వీఆర్వోలు చూడాల్సి వస్తుంది. ఇకపై గ్రామ సచివాలయంలో జరిగే నవరత్నాల సంక్షేమ పథకాల అమలు వీఆర్వో ఆధ్వర్యంలో జరుగుతాయి. అంతేగాక గ్రామ సచివాలయాల ఉద్యోగుల పర్యవేక్షణ బాధ్యత కూడా వీఆర్వోలకు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వలు జారీ చేసింది.
- Walking Style: హంస నడకదాన్నా..! నువ్వు నడుస్తు ఉంటే నిలవదు నా మనసే!
- Amba Story: భీష్ముడిపై అంబ ఎలా పగతీర్చుకున్నది? పురాణ గాథ స్టోరీ
- Adivasi Homes: అరణ్యంలో ఆదివాసీల ఇల్లు కట్టుకోవడం చూస్తే ఇంజనీరింగ్ కూడా చాలడు!
- COPD: డేంజరా..! అంటే డేంజరే! అసలు ఏంటదీ సిఒపిడి?
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court