chandamama kathalu | ఒక రాజుకు జంతువులంటే చాలా ప్రేమ. ఆయన ఎంత క్రూర మృగాన్ని కూడా హింసించేవాడు కాడు. పై పెచ్చు, నోరు లేని జంతువులను హింసించే వారిని కఠినంగా శిక్షించేవాడు. ఒక రోజు రాజు గుర్రం మీద నగరంలోని తిరుగుతుండగా ఒక చోట ఒక మనిషి ఒక పెద్దపులిని కర్రతో కొడుతూ కనిపించాడు. ఆ మనిషి పులిని అలా హింస పెట్టడం చూసి రాజు ఉగ్రుడైతో ఆ నోరు లేని జంతువును ఎందుకు అలా హింస పెట్టేస్తున్నావు? అని కోపంగా అడిగాడు. మహారాజా..ఇది నా పెంపుడు పులి. ఎన్నో ఏళ్లుగా నేను దీన్ని సాకుతున్నాను. ఇంత కాలమూ బుద్ధిగానే ఉన్నది. కానీ ఇవాళ, నేను చూడకుండా ఒక మేకను చంపేసింది. అందుచేత దీనికి కాస్త బుద్ధి చెబుతున్నాను. అన్నాడు ఆ మనిషి.
chandamama kathalu
ఈ మాట విని రాజు మరింత మండిపడి నువ్వు నోరు లేని జంతువును హింసించటం శాసన విరుద్ధం..అని ఆ మనిషిని కారాగృహంలో పెట్టించాడు. వెళ్లిపోతూ ఆ మనిషి మహారాజా, నా పులిని జాగ్రత్తగా చూడండి..అని అన్నాడు.రాజు వద్ద అదివరికే అనేక పులులు పెరుగుతున్నాయి. ఈ పులిని కూడా తీసుకుపోయి వాటిలో చేర్చారు.కొద్ది రోజులు గడిచాయి. రాజు ఒక నాడు తన పెంపుడు జంతువుల పెట్టుపోతలూ, యోగక్షేమాలూ స్వయంగా విచారిస్తూ పులులున్న చోటికి వచ్చాడు.అక్కడి పులులు మధ్య ఆయనకు బక్క చిక్కి, బలహీనంగా ఉన్న పులి కనబడింది. ఈ పులి ఇలాగున్నదేమిటి? దీనికేమైనా జబ్బా? చికిత్స ఏమైనా చేస్తున్నారా? అని అక్కడ పోషకులను అడిగాడు రాజు.
రాజుకు కనువిప్పు
మహారాజా..ఇది కొత్తగా వచ్చిన పులి. ఇది ఇక్కడికి వచ్చిన తర్వాత ఆహారం ముట్టలేదు. నీరు తాగ లేదు. ఇన్నాళ్లు అలానే పడి ఉన్నది..అన్నారు పోషకులు. ఇది ఎక్కడి నుండి వచ్చింది? అని రాజు మళ్ళీ అడిగాడు. దీని యజమాని తమరు కారా గృహంలో పెట్టించారు. ఇది అతని పెంపుడు పులి..అని పోషకులు తెలిపారు. రాజుకు అప్పుడు జరిగిన సంగతి జ్ఞాపకం వచ్చింది.కారాగృహం నుంచి ఆ మనిషిని తీసుకురండి..అని రాజు తన భటులను ఆజ్ఞాపించాడు. వాళ్లు ఆ మనిషిని తీసుకు వచ్చారు. నీ పులికి నువ్వు ఏమి ఆహారం పెట్టే వాడివి? అది ఏం తినేది? అని రాజు అడిగాడు. అన్ని పులులులాగే అది కూడా మాంసం తింటుంది, మహారాజా! అని అన్నాడు ఆ మనిషి. అది నా దగ్గరికి వచ్చాక ఏమీ తినక, చిక్కి శల్యమైంది. అన్నాడు రాజు.

ఆ మనిషి ఆదుర్దాపడుతూ, నేను దాన్ని ఒకసారి చూడాలి, మహారాజా! అన్నాడు. ఇద్దరూ కలిసి పులులున్న చోటకి వెళ్లారు. ఆ పులి తన యజమానిని చూడగానే లేచి వచ్చి, అతినికేసి రుద్దుకుంటూ, అతన్ని నాకింది. దాని స్థితి చూసి ఆ మనిషి దాన్ని కౌగలించుకుని బావురమని ఏడ్చాడు. అతని చేత్తో ఆహారం పెడితే పులి ఆవురావు రున తిన్నది. ఇది చూడగానే రాజుకు కనువిప్పు కలిగింది. జంతువులకు క్రమ శిక్షణ ఇవ్వడానికి కొంత హింసించ వలసి వస్తుంది.అది క్రూరత్వం అనిపించుకోదు. ఆ మనిషి పులి మీదా, ఆ పులికి అతని మీదా ఉన్న ప్రేమలో తనకు నూరోవంతైనా లేదనీ, తనను ఎన్నడూ ఏ నోరు లేని ప్రాణి ప్రేమించలేదని రాజు గ్రహించాడు. రాజు అతని శిక్ష రద్దు చేసి, తన వద్ద ఉన్న మృగాలన్నింటినీ అతన్ని ప్రధాన పోషకుడిగా నియమించాడు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!