Chanakya Quotes : స్వయంగా అధ్యాపకుడైన చాణక్యుడు విద్య గురించి, దాని విలువ గురించి తెలిసిన గొప్ప ధీరుడు. ఆయన బోధించిన నీతి వ్యాక్యాలు ప్రపంచ మానవాళికి జీవిత సోపానాలు. ఒక మనిషి సమాజంలో ఎలా ఉండాలి? ఎలా ఉండకూడదో తెలిసిన ఆయన బోధనలు ఇప్పుడు ప్రతి ఒక్కరూ పాటిస్తూ ఆదర్శంగా నిలిచిన వారు ఎందరో. చాణిక్యుడు చెప్పిన సూత్రాలను చదివితే మనం ఎలా జీవిస్తున్నామో, ఎలా జీవించకూడదో తెలుస్తుంది. మీరు కూడా ఈ నీతి వ్యాఖ్యాలను ఒక్కసారి చదవండి.
Chanakya Quotes : ధర్మ సుఖానికి మూలం.
ధర్మానికి మూలం ధనం.
ధనానికి మూలం రాజ్యం.
- చాణిక్య
రాజ్యానికి (అధికారానికి) మూలం.
ఇంద్రియాల్ని వశంలో ఉంచుకోవడం
- చాణిక్య
ఇంద్రియాల్ని జయించటానికి మూలకారణం వినయం
- చాణిక్య
పెద్దవాళ్లను, గురువులను, విద్యావంతులను
సేవించడం ద్వారా వినయం వస్తుంది.
- చాణిక్య
వృద్ధుల సేవ వలన విజ్ఞానం వస్తుంది.
- చాణిక్య
పెద్దల సహవాసంతో సంపాదించుకున్న విజ్ఞనం చేత
తనను సంపాదించుకొంటాడు. వినయం, విజ్ఞనం
లేనివాడు తనను తాను కోల్పోయినట్లే. ఈ రెండూ లేనివాడు
తనను తాను చక్కబరుచుకున్నవాడు అవుతాడు.ఆత్మసంపాదన అంటే ఇదే.
- చాణిక్య
ఆత్మను సంపాదించుకున్న వాడు తనను తాను
జయించినవాడు అవుతాడు
- చాణిక్య
ఆత్మను జయించినవాడు అన్ని లాభాలు పొందుతాడు.
సంపద(అర్థం) పొందుతాడు.
- చాణిక్య
అర్థ సంపద ప్రకృతి సంపదను ఇస్తుంది.
అమాత్యులు (మంత్రులు), మిత్రులు, ధనరాగం, రాజ్యం,
దుర్గం, సైనం – ఈ ఆరు ప్రకృతి సంపదలు.
రాజ్యపరిపాలనకి కావాల్సినవి ఇవే. అర్థ సంపాద
బాగుంటే ఇవన్నీ బాగుంటాయి.
- చాణిక్య
ప్రకృతి సంపద చేత రాజ్యపాలన నాయకుడు లేకపోయినా
నడిచిపోతుంది. ఉదహారణకు ప్రభుత్వాలు పడిపోయినా ఐఏఎస్, ఐపిఎస్, సైన్యం,
ప్రభుత్వ అధికారులు తమ తమ పనులు సక్రమంగా చేస్తే దేశం నడుస్తుంది కదా!
- చాణిక్య
ప్రకృతి విప్లవం అన్ని విప్లవాలకంటే చాలా గొప్పది.
ప్రమాదకరమైనది కూడా .
- చాణిక్య
వినీతుడు , అనగా విజ్ఞానం, వినయం లేని ప్రభువు
దొరకటం కంటే, ప్రభువే లేకపోవడం మంచిది.
- చాణిక్య
మంచి ఆలోచన అవసరం
- చాణిక్య
ముందు తనను తాను చక్కబరుచుకొన్న తర్వాత, సహాయుల్ని
సంపాదించడం కోసం ప్రయత్నించాలి.
- చాణిక్య
సహాయులు లేనివాడు ఏ విషయంలోనూ ఒక నిర్ణయం
తీసుకోలేడు. ఒక చక్రంతో బండి నడవదు కదా?
- చాణిక్య
సుఖదుఃఖాలను సమంగా పంచుకోగలిగినవాడే
సహాయుడు.
- చాణిక్య
దురభిమానం కలవాడిని సమాయుడిగా తీసుకుంటే
అతడు ప్రభువు ఆలోచనకు విరుద్ధంగా వేరే ఆలోచన చేస్తాడు.స్నేహితుడు కదా అని విద్యావినయాలు లేనివాడిని
మంత్రిగా చేసుకోకూడదు.
-చాణిక్య
శాస్త్రజ్ఞానం ఉన్న, ఏ ప్రలోభాలకి లొంగనివాడిని మంత్రిగా చేసుకోవాలి.
స్త్రీ, ధనం మొదలైనవాటిని ఎరచూపి రహస్యంగా
పరీక్షించడం లాంటి పరీక్షలో పరిశుద్ధుడిగా తేలినవాడు ఉపాదాశుద్ధుడు.
- చాణిక్య
అన్ని పనులకు మూలం మంత్రం(మంచి ఆలోచన).
మంత్రాన్ని రక్షిస్తేనే అన్ని పనులు సిద్ధిస్తాయి.
- చాణిక్య
ఆలోచనలు బయట పెట్టినవాడు అన్ని పనులూ
చెడగొట్టుకుంటాడు.
(ఎప్పుడూ నీ ఆలోచనలని ఎవరికీ చెప్పకు)
- చాణిక్య
ఆలోచనల విషయంలో ఏ మాత్రం పొరబడినా
శత్రువులకి లొంగిపోతాడు.
ఆలోచనలను అన్ని వైపులా నుండి రక్షించాలి.
- చాణిక్య
ఆలోచనలు బాగుంటే రాజ్యం వృద్ధిలోకి వస్తుంది.
ఆలోచనలు రహస్యంగా ఉంచుకోవడం చాలా మంచిదని అంటారు.
- చాణిక్య
ఏమి చేయాలో తెలియని స్థితిలో ఉన్నవాడికి
ఆలోచనలే మార్గం.
- చాణిక్య
ఆలోచనలు అనే నేత్రంలో శత్రువులు లోపాల్ని చూస్తారు.
- చాణిక్య
ఆలోచనలు చేసేటప్పుడు అహంకారం పనికిరాదు
- చాణిక్య
ఏది చేయాలి, ఏది చేయకూడదో అనే విషయాల్ని బాగా తెలిసి
వారే మంత్రులు.
- చాణిక్య
ఇద్దరు చేసినా ఆలోచన మూడోవాడికి తెలిసిందా
రహస్యం బటికి వచ్చినట్టే.
ముగ్గురు కలిస్తే వారు ఒకే మాట మీద ఉంటారా అనేది నమ్మలేని
విషయం. అలాంటప్పుడు ఇద్దరి ఆలోచనలు మూడోవాడికి తెలిస్తే దాగుతాయా?
- చాణిక్య
రాజ్యపాలన బాగా నడవాలంటే మిత్రుల్ని సంపాదించాలి.
- చాణిక్య
ఆపదలో కూడా స్నేహంగా ఉన్నవాడే మిత్రుడు.
- చాణిక్య
మిత్రుల్ని చేకూర్చడం చేత బలం చేకూరుతుందా?
- చాణిక్య
బలం కలవాడు ఇంతుకు ముందు లభించిన దానిని
పొందాలని ప్రయత్నిస్తాడు.
- చాణిక్య
సోమరికి ఏది లభించదు.
సోమరి దొరికిన దాన్ని కూడా రక్షించుకోలేడు.
- చాణిక్య
సోమరి రక్షించుకొన్నది కూడా వృద్ధి పొందదు.
సోమరి పోష్యవర్గాన్ని పోషించడు. సత్పద్రాసం చేయదు.
- చాణిక్య
లేనిదాన్ని సంపాదించం, సంపాదించినది
రక్షించుకోవడం, దాన్ని వృద్ధి చేసుకోవడం, తగిన రీతిలో
వినియోగించుకోవడం – ఈ నాలుగే రాజ్యంతంత్రం అంటే.
- చాణిక్య
రాజ్యతంత్రం అంతా నీతిశాస్త్రం మీద ఆధారపడి ఉంటుంది.
నీతిశాస్త్రాన్ని అనుసరించేవాడే రాజు.
- చాణిక్య
సరిహద్దు రాజ్యం రాజు శత్రువు.
- చాణిక్య
మధ్య ఒక రాజ్యం అడ్డున్న రాజ్యానికి రాజైనవాడు మిత్రుడు.
వీళ్లిద్దరూ సహజ శత్రుమిత్రులు.
- చాణిక్య
ఏదో ఒక కారణాన్ని బట్టి కూడా శత్రువులు, మిత్రులూ అవుతూ ఉంటారు.
- చాణిక్య
బలం తగ్గిపోతున్నవాడు సంధి చేసుకోవాలి.
బలం పూర్తిగా తగ్గిపోయిన తర్వాత కాదు.
- చాణిక్య
సంధి వల్ల ప్రయోజనం పొందాలనుకునేవాళ్లకు
సంధి కుదరాలంటే ఇద్దరికీ బలం ఉండాలి.
కాల్చకుండా లోహం లోహంతో అతకదు.
- చాణిక్య
బలం ఉన్నవాడు తనకంటే తక్కువ బలం
ఉన్నవాడితో విరోధం పెట్టుకోవాలి.
తనకంటే ఎక్కువ ఉన్నవాడితో కానీ,
సమానుడితో కానీ విరోధం పెట్టుకోకూడదు.
- చాణిక్య
బలవంతునితో యుద్ధం చేయడం, కాలిబంటు
ఏనుగుతో యుద్ధం చేయడం వంటిది.
అంటే ఆకు వచ్చి ముల్లుతో యుద్ధం చేయటం.
- చాణిక్య
శత్రువులు చేస్తున్న పనులు ఒక కంట కనిపెడుతూ ఉండాలి.
- చాణిక్య
చాలా మంది శత్రువులు ఉన్నప్పుడు
ఒకరితో సంధి చేసుకొని రెండవాని మీదికి
యుద్ధానికి వెళ్ళాలి.
- చాణిక్య
శత్రువులతో విరోధం కంటే ఆత్మరక్షణకు
ఏర్పాట్లు చేసుకోవడం మంచిది.
- చాణిక్య
బలం లేనివాడు బలవంతుడ్ని ఆశ్రయించాలి.
బలహీనుడ్ని ఆశ్రయిస్తే లేని కష్టాల్ని తెచ్చిపెట్టుకున్నట్టు అవుతుంది.
- చాణిక్య
రాజును అగ్నిని ఆశ్రయించినట్టు ఆశ్రయించాలి.
నిప్పుతో లాగా వ్యవహరించాలి.
- చాణిక్య
ఆశ్రయించిన రాజుకు వ్యతిరేకంగా
వ్యవహరించకూడదు.
ఆ రాజు వెంట ఆడంబరపూర్వకమైన
వేషం ధరించకూడదు.
- చాణిక్య
దుర్వ్యసనాలకు లొంగిపోయిన వారికి ఏ పని జరగదు.
- చాణిక్య
ఇంద్రియాలకు లొంగిపోయినవాడు
చతురంగ బలం ఉన్న నశిస్తాడు.(వాయుసేన –
జలసేన – యుద్ద బండ్లు – పదాతులు).
- చాణిక్య
వేల వ్యసనం ఉన్న వానికి ధర్మ, ధనం నశిస్తాయి.
- చాణిక్య
కామసక్తుడు ఏ పనీ చేయలేదు.
- చాణిక్య
రాజుకు ధనాసక్తి ఉండటం వ్యసనంగా
పరిగణించబడదు.
- చాణిక్య
ఉన్న దనం చాలు అనుకొనే వాడిని
లక్ష్మి విడిచి వేస్తుంది.
- చాణిక్య
శిక్షించటంలో కఠినముగా ఉంటే
అందరికీ ద్వేషపాత్రుడౌవుతావు.
- చాణిక్య
శత్రువు దండనీతికి లొంగుతాడు.
దండం అనగా అపరాధుల్ని శిక్షించడం,
రాజ్యాన్ని పాలించడం,(దండనీతి అనగా రాజనీతి, పాలన రీతి అని అర్థం).
- చాణిక్య
శిక్షించేవాడు ప్రజలను రక్షించగలుగుతాడు.
దండం(శిక్షించడం) సంపదను సంపాదించి పెడుతుంది.
- చాణిక్య
శిక్షించడం లేకపోతే త్రివర్గమే
(ధర్మం – సంపద – కామ) లేదు.
- చాణిక్య
శిక్షించడం వల్ల చెడ్డ పనులు చేయరు.
ఆత్మరక్షణ దండనీతి(శిక్షించే విధానం)
మీద ఆధారపడి ఉంటుంది.
- చాణిక్య
తనని తాను రక్షించుకుంటే అన్నీ రక్షించినట్టే.
అభివృద్ధి అయినా, వినాశనం అయినా తన
చేతుల్లోనే ఉంటుంది.
- చాణిక్య
శిక్షిచే విధానం వివేకవంతంగా ఉండాలి.
- చాణిక్య
రాజు బలహీనుడైనా రాజును అవమానించకూడదు.
అగ్నికి బలహీనత అనేది ఉండదు.
- చాణిక్య
దండం ఉంటేనే వృత్తులు(జీవనోపాయాలు) సాగుతాయి.
- చాణిక్య
దర్మ – కామాలకి మూలకారణం సంపదే.
- చాణిక్య
ఏ పనులు జరగాలన్నా మూలం ధనం.
ఎందుకంటే ధనం ఉన్నవాడు స్వల్ప
ప్రయత్నంలోనే కార్యాలు సాధిస్తాడు.
- చాణిక్య
ఉపాయంతో చేసే పనిలో శ్రమ ఉండదు.
ఉపాయం లేకుండా చేసిన పని జరిగినా
కూడా చెడిపోతుంది.
- చాణిక్య
పనులు మొదలుపెట్టిన వారికి నిజమైన సహాయం ఉపాయమే.
- చాణిక్య
మొదట ప్రయత్నం సరిగా చేస్తే కార్యస్వరూపం స్పష్టంగా
కనిపిస్తుంది. అప్పుడు దాన్ని సాధించవచ్చు.
- చాణిక్య
దైవము పురుషప్రయత్నాన్ని అనుసరించి ఉంటుంది.
అనగా ప్రయత్నం సరిగా చేస్తే దైవం కూడా
దానంతట అదే సహాయపడుతుంది.
- చాణిక్య
దైవం పూర్తిగా ప్రతికూలంగా ఉన్నప్పుడు
ఎంత పనిచేసినా అది వ్యర్థమే అవుతుంది.
- చాణిక్య
బుద్ధి నిలకడ లేనివానికి పనులేమిటి?
- చాణిక్య
ఏది ఎలా చేయాలో ముందు నిర్ణయించుకుని
తర్వాత ఆ పని చేయాలి.
- చాణిక్య
పని ప్రారంభించిన తర్వాత మధ్యలో
తెగతెంపులు లేని ఆలోచనలు చేయకూడదు.
- చాణిక్య
చపలచిత్తుడు(నిలకడ లేనివాడు ఏ పనీ చేయడు)
- చాణిక్య
చేతిలో ఉన్నదాన్ని చిన్న చూపు చూస్తే పని చెడుతుంది.
- చాణిక్య
దోషాలు లేని కార్యాలు అంటూ ఉండవు.
- చాణిక్య
చెడుగా పరిణమించే పని ప్రారంభించ కూడదు.
- చాణిక్య
సమయాసమయాలు తెలిసినవాడు
కార్యం సాధించగలుగుతారు.
- చాణిక్య
సమయం దాటబెడితే కాలమే కార్యాన్ని మింగేస్తుంది.
- చాణిక్య
ఏ విషయంలోనూ ఒక్క క్షణమైనా ఆలస్యం
చేయకూడదు.
- చాణిక్య
ఏ దేశంలో ఏ కాలంలో ఏమి చేయాలో
తెలుసుకుని పని ప్రారంభించాలి.
అంటే వేసవికాలంలో వరిపంట వేస్తారా?
- చాణిక్య
సులభంగా జరగాల్సిన పనికూడా దైవం
ప్రతికూలంగా ఉంటే కష్టపడి సాధించాల్సి ఉంటుంది.
- చాణిక్య
నీతి తెలిసినవాడు దేశాన్ని, కాలాన్ని జాగ్రత్తగా పరీక్షించుకోవాలి.
- చాణిక్య
ఏ పనైనా పరీక్షించి చేసేవాడి దగ్గర లక్ష్మి చాలా కాలం ఉంటుంది.
- చాణిక్య
అన్ని ఉపాయాలు పరీక్షించి అన్ని సంపదలూ
సమకూర్చుకోవాలి.ప్రతి వాడికి రెండో ఆదాయం ఉండాలి మరి.
- చాణిక్య
పరీక్షించకుండా పనులు చేసేవాడు ఎంత
అదృష్టవంతుడైనా లక్ష్మి వాడిని విడిచి పెడుతుంది.
- చాణిక్య
విషయం బాగా తెలుసుకుని ఊహించుకుని పరీక్షించాలి.
- చాణిక్య
ఎవడికి ఏ పనిలో నేర్పు ఉంటుందో
వాడిని ఆ పనిలో నియమించాలి.
- చాణిక్య
ఉపాయం తెలిసిన వాడు కష్టమైన పనిని
కూడా సులువుగా చేసేస్తాడు.
- చాణిక్య
తెలివి తక్కువ వాడు ఏ పనైనా చేసినా
వాడిని మెచ్చుకోకూడదు. ఎందుకంటే
వాడు ఆ పని అనుకోకుండా చేయగలిగాడు.
పురుగులు కూడా కర్ర తొలిచి కొన్ని ఆకారాలు చేస్తాయి కదా!.
- చాణిక్య
పని జరిగిన తర్వాతే బయట చెప్పాలి.
- చాణిక్య
ఎంత తెలివైనవాళ్ల పనులైనా దైవదోషం చేత
మానవ దోషం చేత చెడిపోతాయి.
దైవ దోషాన్ని శాంతి కర్మలు చేసి నివారించుకోవాలి.
మనుషుల వల్ల కలిగే కార్య విఘాతాల్ని నేర్పుతో తొలగించుకోవాలి.
- చాణిక్య
పనులు చెడిపోతే మందబుద్ధులు తమ ప్రయత్నంలోపం
అని చెప్పకుండా ఏవేవో కారణాలు చెప్పి తప్పించుకుంటారు.
- చాణిక్య
పని కావాల్సినవాడు అనవసరంగా
మొహమాట పడకూడదు.
పాలు కోరే లేగదూడ కూడా తల్లి పురుగును పొడుస్తుంది.
- చాణిక్య
సరిగ్గా ప్రయత్నం చేయకపోతే కార్యం చెడిపోతుంది.
ఇంతకీ దైవమే ఉందనుకునేవాళ్ల పనులు జరగవు.
- చాణిక్య
ఏ పనులూ చేయలేనివారు పోషించతగిన వాళ్లని పోషించలేడు.
- చాణిక్య
కార్యాన్ని గుర్తించలేనివాడే గ్రుడ్డివాడు.
- చాణిక్య
ప్రత్యక్షంగా చూసి, ఇతరులు చెప్పేదాన్ని విని,
తాను ఊహించుకుని పనులు పరీక్షించాలి.
- చాణిక్య
పరీక్షించకుండా పనులు చేసేవాడిని
లక్ష్మి త్యజిస్తుంది.
- చాణిక్య
ఆపద వచ్చినప్పుడు బాగా పరీక్షించి దానిని దాటాలి.
- చాణిక్య
తనకు ఎంత శక్తి ఉందో తెలుసుకుని ప్రారంభించాలి.
- చాణిక్య
తనవాళ్ళందరికీ తృప్తి కలిగించి మిగిలినది
భుజించేవాడు అమృత భోజి (అమృతం తినేవాడు).
- చాణిక్య
పనులు సక్రమంగా చేయడం వల్ల రాబడికి
దారులు పెరుగుతాయి.
- చాణిక్య
పిరికివాడు ఏ కార్యాన్ని గురించి ఆలోచించజాలడు.
- చాణిక్య
పని కావాల్సిన వాడు ప్రభువు స్వభావం ఎలాంటిదో
తెలుసుకొని తన పని సాధించుకోవాలి.
ఆవు స్వభావం తెలిసిన వాడే దాని పాలను
త్రాగగలుగుతాడు కదా!.
- చాణిక్య
తెలివైన వాడు నీచ బుద్ధికి రహస్యాలు చెప్పకూడదు.
- చాణిక్య
మెత్తటివాడిని ఆశ్రితులు కూడా అవమానిస్తాడు.
- చాణిక్య
కఠినంగా శిక్షించేవాడిని అందరూ
అసహ్యించుకుంటారు.
తగు విధంగానే శిక్ష విధించాలి.
- చాణిక్య
ఎంత చదువుకున్నవాడినైనా
శక్తి లేనివాడిని లోకం గుర్తించదు.
- చాణిక్య
ఎక్కువ బరువు(కార్యభారం) మనిషిని కుంగదీస్తుంది.
- చాణిక్య
సభలో ఇతరుల దోషాల గురించి చెప్పేవాడు తనలో
ఉన్న దోషాలను చాటి చెప్పుకొన్నవాడవుతాడు.
- చాణిక్య
తనను తాను అదుపులో ఉంచుకోలేనివాని
కోపం తననే నశింపజేస్తుంది.
- చాణిక్య
సత్యమే పలికేవాళ్ళకి లభ్యం కానిదంటూ ఉండదు.
- చాణిక్య
సాహసం చేత మాత్రమే పనులు జరగవు.
- చాణిక్య
వ్యసనాలలో చిక్కుకున్నవాడు తప్పకుండా
చేయవల్సిన పనులను మరిచిపోతారు.
- చాణిక్య
కాలక్షేపం చేస్తూ పోతే పనికి విఘ్నాలు
కలగకపోవడం ఉండదు.
- చాణిక్య
కేవలం ధనాన్ని కూడబెట్టేవాడికి దానివల్ల వాటికి ఎలాంటి ప్రయోజనం
లేదు. ధర్మమూ లేదు, దానమూ లేదు. కేవలం
శ్రమ మాత్రం మిగులుతుంది.
- చాణిక్య
స్త్రీ ద్వారా వచ్చిన అర్థం(ధనం) దానికి
విపరీతంగా అనర్థం జరుగుతుంది.
- చాణిక్య
ధర్మాలకి లోపం కలిగించనిదే కామం.
వాటికి లోపం కలిగించే విధంగా
కామాన్ని సేవించేవాడు అనర్థాన్నే సేవిస్తున్నట్టు.
- చాణిక్య
కపటం లేని స్వభావం గల వ్యక్తి దొరకడం కష్టం.
- చాణిక్య
సత్పురుషుడు అవమానపూర్వకంగా వచ్చిన
ఐశ్వర్యాన్ని అవమానిస్తాడు. దాన్ని స్వీకరించడు.
- చాణిక్య
ఒక్క దోషం గుణాలన్నింటినీ మింగేస్తుంది.
- చాణిక్య
మహాత్ముడైన శత్రువు విషయంలో
యుద్ధదారులకి దిగకూడదు.
- చాణిక్య
మంచి నడవడికను ఏనాడు విడువకూడదు.
ఆకలితో బాధపడుతున్నా సింహం గడ్డి మేయదు.
- చాణిక్య
ప్రాణాలకంటే కూడా ఎక్కువుగా జన విశ్వాసాల్ని రక్షించుకోవాలి.
- చాణిక్య
చాడీలు చెప్పే నాయకుడిని భార్యపుత్రులు
కూడా విడిచిపెడతారు.
- చాణిక్య
మంచి పనిని చిన్న పిల్లాడు చెప్పినా వినాలి.
- చాణిక్య
చాలా గుణాలు ఉన్న వాళ్ళని, వస్తువులను
ఏదో చిన్న దోషం ఉన్నంత మాత్రానా
విడిచిపెట్టకూడదు.
మహా పండితులలో కూడా ఏవో కొన్ని లోపాలు ఉండవచ్చు.
- చాణిక్య
ఖండించని రత్నం ఉండదు. ఎంతటి వాళ్ళకైనా కొన్ని
కష్టాలు, లోపాలు తప్పవు.
- చాణిక్య
అవధులు దాటిన విషయం ఎన్నడూ నమ్మకూడదు.
కొన్ని అవధులు మించి నమ్మకూడదు.
లేదా మర్యాద లేనివానిని ఎన్నడూ నమ్మకూడదు.
- చాణిక్య
అప్రియుడికి ఏదైనా ప్రియమైనది చేసినా
దాన్ని అతడు ద్వేషిస్తాడు.
- చాణిక్య
సత్పురుషుల అభిప్రాయల్ని కాదనకూడదు.
- చాణిక్య
గుణవంతుడ్ని ఆశ్రయించుట వలన గుణవిహీనుడు
కూడా గుణవంతుడు అవుతాడు.
పాలను ఆశ్రయించిన నీరు పాలే అవుతుంది కదా!
- చాణిక్య
తెలివి తక్కువ వాడు ఉపకారం చేసినవాడికి కూడా
అపకారం చెయ్యాలని అనుకొంటాడు.
- చాణిక్య
పాపం పనులు చేసేవారికి ఇతరులు
తిడతారనే భయం ఉండదు.
- చాణిక్య
ఉత్సాహవంతులకి శత్రువులు కూడా వశం అవుతారు.
- చాణిక్య
రాజులకి పరాక్రమమే ధనము.
- చాణిక్య
పోమరికి బహికము లేదు, పౌరలౌకికం లేదు.
- చాణిక్య
నిరుత్సాహపడితే దైవం కూడా వ్యతిరేకిస్తుంది.
- చాణిక్య
చేపలు పట్టేవాడు వలె వల పన్ని ధనం సంపాదించాలి.
- చాణిక్య
తనమీద నమ్మకం లేని వాళ్లని నమ్మకూడదు.
విషయం ఏనాటికి విషమే.
- చాణిక్య
ధనం సేకరించేటప్పుడు శత్రువుతో సంబంధమే
పెట్టుకోకూడదు.
- చాణిక్య
ఇద్దరి మధ్య ఒక నిశ్చితమైన సంబంధం
ఉందంటే అది ఏదో ఒక ప్రయోజనం మూలాన్నే.
- చాణిక్య
శత్రువు కుమారుడైన స్నేహితుడైతే వాడిని రక్షించాలి.
- చాణిక్య
శత్రువులో ఉన్న లోపం కనపడే వరకు
వాడిని చేతుల మీద కానీ, భుజాల మీద కానీ మోయాలి.
లోపం కనపడగానే వాడిని దెబ్బతీయాలి.
- చాణిక్య
తన లోపాలను బైట పడనీయకూడదు.
శత్రువులు కూడా ఏవో లోపాలు కనపడినప్పుడే
దెబ్బతీస్తారు.
చేతికి చిక్కినా కూడా వాడిని నమ్మకూడదు.
- చాణిక్య
తనవాళ్లలో ఉన్న చెడ్డ నడవడికను నివారించాలి.
- చాణిక్య
తనవాళ్ళకి అనుమానం జరిగినా
ఆత్మాభిమానవంతులు బాధపడతారు.
ఒక్క అవయంలో ఉన్న దోషం కూడా మనిషిని క్రుంగదీస్తుంది.
- చాణిక్య
మంచి నడవడిక శత్రువును
జయిస్తుంది. శత్రువుల నుండి కూడా మెప్పు తెస్తుంది.
- చాణిక్య
అపకారం చేయటమే నీచులకి ఇష్టం.
నీచులకి సలహాలు ఇవ్వకూడదు.
నీచుల్ని నమ్మకూడదు.
- చాణిక్య
దుష్టుడ్ని ఎంత గౌరవించినా
పీడించడం మానడు.
అగ్ని చందనపు చెట్లను కూడా కాల్చే తీరుతుంది.
- చాణిక్య
ఎప్పుడూ, ఎవర్నీ అవమానించకూడదు.
- చాణిక్య
క్షమించడమే యుక్తం, అందుచేత ఎవర్ని బాధించకూడదు.
- చాణిక్య
తెలివి తక్కువ వాళ్ళు రాజు చెప్పిన విషయాన్ని
అవీ ఇవీ కలిపి నలుగురికి చెప్పటానికి ప్రయత్నిస్తుంటారు.
- చాణిక్య
ఎంత అనురాగం ఉందో ఫలాన్ని బట్టి తెలుస్తోంది.
- చాణిక్య
ఐశ్యర్యం ఉన్నందున ప్రయోజనం అధికారం చలాయించడం.
- చాణిక్య
మూర్ణుడు ఇవ్వవలసింది కూడా అతి కష్టం మీద ఇస్తాడు.
- చాణిక్య
ధైర్యం లేనివాడు గొప్ప ఐశ్వర్యం లభించినా కూడా నశిస్తాడు.
- చాణిక్య
దుష్టుల సహవాసం చేయకూడదు.
కల్లు అమ్మేవాడి చేతిలో పాలను కూడా మనుషులు నిరాకరిస్తారు.
- చాణిక్య
పనులతో కష్టాలు వచ్చినప్పుడు విషయానిర్థారణ
చేయగలిగిందే బుద్ది.
- చాణిక్య
మితంగా భుజించడమే ఆరోగ్యం.
- చాణిక్య
హితమైన పదార్థము కూడా అజీర్ణంగా
ఉన్నప్పుడు తినకూడదు. తిన్నది
జీర్ణమైన తర్వాత తినేవాడి దగ్గరకు
రోగాలు కూడా దరిచేరవు.
- చాణిక్య
వృద్ధాప్యంలో వచ్చిన వ్యాధిని ఉపేక్ష చేయరాదు.
- చాణిక్య
అజీర్ణంగా ఉన్నప్పుడు భోజనం చేయడం దుఃఖహేతువు.
- చాణిక్య
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి