Chanakya Neeti ఖమ్మంమీకోసం: ఆచార్య చాణిక్యుడి చెప్పిన గొప్ప విషయాలను ప్రతిఒక్కరూ ఒక్కసారి చదవండి. అవి ఏమిటంటే…మన జీవితంలో అత్యంత గోప్యంగా (రహస్యంగా)ఉండే కొన్ని విషయాలు ఎవ్వరికీ చెప్పకూడదని ఆచార్య చాణిక్యుడు గొప్ప నీతి సూత్రం చెప్పారు. ఈ లోకంలో బ్రతికే నీకు ఎంత డబ్బు ఉంది..! నీకు ఎంత ఆస్తి ఉంది? నీకు ఎంత అప్పు ఉంది? నీ కుటుంబం సంతోషంగా ఉండటానికి అసలు కారణం ఏమిటి? నీ వ్యాపారానికి సంబంధించిన మూల రహస్యాలను ఇతరులకు ఎప్పుడూ(Chanakya Neeti) చెప్పకూడదు.
ఆశించి(Chanakya Neeti) ఉంటున్నవారే!
ఎందుకంటే నీ చుట్టూ ఉన్నవారు, నీ వెంట ఉన్నవారు ఇప్పటి వరకూ నీ నుండి ఏదో ఒకటి ఆశించి ఉంటున్నవారేనని తెలుసుకోవాలి. నీ దగ్గర ధనం, ఆస్తి ఒక్కొక్కటి తగ్గుతున్నప్పుడు ఇన్ని రోజులు నీతో ఉండి నీకు ఇచ్చిన గౌరవ మర్యా దలు తగ్గిస్తూ, నీ కన్నా గొప్పగా ఉన్నవారి చెంతకు చేరి, నీకు శత్రువుగా మారతారు. ఏ విధంగానైతే ఎండాకాలంలో అప్పటి వరకు పచ్చగా ఉన్న చెట్టుకు గడ్డుకాలం దాపురించి ఒక్కొక్క ఆకు రాలుతుందో అప్పటి వరకు ఆ చెట్టు నీడలో ఉన్న పక్షులు ఆ చెట్టు మోడుగా మారుతుండటం గమనించి మెల్లగా ఆ చెట్టును వదిలి వేరే పచ్చటి చెట్టును వెతుక్కుం టాయో…అదే విధంగా ఈ లోకం తీరు కూడా అంతే ఉంటుందని గమనించు.
నీ వద్ద అవసరం ఉన్నంత వరకు నీవు వారికి బలంగా ఉన్నావని ఎదో ఒక సాయం చేస్తావని ఆశించి మాత్రమే వారు నీకు మర్యాద ఇవ్వడమో లేదా నీవు చెప్పిన పని చేయడమో వారు చేస్తారు. ఒక్కసారి వారికి నీవు ఎందుకూ పనికిరావని తెలిసిన తర్వాత వారు మెల్లమెల్లగా నీకు దూరమ్వడం ప్రారంభిస్తారు. ప్రతిఒక్కరి జీవితంలో ఎక్కడో ఒక్కచోట ఏదో ఒక సమయంలో అవమానం జరిగే ఉంటుంది. మనుసులోని బాధను ఇతరులకు చెప్పుకుంటే తగ్గుతుందనే ఇతరులతో జీవితంలో విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఇలా జీవితంలో జరిగిన అవమానాలకు ఇతరులకు ఎప్పటికీ పంచుకోరాదని ఆచార్య ఛాణ్యుకుడు ఘంటా పథంగా చెప్పడం జరిగింది.
మానసికంగా దెబ్బతీయొచ్చు!
కాదు అని చెప్పడం ద్వారా నీవు ఎదుర్కొన్న ఆటుపోటులను గురించి ఇతురలకు చెప్పినప్పుడు బాగానే వింటారు. కానీ భవిష్యుత్తులో నీకు అతనికి తగాద ఏర్పడితే నీకు జరిగిన అవమానాలను వారికి ప్రథమ ఆయుధాలుగా వాడుకుంటారు. మిమ్మల్ని మానసికంగా దెబ్బతీయడానికి వాటిని ఇతరులకు చెప్పడమో, గతాన్ని మీకు గుర్తు చేసి మిమ్మల్ని బాధపడేలా చేయడమో చేస్తారు. మన ఇంటికి సంబంధించిన రహస్యాలను కానీ, గొడవలను కానీ,నీవు ఎదుర్కొంటున్న సమస్యలను మూడో వ్యక్తికి ఎట్టి పరిస్థితుల్లో కూడా చెప్పవద్దు. సాధారణంగా నీకు మీ ఇంట్లో వారికి గొడవ ఏర్పడినప్పుడు మూడో వ్యక్తి జోక్యం చేసుకుంటారు. ఆ మూడో వ్యక్తి మీ ఇంట్లో ఉన్న సమస్యలను, రహస్య వార్తలను తెలుసుకుని లోకానికి తెలిజేసే రిపోర్టరుగా మారతాడు. అందువల్ల మీ ఇంట్లో వారితో మీకు గొడవలు వస్తే ఆవేశంలో ఇతరులకు ఎప్పటికీ చెప్పవద్దు. సాధారణంగా మనుషులకు ఓ మాట మాట్లాడుకోవడానికి ఏదో ఒక టాపిక్ కావాలి. అదే క్రమంలో మీ బాధలను, మీ సమస్యలను వారు మాట్లాడుకుంటూ లోకమంతా తెలియజేస్తారు.కాబట్టి సహనంతో, మౌనంతో జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎలాంటి వ్యక్తులతో చర్చించరాదు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!