CHALORE CHALORE SAMMAKKA SARAKKA JATARA 2022 Lyrics Telugu. Sammakka Sarakka Special song. medaram New Songs 2022.
CHALORE CHALORE SAMMAKKA SARAKKA JATARA 2022 Lyrics Telugu
తెలంగాణ కొంగు బంగారం
మేడారం కుంభమేళం
ఇసకేస్తే రాలని జనం
మేడారం జాతర వనం!
పచ్చని అడవిలో పవిత్రమైన జాతర
సమక్క సారక్క మేడారం జాతర
అమరుల జాతర ఇది ఆదివాసీ జాతర!
గుడులే లేని అడవి తల్లులా జాతర!
రెండేళ్లకోసారి జరిగేటి జాతర
ఆసియా ఖండంలోన అతిపెద్ద జాతర
ఏడువందల ఏండ్ల నుండి జరుగుతున్న జాతర
ముచ్చటైన జాతర మూడు రోజుల జాతర!
అమరుల జాతర ఇది ఆదివాసీ జాతర
సమక్క సారక్క మేడారం జాతర
రెండేళ్లకోసారి జరిగేటి జాతర
గుడులే లేని అడవి తల్లులా జాతర!
మేడరాజు బిడ్డ సమక్క తల్లి
ఆ తల్లి బిడ్డా సారక్క తల్లి
పగిడిత రాజు గోవింద రాజు
జంపన్న కొండాయే!
వీరులు కన్నా నేలరా
ఇది పౌరుషాల గడ్డరా
ఈడ పుట్టిన గడ్డిపోచ
కత్తి పట్టి రణము చేయురా!
ఎదురు కొమ్మలే అమ్మలుగా
కొలుచునట్టి పుణ్య భూమిరా!
అమరుల జాతర ఇది ఆదివాసీల జాతర
సమక్క సారక్క మేడారం జాతర
రెండేళ్లకోసారి జరిగేటి జాతర
గుడులే లేని అడవి తల్లులా జాతర!
కరువుతో మేడారం తల్లడిల్లగా
సమక్క సారక్క దిగులు చెందిరి!
శిస్తు మీము కట్టమని
శపథం చేసి ప్రతాప రుద్రునికి తేల్చి చెప్పిరి!
కత్తి-డాలు చేతబట్టిరి
కాకతీయ సేనను తరిమిరి!
శత్రువు విసిరిన దొంగ దెబ్బకు
తల్లి బిడ్డ నేలరాలిరి!
ప్రజల నమ్మకమే దేవతలై
గద్దెలపై కొలువు దీరిరి!
అమరుల జాతర ఇది ఆదివాసీ జాతర
సమక్క సారక్క మేడారం జాతర
రెండేళ్లకోసారి జరిగేటి జాతర
గుడులే లేని అడవి తల్లులా జాతర!
చలొరే చలొరే చల్..చలొరే…చలొరే..చల్
చలొరే..చలొరే..మామా
గట్టమ్మ తల్లికి మొక్కి
సమక్క సారక్కల జాతరకు పోయోద్దమా!
చలొరే చలొరే చల్..చలొరే…చలొరే..చల్
చలొరే..చలొరే..భామా
ఎత్తు బెల్లాలతూకి ఎదురు కోళ్లనివ్వ వెళ్లొద్దం పద బామా!
జంపన వాగులో తడిబట్ట తానాలు
నెత్తిన బంగారం వడి బియ్యాలు!
విప్పి పరవశపు పూనకాలు
కోయ దొరల దీవెనలు!
కొబ్బరి కాయా ముడుపులు
పిల్లల కొరకు వరములు!
భక్తుల కొంగులో బంగారమై
కోరికల తీర్చు శక్తులు!
తల్లులు మీరే దిక్కని మొక్కితే
వరములిచ్చే కల్పవల్లులు!
అమరుల జాతర ఇది ఆదివాసీ జాతర
సమక్క సారక్క మేడారం జాతర
రెండేళ్లకోసారి జరిగేటి జాతర
గుడులే లేని అడవి తల్లులా జాతర
చలొరే చలొరే చల్..చలొరే…చలొరే..చల్
చలొరే..చలొరే..మామా
గట్టమ్మ తల్లికి మొక్కి
సమక్క సారక్కల జాతరకు పోయోద్దమా!
చలొరే చలొరే చల్..చలొరే…చలొరే..చల్
చలొరే..చలొరే..భామా
ఎత్తు బెల్లాలతూకి ఎదురు కోళ్లనివ్వ వెళ్లొద్దం పద బామా!
చలొరే చలొరే చల్..చలొరే…చలొరే..చల్
చలొరే..చలొరే..మామా
గట్టమ్మ తల్లికి మొక్కి
సమక్క సారక్కల జాతరకు పోయోద్దమా!
చలొరే చలొరే చల్..చలొరే…చలొరే..చల్
చలొరే..చలొరే..భామా
ఎత్తు బెల్లాలతూకి ఎదురు కోళ్లనివ్వ వెళ్లొద్దం పద బామా!
జాతర చూసొద్ధాం పద మామా
జాతర చూసొద్ధాం పద మామా!
సాంగ్ వీడియో: లింక్ క్లిక్