Chalo Khammam Collectorate: ఖమ్మం : రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులు, గార్డెన్, డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు, పంపు ఆపరేటర్స్ తదితర విభాగాల కార్మికులకు కేసీఆర్ ప్రభుత్వం వెంటనే వేతనాలు పెంచి కేటగిరీల వారీగా అమలు చేయాలని ఖమ్మం జిల్లా పలు కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం స్థానిక ఖమ్మం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మున్సిపల్ కార్మిక సంఘాల జేఏసీ ఖమ్మం జిల్లా కమిటీల ముఖ్యుల సమావేశం జరిగింది.
ఈ సమావేశంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ & ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఖమ్మం జిల్లా అధ్యక్షులు తుమ్మా విష్ణు వర్ధన్,తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ స్టాఫ్ & ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ (ఎఐటియుసి) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా వెంకటేశ్వర్లు, ప్రగతిశీల మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్ టియు) రాష్ట్ర అధ్యక్షులు జి.రామయ్య, (ఐయన్ టియుసి) ఖమ్మం నగర కార్యదర్శి సి.హెచ్.విప్లవకుమార్ పాల్గొన్నారు.
అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో పనిచేస్తున్న పర్మినెంట్ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు, కార్మికులకు ప్రభుత్వం వేతనాలు పెంచి జీఓలను జారీ చేసిందని, జూన్ నెల నుండే వేతనాలు చెల్లిస్తామన్నారని, కానీ ఇంతవరకూ ఏ ఒక్క మున్సిపాల్టీలో కార్పొరేషన్లో కూడా పెంచిన వేతనాలు చెల్లించలేదన్నారు.
ప్రభుత్వం జీఓలు జారీచేసి చేతులు దులుపుకొని వేతనాలు చెల్లించకుండా జాప్యం చేస్తుందని తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి తక్షణమే మున్సిపల్ కార్మికులకు కేటగిరీల వారిగా వేతనాలు సాధించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు, ఎఐటియుసీ, ఐఎఫ్ టియు,ఐయన్ టియుసి తదితర కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు పోరాటానికి సిద్ధం అవుతున్నట్లు అందులో భాగంగా ఈ నెల సెప్టెంబరు 13న మున్సిపల్ కార్మికులు ఛలో కలెక్టరేట్ (Chalo Khammam Collectorate)ఎదుట జరిగే ధర్నా కార్యక్రమంలో మున్సిపల్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు.


ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సిఐటియు ఖమ్మం జిల్లా కార్యదర్శి కళ్యాణం వెంకటేశ్వర్లు, సిఐటియు మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జినక శ్రీను, దొడ్డా నర్సింహారావు, ఎఐటియుసీ మున్సిపల్ కార్మిక సంఘం ఖమ్మం జిల్లా అధ్యక్షులు బొడ్డు పాపారావు, కార్యదర్శి యస్.కె.హుస్సెన్, ఐఎఫ్ టియు ఖమ్మం నగర అధ్యక్షులు కంకణాల శ్రీనివాస్, ఐఎఫ్ టియు మున్సిపల్ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జక్కి గురవయ్య, కిన్నెర నారాయణ, దున్న గురవయ్య, ఐయన్ టియుసి మున్సిపల్ కార్మిక సంఘం ఖమ్మం నగర అధ్యక్షులు యం. జ యరాజు, కార్యదర్శి లింగనబోయిన మహేష్ తదితరులు పాల్గొన్నారు.
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!
- Migraine: భరించలేని మైగ్రేన్ తలనొప్పి వస్తుందా?
- Amavasya: అమావాస్య రోజున ఏమి జరుగుతుంది?
- ML Jaisimha: క్రికెట్ చరిత్రలోనే అతనో సింహం!
- Memory Improve: జ్ఞాపకశక్తి పెరగాలంటే ఏం చేయాలి?