Cervical Cancer 2022: మహిళల్లో తరుచుగా కనిపించే క్యాన్సర్లలో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ఒకటి. దీన్ని మొదటి దశనగా తొలి దశలోనే గుర్తిస్తే చికిత్స చేయడం తేలిక. తరుచుగా పాప్ స్మియర్ పరీక్ష చేయించుకోవడం, చిన్నప్పుడే హెచ్‌పీవీ టీకా తీసుకోవడం ద్వారా దీని బారినపడకుండా చూసుకోవచ్చు అంటున్నారు వైద్యులు. ఇంతకీ దీని ప్రభావం (Cervical Cancer 2022) మహిళపై ఎలా ఉంటుంది?
Cervical Cancer 2022: సర్వైకల్ క్యాన్సర్ ప్రభావం!
హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్: సర్వైకల్ క్యాన్సర్‌కు ప్రధాన కారణం హ్యూమన్ పాపిలోమా వైరస్ (HPV) అని చెప్పవచ్చు. ఈ ఇన్‌ఫెక్షన్ ఎక్కువుగా లైంగిక సంపర్కంలో పాల్గొనే వారికి, ముఖ్యంగా ఎక్కువ మందితో శృంగారం జరిపే వారికి వచ్చే అవకాశం ఎక్కువ. సంభోగ సమయంలో జననాంగాల చర్మం తాకటం మూలంగానూ ఒకరి నుండి ఒకరికి వ్యాపించొచ్చు.
హెర్పిస్ ఇన్‌ఫెక్షన్: జననాంగ హెర్పిస్ ఇన్ ఫెక్షన్ గల మహిలలకు Cervical Cancer ముప్పు అధికం.
వయసు: 18-75 ఏళ్ల మధ్య వయసు స్త్రీలకు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ ముప్పు ఎక్కువ. సాధారణంగా 30-40 ఏళ్ల వారిలో ఎక్కువుగా కనబడుతుంది. 15 ఏళ్ల కన్నా తక్కువ వయసు బాలికల్లో రావటం అరుదు.
జన్యువులు: కుటుంబంలో క్యాన్సర్ బాధితులు గలవారికి ఈ Cancer వచ్చే అవకాశం ఉంది.
పొగ అలవాటు: పొగ తాగే అలవాటు గల మహిళల గర్భాశయ ముఖద్వార కణజాలంలో క్యాన్సర్ కారక రసాయనాలు ఉంటున్నట్టు అధ్యయనాల్లో తేలింది. ఈ రసాయనాలు గర్భాశయ ముఖద్వారాన్ని దెబ్బతీస్తాయి. క్యాన్సర్ నివారణకు తోడ్పడే కొన్ని రకాల కణాలు పొగ అలవాటు గలవారిలో సరిగా పనిచేయడం లేదనీ తేలింది.
రోగ నిరోధక శక్తి తగ్గటం: రోగ నిరోధక శక్తి తగ్గితే రకరకాల క్యాన్సర్ల మాదిరిగానే సర్వైకల్ క్యాన్సర్ కూడా దాడి చేయొచ్చు. HIV, Aids బాధితులకు లేదా రోగ నిరోధక శక్తి తగ్గటానికి మందులు వేసుకునే వారికి హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్ కూడా తోడైతే సర్వైకల్ క్యాన్సర్ ముప్పు మరింత పెరుగుతుంది.
ఎక్కువ మంది సంతానం: ఒకరిద్దరు పిల్లలను కన్న స్త్రీలతో పోలిస్తే, ఏడుగురు, అంతకన్నా ఎక్కువ మందిని కన్నవారికి గర్భాశయ ముఖ ద్వార క్యాన్సర్ ముప్పు రెండు రెండు రెట్లు అధికం. 25 ఏళ్లు, ఆ తర్వాత వయసులో సంతానం కలిగిన వారితో పోలిస్తే 17 ఏళ్ల కన్నా ముందే పిల్లలను కన్నవారికీ దీని ముప్పు ఎక్కువగానే ఉంటోంది.
రసాయనాలు: డ్రై క్లీనింగ్, లోహాలపై గ్రీజును తొలగించటానికి వాడే టెట్రాక్లోరో ఇథీలీన్ రసాయనం ప్రభావం మూలంగానూ సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశముంది.

Cervical Cancer 2022 | అల్లం, మిర్చి తింటున్నారా?
ఘాటైన రుచులకు మీరు అభిమానులా అయితే మీరు ఈ శుభవార్త వినాల్సిందే. అల్లం, ఎండు మిర్చి కలిసిన ఆహారం తీసుకుంటే క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని వైద్యుల అధ్యయనంలో వెల్లడైంది. మిర్చిలోని కెప్సాయసిన్ సమ్మేళనాలతో జీర్ణాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదముందని ఇదివరకు పరిశోధనల్ల తేలింది. అయితే CAPSAICIN దుష్ప్రభావాలను అల్లంలో ఘాటును పెంచే జింజెరోల్-6 తగ్గించగలదని తాజాగా బయటపడింది.
అంతే కాదు కెప్సాసిన్, జింజెరోల్ కలిస్తే క్యాన్సర్ కణితుల పెరుగుదులను నియంత్రిస్తాయని వెలుగులోకి వచ్చింది. ఎలుకలపై గతంలో అమెరికన్ సొసైటీ పరిశోధనలు నిర్వహించారు. జన్యు మార్పుల ద్వారా మొదటగా వాటిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ లక్షణాలను ప్రేరేపించారు. అనంతరం వాటిలో కొన్నింటిపై కెప్సాయసిన్, జింజెరోల్‌లను విడివిగా, మరికొన్నింటిపై రెండు కలిపి ప్రయోగించారు. రెండు కలిపి ప్రయోగించిన ఎలుకల్లో 80 శాతం వరకూ కణితుల పెరుగుదల నియంత్రణలోకి వచ్చినట్టు గుర్తించామని పరిశోధకులు జియాహువాన్ వివరించారు. రోగ నిరోధక శక్తిని పెంచడంతో పాటు రక్తంలో గ్లూకోజు స్థాయిల నియంత్రణలోనూ అల్లం, మిర్చి కీలక పాత్ర పోషిస్తాయి.