Cerebral Palsy in Telugu | మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల కుమారుడు జైన్ నాదెళ్ల అకాల మరణంతో ఇప్పుడు సెరిబ్రలీ పాల్సీ గురించి ఆసక్తి మొదలైంది. జైన్ నాదెళ్ల ఈ సెరిబ్రల్ పాల్సీతో బాధపడుతూనే మృతిచెందారు. ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులకు సంభవించే చికిత్స లేని వ్యాధి సెరిబ్రలీ పాలీ. సెరిబ్రల్ పాల్సీ కేసులు ఇండియాలో కూడా పెరుగుతున్నాయి. దేశంలోని ప్రతి 1000 మంది పిల్లలలో ముగ్గురు ఈ వ్యాధితో బాధ పడుతున్నారని పలు నివేదికలు చెబుతున్నాయి.
Cerebral Palsy in Telugu | చికిత్స లేని సెరిబ్రలీ పాల్సీ
హెల్త్ లైన్ తెలిపిన వివరాల ప్రకారం మెదడు పూర్తిగా అభివృద్ధి చెందినప్పుడు, శరీరంలో అనేక రుగ్మతలు తలెత్తుతాయి. దీనినే సెరిబ్రల్ పాల్సీ అంటారు. ఇది నాడీ సంబంధిత వ్యాధి. ఈ వ్యాధి పిల్లల పుట్టకతోనే ముందు అంటే తల్లి గర్భంలో అభివృద్ధి చెందుతుంది.
నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం
85 శాతం సెరిబ్రలీ పాల్సీ కేసులు ఇది పుట్టకతోనే వస్తాయి. దీనికి చాలా కారణాలు ఉండవచ్చు. ఉదాహరణకు గర్భదారణ సమయంలో శిశువు మెదడులో ఆక్సిజన్ లేకపోవడం, జన్యూవుల మ్యుటేషన్, మెదడులో ఇన్పెక్షన్ లేదా మెదడు నుండి రక్తస్రావం కావడం ఇవన్నీ కారణాలుగా నిలుస్తాయి. సెరిబ్రల్ పాల్సీ యొక్క లక్షణాలు పిల్లలలో రెండేళ్ల వయసులో కనిపిస్తాయి.

కండరాలు బిగుసుకు పోవడం, నడవడంలో ఇబ్బందులు, ఆహారం మింగడంలో ఇబ్బందులు, కళ్ల కండరాల్లో అసమతుల్యత ఏర్పడటం, అర్థం చేసుకనే సామర్థ్యం తగ్గడం ఈ వ్యాధి లక్షణాలు. అత్యంత సాధారణంగా నడకలో ఇబ్బందులు ఏర్పడతాయి. దీనిని ఇది అల్ట్రాసౌండ్, సీటీ స్కాన్, ఎంఆర్ఐ ద్వారా గుర్తిస్తారు. పరిస్థితిని బట్టి వ్యాధి ప్రభావాన్ని తగ్గించడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన వుంటుంది. ఈ వ్యాధిని పూర్తిగా నయం చేయడం సాధ్యం కాదని నిపుణులు చెబుతున్నారు.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!