Centurion : దేవుడికి శిలువ వేసిన ఆ శతాధిపతి చివరకు ఏమయ్యాడు? | Good Friday
గుడ్‌ప్రైడే సందర్భంగా అద్భుతమైన స్టోరీ!
Centurion : యేసు క్రీస్తు యొక్క మరణాన్ని, మరణశాసాన్ని అమలు చేసిది మాత్రం రాజైనటువంటి పొంతు పిలాతు. కానీ ఆ శిలువ శిక్షను మాత్రం అమలు చేసింది ఎవరు అంటే శతాధిపతి(Centurion) . ఈ శతాధిపతి యేసుకు శిలువ మరణం అమలు చేసిన తర్వాత తాను మారాడు. దేవుని యొక్క కుమారుడు యేసు క్రీస్తు అని కూడా ఒప్పుకున్నాడు. అయితే శిలువ వేసిన తర్వాత ఆ శతాధిపతి ఏమయ్యాడు. దేవుడు పునరుద్ధానుడు అయిన తర్వాత ఆ శతాధిపతి అతని సైన్యం ఏమయ్యారు. ఎలా చనిపోయారు? యేసు క్రీస్తుకు శిలువ శిక్ష వేసిన శతాధిపతి చూసిన అద్భుతం ఏమిటి? ఆయన తర్వాత ఎలా మారాడో తెలుసుకుంటే నిజంగానే ఆశ్చర్యం వేస్తుంది.

లూకా 27 అధ్యాయం 47వ వచనంలో.. శతాధిపతి జరిగినది చూచి ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై యుండెనని చెప్పి దేవుని మహిమపరిచెను. అని వ్రాయపడి ఉంది. ఈ వ్యాఖ్యాన్ని బట్టి శతాధిపతి దేవుడ్ని నిజంగా చూశాడు. నిజంగా యేసు దేవుని కుమారుడని మహిమ పరచబడ్డాడు.
మత్తయి సువార్త 27 వ అధ్యాయం 53 – 54 వచనాలు చదివితే.. శతాధిపతియు అతనితో కూడ యేసునకు కావలి యున్నవారును, భూకంపమును జరిగిన కార్యములన్నింటిని చూచి, మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి. ఈ వాఖ్యంలో శతాధిపతి, అతని సైనికులు కూడా జరిగిన సంభవాలను చూసి భయపడి, నిజముగా ఇతను దేవుని కుమారుడు అని నమ్మారు. వారు చూచారు. భయపడ్డారు. గ్రహింప బడ్డారు. నిజముగా మార్పు పొందారు. తర్వాత ఒప్పుకున్నారు నిజముగా ఇతను దేవుడు కుమారుడేనని.
లూకా, మత్తయి సువార్తల అనుసారం వారు గ్రహించి తప్పును ఒప్పుకొని మార్పు పొందారని తెలుస్తోంది. ఇంతకు ఈ శతాధిపతి ఎవరు? ఏం చూశాడు? యేసు నిజముగా దేవుని కుమారుడు అని అతనికి అర్థమైంది..అనే ప్రశ్న మెదులు తుంటుంది. వాస్తవానికి రోమా ప్రభుత్వ అధికారి ఎవరూ కూడా ఎవరి వద్ద తలవంచ కూడదనే ధైర్యం వాళ్లది. ఎవరి వద్ద మోకాళ్లు వేయకూడదు అని కూడా రోమా అధికారులు అంటుంటారు.

రోమా ప్రభుత్వ అధికారి మోకాళ్లు వేయని అధికారి ఎందుకు శతాధిపతి దేవుని ఎదుట మోకరిల్లి ప్రార్థించాడు. రాజు పిలాతు వద్ద ప్రభుత్వ ఉద్యోగిగా, శతాధిపతిగా ఉన్నటువంటి వ్యక్తి పేరు లాజినస్ (Longinus). వాస్తవానికి శతాధిపతి పేరు ఇది కూడా కాదట. ఆ అసలైన పేరు ఎవ్వరికీ తెలియదు. అప్పటి పత్రాలు ఆధారంగా లాజినస్గా పిలువబడు తున్నారు. శతాధిపతి అనగా సెంచ్యూరియన్ (Centurion) అని అర్థం. అంటే ఒక ఆర్మీ ఆఫీసర్ అన్నమాట. రోమ్‌లో ఉన్న ఆర్మీ ఆఫీసరే అప్పటి శతాధిపతి. ఈ శతాధిపతి వెంట దాదాపు 100 మంది సైన్యం ఉంటుంది. ఆ సైన్యానికి ఈనొక ఆఫీసర్. ఒక నాయకుడు కూడా. ఈ శతాధిపతికి ఒక కన్ను సరిగ్గా కనిపించదట. పొంతు పిలాతు యేసు క్రీస్తుకు మరణశిక్ష వేశారు. కానీ ఆ శిక్షను అమలు చేసేది ఎవరు అంటే వారిని పర్యవేక్షించేది ఈ శతాధిపతులే.
ఆయన క్రీస్తుకు శిక్ష విధించిన సమయం నుంచి ముళ్ల కిరీటం పెట్టడం, ఈడ్చుకొని రావడం, కొరడాలతో కొట్టడం, శిలువ మోయించడం, రాళ్ల రప్పల మధ్య శిలువను మోయించడం, చేతుల్లో , కాళ్లలో మేకులు దించడం.. ఇలా చిత్రవధ చేసి శిక్షను అమలు చేసే కార్యక్రమం అంతా ఈ శతాధిపతి అతని సైనికులే చేస్తారు. సైనికులు, అతని శతాథిపతి పాత్ర అత్యంత ముఖ్యమైనది. వాస్తవానికి వారి పదవీ కాలంలో ఎంత మందికి క్రూర మృగంగా మరణ శిక్షలు విధించారో, ఎన్ని చిత్ర హింసలు పెట్టారో ఆ కాలంలోవారికే తెలిసి ఉంటుంది.
అలాంటి శతాధిపతి ప్రభువైన క్రీస్తు మరణ శిక్షను అమలు చేస్తున్నాడు. వాస్తవానికి ఈ రోమన్ శతాధిపతి కోసం బైబిల్ గ్రంథంలో మూడు సువార్తలు రాసి ఉన్నాయి. యేసుకు ఇన్ని శిక్షలు వేసిన ఆ శతాధిపతి గురించి మాత్రం బైబిల్లో క్రూరుడిగా, భయంకరుడి గా మాత్రం చూపించలేదు. 100 మందికి శిక్షలు విధించి అత్యంత క్రూరుడైన శతాధిపతి గురించి ఎక్కడా కూడా బైబిల్లో చెడ్డగా రాయలేదు. అయితే అతనిలో మార్పు కనిపించింది. ఇన్ని శిక్షలు వేసిన ఆ శతాధిపతికి మాత్రం క్రీస్తును శిలువ వేసినప్పుడు చిందిన రక్తం తోనే అతనికి క్రీస్తు నిజమైన దేవుడి బిడ్డ అని అర్థమైంది. ఆ రోజుల్లో శిక్షలు ఎలా ఉండేవంటే..శిలువ వేసి వెళ్లిపోవడం కాదు. అతను చనిపోయేంత వరకు ఆ శతాధిపతి అక్కడ ఉండాలి.

ఈ శిక్షల్లో కొందరు కొన్ని రోజులకు చనిపోతుంటారు. కొంత సమయం పడుతుంది చనిపోవడానికి. ఒక్కొక్క సారి శిలువ వేయబడిన వారిని గ్రద్ధలు మనిషి బ్రతికి ఉండగానే పొడుచుకొని తింటుండేవి. కొందర్ని ఇంకా చనిపోక పోతే కాళ్లు విరగొట్టి చంపేస్తారు. వాస్తవానికి విశ్రాంతి దినము వరకు ఎవ్వరూ కూడా శిలువపై వ్రేలాడి ఉండకూడదు. కాబట్టి ఈ లోపు సైనికులు కాళ్లు విరగొట్టి చంపేస్తారు. కానీ ప్రభువైన ఏసు క్రీస్తు మాత్రం కేవలం 6 గంటల్లోనే ఆయన ప్రాణాలు సమర్పించుకున్నారు. ఇవ్వన్నీ జరుగుతుండగా శతాధిపతి గమనిస్తూ చూస్తున్నాడు. యేసు తన తప్పు లేకుండా కారణం లేకుండా శిక్ష విధించబడటం, చట్టాలకు వ్యతిరేకంగా కొరడాలతో కొట్టడం, ముళ్ల కిరీటం పెట్టడం, ఈడ్చుకెళ్లడం, శిలువ వేయబడటం లాంటి అన్నింటినీ ఆ శతాధిపతి గమనిస్తూనే ఉన్నాడు. అంతే కాదు క్రీస్తు శిలువలో మాట్లాడిన 7 మాటలను కూడా ఆ శతాధిపతి వింటున్నాడు. కానీ ఆయన రోమా అధికారి. కచ్చితంగా శిక్షను అమలు చేయాలి.

క్రీస్తు ను శిలువ వేసినప్పుడు తెరగ చినిగిపోయింది. భూమి వణికింది. బండలు బద్దలవుతున్నాయి. దేశమంతా చీకటి కమ్మింది. సమాధులు తెరవబడ్డాయి. చనిపోయిన అనేకులు బ్రతికారు. అదే సమయంలో భూకంపం కూడా కలిగింది. వీటన్నింటినీ వారు చూశారు. అప్పుడే అదే సమయంలో ఆ శతాధిపతి, సైనికులు భయపడ్డారు. ఇతను నిజంగా దేవుడు బిడ్డేనని ఒప్పుకున్నారు. అయితే అప్పుడు క్రీస్తు ఆ శతాధిపతి, సైన్యం గురించి ప్రార్థించాడు. తండ్రీ! వీరు ఏం చేయుచున్నారో..వీరు ఎరుగరు కనుక, వీరిని క్షమించమని ప్రార్థించారు. అలా ప్రార్థించిన దేవుని మనస్సు ఆ శతాధిపతికి తెలిసే ఉంటుంది అనుకుంటా. క్రీస్తు మాటలు, జరిగిన చర్యలను గమనించిన ఆ శతాధిపతి సాక్ష్యమించ్చాడు. ఇతను నిజముగా నీతిమంతుడు… అని. అంతటితో అయిపోలేదు. అలాంటి కఠినుడైన శతాధిపతి దేవుడి యెదుట మోకాళ్లరిల్లి ప్రార్థించాడు. దేవుడ్ని మహిమ పరిచే స్థితికి వచ్చాడు(లూకా 23 అ. 47 వ).

క్రీస్తును శిలువ వేసిన తర్వాత చివరిగా ఆ శతాధిపతి ఆధ్వర్యంలో ఇంకా బ్రతికి ఉన్నాడేమో నని తన ఉదరంలో బల్లెంతో పొడిచారు. అప్పుడు క్రీస్తు శరీరంలో నుంచి నీళ్లు, రక్తం చిందిపడ్డాయి. దేవుడు కుమారుడైన క్రీస్తు చిందించిన ఆఖరి రక్తపు బొట్టు నిజంగా ఆ శతాధిపతిని మార్చింది. ఆ నీరు, రక్తపు బొట్టు ఆ శతాధిపతిపై పడగా ఆయన కన్ను బాగుపడింది. అప్పుడు స్పష్టంగా చూడటం ప్రారంభమైంది. చుట్టూ చూసి ఆ శతాధిపతి ఆ సమయంలో షాకయ్యాడు. అప్పుడు ఆయనకు అర్థమైంది. తన చూపుకు కారణం క్రీస్తే అని. అప్పుడు దేవుడు వైపు చూడటం ప్రారంభించాడు. అప్పుడు ఆ శతాధిపతి లోపల మనస్సు నంచి చెప్పిన మాట.. ఇతను నిజముగా దైవ కుమారుడే అని. రోమన్ శతాధిపతి ఇప్పటి వరకూ ఎవరి వద్ద మోకాళ్లు వేయని ఆ నాయకుడు ఆ క్షణంలో దేవుని ఎదుట మోకరిల్లాడు. వాస్తవానికి శిలువ వేసినప్పడే ఆ శతాధిపతి ఉండిపోలేదు. దేవుడి దేహం కాపాడే పనిలో కూడా తాను ఉన్నాడు. ఆయన సైనికులు, శతాధిపతి (మత్తయి 27 అ. 54 వ) క్రీస్తు సమాధి వద్ద కూడా కాపలా ఉన్నాడట. అప్పటి వరకు జరిగిన విషయాలన్నీ గ్రహించాడు. వారి యొక్క సైనికులు కూడా అక్కడే ఉన్నారు. అయితే దేవుడు పునరుద్ధానికి కూడా ఆ శతాధిపతి సాక్షిగా ఉన్నాడని తెలుస్తోంది.
ఎందుకంటే రోమన్లు కఠినమైన సైనికులు కాబట్టి.. దేవుడి భౌతిక దేహం వద్ద కాపలా ఉన్నారు. సమాధికి రాయిని అడ్డంగా పెట్టారు. అయినప్పటికీ కూడా వారు యేసుక్రీస్తు పునరుద్ధానాన్ని వారు గమనించారు. దీన్ని బట్టి ఆ శతాధిపతి క్రీస్తు మరణం విషయంలోనూ సాక్షిగా ఉన్నాడు. పునరుద్ధానం విషయంలోనూ సాక్షిగా ఉన్నాడు.
అనంతరం ఆ శతాధిపతి ఆర్మీ ఆఫీసర్‌గా (శతాధిపత)గా తన ఉద్యోగం మానేశాడు. రోమా ప్రభుత్వం నుంచి బయటకు వచ్చి బాప్తీజం కూడా తీసుకున్నాడు. దేవుడ్ని ప్రకటించడానికి, సువార్త చెప్పడానికి బయలు దేరాడు. అలా మారి మారు మనుసు పొంది దేవుడి గురించి బోధించడం ప్రారంభించాడు. అలా బోధించడానికి కాపదోసియా అనే ప్రాంతానికి వెళ్లాడు. కాపదోసియాలో అనేకులకు సువార్త ప్రకటించాడు. అయితే అక్కడున్న యూదులు, యూదుల అధికారులు రాజైన పొంతు పిలాతు వద్దకు వచ్చి ఒత్తిడి తెచ్చారు. మీ దగ్గర పనిచేసిన శతాధిపతి ఇలా చేస్తున్నాడు. ఇలా ప్రభు వైపు అందర్నీ తిప్పుతున్నాడని ఫిర్యాదు చేశారు. వాళ్ల ఒత్తిడి ఎంతలా ఉందంటే ఆ మారుమనుసు పొందిన బోధకుడిని చంపేతలా పిలాతు వద్ద ఒత్తిడి తీసుకొచ్చారు. వారి ఒత్తిడి భరించలేక చివరకు రాజైన పిలాతు ఆ బోధకుడిని చంపమని ఆదేశాలు ఇచ్చాడు. అతని తల నరికి తెమ్మని ఆదేశించాడు పొంతు పిలాతు. అయితే అదే విధంగా ఆ బోధకుడిని ఎవరికీ తెలియకుండా తల నరికి ఊరికి దూరంగా పడవేస్తారు. ఈ లోపు ఓ అంధురాలైన ఓ స్త్రీ తన కొడుకు కోసం ఏడుస్తుంటుంది. ఎందుకంటే తన కొడుకు వ్యాధితో చనిపోతాడు.

అయితే ఆ అంధురాలైన తల్లికి ఓ కలలో ఓ దర్శనం కనిపిస్తుంది. ఈ శతాధిపతి అయిన బోధకుడి తల ఎక్కడ పడి ఉందో ఆ దర్శనంలో కనిపిస్తుంది. అప్పుడు ఆ బోధకుడి తల కోసం ఆ అంధురాలు వెళ్లి వెతికి ఆ తలను ముట్టు కుంటుంది. అప్పుడు ఎలాగైతే క్రీస్తును శిలువ వేసినప్పుడు చిందిన రక్తం తో ఆ శతాధిపతికి కన్ను తెరవబడుతుందో, అదే విధంగా ఆ అంధురాలికి కూడా చూపు వచ్చి అంతా కనిపిస్తుంది. అప్పుడు ఆ తల్లి ఆ బోధకుడి తల తీసుకు వచ్చి తన కుమారుడి సమాధి వద్ద పాతిపెడుతుంది. ఇప్పటి వరకు శతాధిపతిగా ఉన్న ఆ నాయకుడును ప్రస్తుతం సెయింట్ లాజినస్ అని పిలుస్తున్నారు. కాథలిక్ వారు ఆయనకు ప్రత్యేక దినముగా అక్టోబర్ 16న గుర్తు చేసు కుంటారు. అంతే కాదు మార్చి 15వ తేదీన రోమన్ క్యాథలిక్ చర్చి వారు గుర్తు చేసుకుంటారు. చూశారా! ఆఖరికి యేసుక్రీస్తును శిలువ వేసిన సైనికుల్లో ఎంత పెద్ద ఉజ్జీవం ఉందో. ప్రస్తుతం మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే..క్రీస్తు ద్వారా తెలుసుకోవాల్సింది 3 విషయాలు ఉన్నాయి.

- పాపిగా, క్రూరుడుగా ఉన్న అధిపతి అయిన శతాధిపతి దేవుడి కుమారుడిని శిలువ వేసి చిత్ర హింసలు పెట్టిన లాజినస్ ఇప్పుడు దేవుడు ఎదుట మోకరిల్లి మారు మనస్సు పొందాడు. సెయింట్ లాజినస్గా మారాడు.
- లాజినస్ ఎంతలా మార్పు పొందాడంటే శారీరక స్వస్థత పొందాడు. మానసికంగా, ఆత్మీయంగా జన్మించాడు.
- ఏసు క్రీస్తు రక్తం, నీరు ద్వారా శారీరక స్వస్థత పొందాడు. మారుతున్న పరిస్థితులను గ్రహించి మారుమనసు పొందాడు. తప్పులు ఒప్పుకున్నాడు. ఆత్మీయంగా ఎదిగాడు. దేవుడు కోసం ప్రాణాలు అర్పించాడు. చరిత్రలో కనిపించని క్రూరుడైన శతాధిపతి దేవుడు మార్గంలో మాత్రం ప్రతి ఒక్క బిడ్డకు ఆదర్శంగా నిలిచాడు. ఆమెన్.
- world facts: తాబేలు నెత్తిన పడి గ్రీకు నాటక రచయిత మృతి ఇలాంటి ప్రపంచ వింతలు తెలుసుకోండి!
- Castor Oil for hair: జుట్టుకు ఆమదం నూనె అబ్బే అనేవారి కోసమే ఇది!
- Urinary Infections: మూత్రంలో మంట, ఇతర సమస్యలు సులవైన చిట్కాలివే!
- Husband abaddalu: మగవారు ఎక్కువుగా ఆడవారితో చెప్పే 7 అబద్ధాలు ఇవేనట?
- man beauty tips: పురుషులు అందంగా కనిపించాలంటే ఏఏ చిట్కాలు పాటించాలి?