cement sheet house: ఈ రోజుల్లో ఇల్లు కట్టుకోవాలంటే ఆకాశాన్ని చూడాల్సిందే. ఎందుకంటే అన్ని మెటీరియల్ ఖర్చులు అలా పెరిగాయి. ఇక సంపాదన మాత్రం పెరిగే పరిస్థితి లేదు. మహమ్మారి కరోనా కాలం వచ్చిన తర్వాత వచ్చే రూపాయ ఆదాయాన్ని కూడా మింగేసింది. ఇప్పుడు చేసుకుంటేనే తిండి అన్నట్టు మారింది కొందరి మధ్యతరగతుల కుటుంబాల జీవితాలు. ఒకే ఇదంతా పక్కన పెడితే ఇక డాబాపైన ఇల్లు కట్టుకునే వారికి సింపుల్‌గా రూ.3 లక్షల్లో అయిపోయే విధంగా నిర్మించిన ఇల్లు వివరాలు( house) ఇక్కడ తెలియజేస్తున్నాం.
సిమెంట్ షీట్ రేకుల ఇల్లు!
రేకుల(cement sheet) ఇల్లు అంటే గ్రామాల్లో కట్టుకునే నేలమీద ఇల్లు కాదండి. ఇక్కడ ఇంటిపైన కట్టుకునే రేకుల ఇల్లు ఇది. కొన్ని గ్రామాల్లో డాబాలపైన చిన్న రేకుల ఇల్లు వేసుకుంటే బాగుంటుందని అనుకుంటుంటారు. ఎందుకంటే ఏదైనా ఫంక్షన్లు జరిగినా, ఎవరైనా అతిథి వచ్చినా, పిల్లలు ఎగ్జామ్స్ సమయంలో ప్రశాంతంగా చదువుకోవాలన్నా పైన ఉన్నఈ రేకుల ఇల్లు ఎంతగానో ఉపయోగపడుతుంది. పూర్తి (cement sheet house)నిర్మాణం చాలా సింపుల్‌గా రూ.3 లక్షల్లో పూర్తయ్యిందని యజమాని చెబుతున్నారు.

ఈ రేకుల ఇల్లుకు స్లాబుకు సిమెంట్ షీట్స్‌ను వాడారు. డోర్లు మీకు నచ్చిన విధంగా కలపతోనైనా, ఫ్లైవుడ్ డోరులైనా పెట్టుకోవచ్చు. కిటీకిలకు కూడా యూపివిసి విండోస్ వాడొచ్చు. లేదా చెక్కదన్న వాడొచ్చు. ఫ్లోరింగ్ టైల్స్ వేసుకోవచ్చు. వాల్ సీలింగ్ డిజైనింగ్ కూడా చేయించుకోవచ్చు. రేకుల ఇల్లు కాబట్టి ఎండాకాలం వేడిగా ఉంటుంది కనుక ఫాల్ సీలింగ్ కూడా చేయించుకోవచ్చు అదే ఖర్చులో. మొత్తంగా రెండు రూములు ఏర్పాటు చేసుకోవచ్చు. ఒక రూములో కిచెన్‌తో పాటు టాయిలెట్‌కు కొంత భాగం కేటాయించి మొత్తంగా రెండు రూములు రేకుల తో నిర్మించిన ఇల్లు ఇది. ఈ రకంగా ఇల్లు నిర్మించుకోవాలంటే రూ.3 లక్షల లోపులో ఈ విధంగా అందంగా నిర్మించుకోవచ్చు.
3 లక్షల్లో రేకుల ఇల్లు: video link
- Karam Podi: కారం పొడి తయారీ, కారంప్పొడి రకాలు నేర్చుకోండి!
- Mutton Biryani recipe: బోన్‌లెస్ మటన్ బిర్యానీ తయారీ
- Manasa Devi: సర్పాలను కాపాడిన మానసాదేవి గురించి ఆధ్యాత్మిక విషయాలు
- Anemia Ayurvedic Treatment: మనిషిని కృంగదీసే వ్యాధులలో ఎనీమియా ఒకటి
- best food for heart: గుండె ఆరోగ్యంగా ఉండాలంటే తినాల్సిన ఆహారం ఇదే!