CDS Gen Bipin Rawat న్యూఢిల్లీ: తమిళనాడు రాష్ట్రంలో దురదృష్టవశాత్తు హెలికాఫ్టర్ ప్రమాదంలో కన్ను మూసిన భారత మొదటి సీడిఎస్ బిపిన్ రావత్ దంపతుల అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం జరిగాయి. తొలుత ఆర్మీ సైనిక సిబ్బంది సందర్శనార్థం రావత్, ఆయన సతీమణి మధులిక పార్ధివ దేహాలను కామ్రాజ్ మార్గ్‌లోని వారి నివాసంలో ఉంచారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటల నుండి అంతిమయాత్ర కార్యక్రమం చేపట్టారు. సాయంత్రం 4 గంటలకు బ్రార్ స్వ్కేర్ శ్మశాన వాటికలో సైనిక లాంఛనాల నడుమ అంతిమ సంస్కారాలు (CDS Gen Bipin Rawat)నిర్వహించారు.
ఈ అంతిమ యాత్రలో త్రివిధ దళాల్లోని అన్ని ర్యాంకులకు చెందిన 99 మంది, 33 మంది ట్రై సర్వీస్ బ్యాండ్ ముందు వెళ్లింది. మరో 99 మందితో కూడిన త్రివిధ దళాల బృందం రేర్ ఎస్కార్ట్‌గా అంతిమ యాత్రను అసుసరించింది. సీడిఎస్ అంతిమ సంస్కారాల్లో మొత్తం 800 మంది సర్వీసు సిబ్బంది పాల్గొన్నారు. అంత్యక్రియల సమయంలో గౌరవ సూచికంగా 17 గన్ సెల్యూట్ (17 gun salute)నిర్వహించారు.
17 తుపాకుల వందనం(17 gun salute) అంటే ఏమిటి?
సీడీసీ బిపిన్ రావత్ అంత్యక్రియల్లో 17 శతఘ్నలతో భారత ప్రభుత్వం వందనం సమర్పించింది. తుపాకులు/ శతఘ్నులతో వందనం సమర్పించడంపై ఇప్పుడు దేశ ప్రజలు ఆసక్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంప్రదాయం ఎప్పటి నుంచో భారత్‌లో ఉంది. భారత్‌లో స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం సందర్భంగా 21 తుపాకులతో త్రివరణ పతకానికి వందనం సమర్పిస్తుంటారు. ఇది ఒక రకమైన సైనిక వందనంగా చెప్పవచ్చు.


పూర్వం 16వ శతాబ్ధంలో బ్రిటన్ నావికాదళం దీనిని ప్రారంభించిందని చరిత్ర కారులు చెబుతున్నారు. ఇందుకు శతఘ్నులు లేదా తుపాకులను వాడవచ్చు. ఈ తుపాకుల వందనాన్ని వివిధ వ్యక్తులకు, వివిధ సందర్భాల్లో వారి గౌరవార్థం ఉపయోగిస్తారట. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఈ ఆచారాన్ని పాటిస్తున్నాయి.
అప్పట్లో బ్రిటీష్ పాలన నుంచి కొన్ని దేశాలకు విముక్తి కలిగిన కామన్వెల్త్ దేశాల్లో ఇది కనిపిస్తుంది. సాధారణంగా దేశాధ్యక్షుడు, విదేశీ అతిథులు పర్యటనకు వచ్చినప్పుడు 21 తుపాకుల వందనాన్ని సమర్పిస్తారు. వీటిల్లో సందర్భానికి అనుగుణంగా 19 తుపాకుల వందనం ,17 తుపాకుల వందనాలు కూడా ఉంటాయి. రాష్ట్రపతి, అత్యంత సీనియర్ సైనికాధికారులకు 21 తుపాకుల వందనం ఇస్తారు. త్రివిధ దళాధిపతులకు 17 తుపాకుల వందనం ఇస్తారు.
- Chintamani Natakam నిషేధంపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన AP High Court
- Grammarly For Education Get Started
- Grammarly Check For Great Writing, Simplified
- tips for glowing skin homemade | అందమైన ముఖ సౌందర్యం కోసం టిప్స్
- mutton curry types: మటన్ కూరల తయారీ విధానం ఇక్కడ నేర్చుకోండి!