CBI Court

CBI Court: ర‌ఘురామ‌కృష్ణ‌కు ఝ‌ల‌క్‌.. జ‌గ‌న్‌కు బిగ్ రిలీఫ్‌!

Spread the love

CBI Court హైద‌రాబాద్: అక్ర‌మ ఆస్తుల కేసులో ఏ1, ఏ2గా ఉన్న జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి కండీష‌న‌ల్ బెయిల్ ర‌ద్దు చేయాలంటూ ర‌ఘురామ‌కృష్ణం రాజు వేసిన పిటిష‌న్‌పై ఈ రోజు సిబిఐ కోర్టు తీర్పు ఇచ్చింది. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, విజ‌య‌సాయి రెడ్డికి బిగ్ రిలీఫ్ వ‌చ్చింది. జ‌గ‌న్‌, విజ‌య‌సాయిరెడ్డి బెయిల్ పిటీష‌న్ ర‌ద్దు చేయాలంటూ ర‌ఘురామ‌కృష్ణ రాజు వేసిన పిటీష‌న్ ను సిబిఐ కోర్టు(CBI Court) కొట్టివేసింది.

జ‌గ‌న్‌, విజ‌య‌సాయి రెడ్డి బెయిల్ ర‌ద్దు చేయాలంటూ ర‌ఘురామ‌కృష్ణ రాజు పిటిష‌న్ వేశారు. బెయిల్ కండీష‌న్ నిబంద‌న‌లు ఉల్లంఘించారంటూ ఆయ‌న పిటిష‌న్ వేశారు. అయితే ఇదే విష‌యంలో సిబిఐ మాత్రం ఎలాంటి కౌంట‌ర్ వేయ‌కుండా కోర్టుకే నిర్ణ‌యం వ‌దిలేసింది. ఈ పిటిష‌న్‌పై రాష్ట్రం మొత్తం ఆస‌క్తికి నెల‌కొంది.

అయితే ర‌ఘురామ‌కృష్ణ రాజు మాత్రం సిబిఐ , సిబిఐ కోర్టు నిర్ణ‌యంపై ఆయ‌న మొద‌టి నుంచి అనుమానాలు వ్య‌క్తం చేశారు. నిన్నే తెలంగాణ హైకోర్టులో కూడా లంచ్ మోష‌న్ పిటిష‌న్ వేశారు. సిబిఐ కోర్టు తీర్పు ఇవ్వ‌కుండా ఆదేశాలు ఇవ్వాల‌ని, వేరే బెంచ్‌కు దీన్ని పంపించాలంటూ హైకోర్టుకు వెళ్ల‌గా, అక్క‌డ మాత్రం ర‌ఘురామ‌రాజుకు రిలీఫ్ దొర‌క‌లేదు. మొత్తం మీద సిబిఐ కోర్టు, ఈ రోజు జ‌గ‌న్, విజ‌య‌సాయిరెడ్డికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

ఈ పిటిష‌న్ ర‌ద్దు చేసిన త‌ర్వాత ర‌ఘురామ‌కృష్ణం రాజు స్పందించారు. సాక్షిలో వ‌చ్చిన‌ప్పుడే త‌న‌కు అనుమానం వచ్చింద‌ని, అందుకే బెంచ్ మార్చాల‌ని అడిగాం అని, అయినా న్యాయ‌స్ధానాల మీద గౌర‌వంతో ఉన్నాన‌ని అన్నారు. దీనిపై హైకోర్టులో అపీల్‌కు వెళ్తామ‌ని అన్నారు. సాక్షి క‌థ‌నాల‌కు అనుకూలంగా కూడా రెండూ ఒకేసారి రావ‌డం యాధృచ్ఛికం అని అన్నారు.

గ‌త నెల‌లో సాక్షి ట్వీట్ చేసిన‌ప్పుడే అర్థం అయ్యింద‌ని, కోర్టు మీద అపోహ‌లు లేకుండా, బెంచ్ మార్చాల‌ని కోరామ‌ని, అయినా కోర్టు త‌న వాద‌న విన‌లేద‌ని ర‌ఘురామ‌కృష్ణం రాజు తెలిపారు. సిబిఐ వాద‌న‌లు కూడా అసంబద్ధంగా అనిపించాయ‌ని, రెండేళ్లుగా కోర్టుకు రాక‌పోయినా, సిబిఐకి ఏమీ అభ్యంత‌రం లేక‌పోవ‌డం, ఆశ్చ‌ర్యాన్ని క‌ల‌గిస్తోంద‌ని అన్నారు.

దీనిపై క‌ల‌త చెంద‌కుండా హైకోర్టుకు వెళ్తాం అని, హైకోర్టు త‌ర్వాత సుప్రీం కోర్టుకు కూడా వెళ్తాం అని అన్నారు. ఇది ముందే ఊహించింద‌ని , కోర్టుల‌పై గౌర‌వం న‌మ్మ‌కం ఉంద‌ని, నా ప్ర‌య‌త్నంలో విఫ‌లం అయ్యాన‌ని అన్నారు.

jagan bail: బెయిల్ ర‌ద్దు పిటిష‌న్‌పై ఆనందం వ్య‌క్తం చేసిన ఎంపీ

jagan bail: ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్‌.జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పిటిష‌న్‌పై ర‌ఘురామ పిటిషిన్‌పై ఆగ‌ష్టు 25న సీబీఐ కోర్టు తీర్పు వెల్ల‌డించ‌నుంది. ఈ సంద‌ర్భంగా ఎంపీ ర‌ఘురామ‌కృష్ణ‌రాజు ఆనందం Read more

Political Story: ఆ పార్టీ ఎందుకు నిల‌దొక్కుకోలేక పోతుంది?

నాడు ఎన్‌టిఆర్ - నేడు జ‌గ‌న్ వ‌ల్లేనా?తెలుగు నాట చెరిపినా చెర‌గ‌ని చ‌రిత్ర ఆ పార్టీ సొంతం! Political Story: ఒక్క‌ప్పుడు ఆ పార్టీ దేశానికి దిశా, Read more

Best Chief Minister in India 2021 | Naveen Patnaik | Aravind Kejriwal | YS Jagan:బెస్ట్ సీఎంగా న‌వీన్ ప‌ట్నాయ‌క్, కేజ్రీవాల్‌, సీఎం జ‌గ‌న్‌

Best Chief Minister in India 2021 | Naveen Patnaik | Aravind Kejriwal | YS Jagan:బెస్ట్ సీఎంగా న‌వీన్ ప‌ట్నాయ‌క్, కేజ్రీవాల్‌, సీఎం Read more

AP GOVT: Aadhar Card Correction Centers in Village|ఇక ప‌ల్లెల్లో శాశ్వ‌త ఆధార్ కేంద్రాలు

AP GOVT: Aadhar Card Correction Centers in Village|ఇక ప‌ల్లెల్లో శాశ్వ‌త ఆధార్ కేంద్రాలు vijayawada: దేశంలో ప్ర‌తి ఒక్క‌రికీ ఆధార్ కార్డు త‌ప్ప‌నిస‌రి అయ్యింది. Read more

Leave a Comment

Your email address will not be published.