Cauliflower for Kidney | ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు కాలీఫ్లవర్ లో పుష్కలంగా ఉన్నాయి. అందుకే శాఖాహారంలో దీనికి ప్రత్యేక స్థానం ఉందని పోషకాహార నిపుణులు చెబుతుంటారు. పలు రకాల క్యాన్సర్లను నివారించే గుణం దీనిలో ఉంది. Vitamin-సి,కెతో పాటు ఫోలేట్, పొటాషియం, పీచు అధికంగా లభిస్తాయి. Cancerను ఎదురించే సల్ఫోరాఫెన్ కాలీఫ్లవర్లో గణనీయంగా ఉంటుంది. కెలొరీలు తక్కువుగాను, పోషకాలు సమృద్ధిగానూ అందించే కాలీఫ్లవర్‌ను తరుచూ తింటే కాలేయం, ఊపిరితిత్తులు, ప్రోస్టేట్, బ్లాడర్, రొమ్ము, Skin సంబంధ క్యాన్సర్లను నివారించే అవకాశం ఉంది.


సాఫీగా గుండెకు రక్త సరఫరా
ఇందులోని సల్ఫోరాఫెన్ వల్ల గుండె పనితీరు కూడా మెరుగవుతుంది. కాలీఫ్లవర్‌ను ఎంత ఎక్కువగా తీసుకుంటే Health అంత ఎక్కువగా మెరుగుపడుతుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రక్తంలో కొవ్వు శాతం సైతం తగ్గుతుంది. ఫలితంగా గుండెకు రక్త సరఫరా సాఫీగా ఉంటుంది. వంద గ్రాముల Cauliflowerలో 20 కెలొరీలు మాత్రమే ఉంటాయి. గనుక బరువు తగ్గాలనుకునే వారు దీన్ని తినడం మంచింది. ఇందులోని పీచు కారణంగా జీర్ణ వ్యవస్థ మెరగువుతంది. Infectionను నివారించి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇందులోని మాంగనీసు, కాపర్ వంటి ఖనిజాలు ఎదిగే చిన్నారులకు మేలు చేస్తాయి.
కిడ్నీలకు మేలు(Cauliflower for Kidney)!


చిన్నారులకు పిజ్జాలు, burgerకు బదులు కాలీఫ్లవర్‌తో చేసే సలాడ్లు, ఇతర వంటకాలు తినిపించడం మంచింది. మూత్ర పిండాల సమస్యలున్నవారు తరుచూ కాలీఫ్లవర్ తీసుకోవాలి. ఇందులోని పోషకాలు శరీరంలోని వాపులను, fatలను దూరం చేస్తాయి. సోడియం, పొటాషియం తక్కువగా ఉన్నందున కిడ్నీ సమస్యలున్నవారు కాలీఫ్లవర్‌తో చేసిన వంటకాలు తినాలి. ఇది శరీరంలో నీటిశాతాన్ని అదుపు చేస్తుంది. ప్రొటీన్లు తక్కువుగా, పీచు ఎక్కువగా ఉంటుంది గనుక జీర్ణ వ్యవస్థ ప్రక్షాళన అవుతుంది. Kidneyలో వ్యర్థ పదార్థాలు చేరకుండా ఉంటాయి. కాలీఫ్లవర్‌లోని విటమిన్-C యాంటీ ఆక్సిడెంట్ మాదిరి పనిచేస్తూ మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది. కిడ్నీలో రాళ్లు చేరకుండా ఇది నివారిస్తుంది.
క్యాలీఫ్లవర్‌లోని పోషకాలు శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. కిడ్నీల్లో వ్యర్థాలు చేరుకోకుండా సాయపడతాయి. ఇందులో Vitamin-సి అధికంగా లభిస్తుంది. అది శరీరంలోకి చేరుకున్నాక యాంటీ ఆక్సిడెంట్ మాదిరి పనిచేస్తుంది. మూత్ర పిండాల పనితీరును మెరుగు పరుస్తుంది. రాళ్ల సమస్య కూడా తగ్గుతుంది. దీన్ని కూర రూపంలో తీసుకోలేని వారు మంచూరియా, సలాడ్లతో కలిపి తినొచ్చు. ఆవకాయ రూపంలోనూ తీసుకోవచ్చు.