Cauliflower avakaya మార్కెట్లో మామిడ కాయలు బాగా రేట్లు పెరిగిపోయాయి. ధరలు ఆకాశానంటుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రజలు కనీసం 10 కాయలైనా ఆవకాయ పెట్టుకుని సరిపెట్టుకునే ఉంటారు. ఇక్కడ ధనవంతుల సంగతి పక్కన పెడితే అధిక శాతం మధ్య తరగతి ప్రజలే ఎక్కువ. ఇలా నామ్కే వాస్తే పెట్టుకున్న 10 కాయల ఆవకాయ మహా అయితే 3-4 నెలల వరకూ వస్తుంది. ఆ తరువాత తినాలని అనిపిస్తే, బజార్లలో దొరికే ఊరగాయలతోనే కాలక్షేపం చేయాలి. అంతకన్నా వేరే మార్గాలు అన్వేషించి కూరగాయలతో ఊరగాయలు పెట్టుకుంటే, తృప్తి, ఆనందం తప్పకుండా మనకే దక్కుతాయి. ఇక ఊరగాయలు(Cauliflower avakaya) పెట్టుకుందాం!
తయారీకి కావాల్సిన పదార్థాలు!
-4 కప్పులు బాగా సన్నగా తరిగిన కాలీఫ్లవర్
-1కప్పు కారం
-1కప్పు ఉప్పు
-పావు కప్పు ఆవపిండి
-చిటికెడు పసుపు
-అర కప్పు నిమ్మరసం
-1చెంచాడు మెంతిపిండి
-తగినంత నూనె.
తయారు చేసే విధానం
ముందుగా కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక బేసిన్లో వేసి, అందులో ఉప్పు, కారం, ఆవపిండి, మెంతి పిండి చేర్చి బాగా కలపాలి. అందులో నూనె తగినంతగా పోసి కలపాలి. ఆ తరువాత నిమ్మరసం వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలిపి ఒక రోజు పొడి సీసాల భద్రపరిచి, మరునాటి రోజు నుంచి వాడుకుంటే భలే ఆవకాయ రుచులూరుతూ నోరూరిస్తుంది.
- Panasakaya Biryani: పనసకాయ బిర్యానీ తయారీ నేర్చుకోండి!
- lord krishna stories: లార్డ్ కృష్ణ ఆలోచనకు సృష్టికర్తే మోకరిల్లాడు!
- Noogler Benefits: Google తమ ఉద్యోగులకు ఇంత విలువ ఇస్తుందా?
- Peda Purugu: పేడపురుగు పేడ ఉండలతో ప్రయాణం ఎటు?
- Katla Pamu: కట్ల పాముల గురించి ఆసక్తికర విషయాలు!