Caste Feeling | ఒక చిన్న స్కూల్ పాప మీకు క్యాస్ట్ ఫీలింగ్ లేకపోతే నాకు Hug లేదా Shake Hand ఇవ్వండి అని Social Experiment ద్వారా చిన్న కార్యక్రమం చేపట్టింది. కానీ ఆ చిన్న పిల్ల కు ఆశించినంత ఫలితం రాలేదని, సొసైటీలో ఇంకా క్యాస్ట్ ఫీలింగ్(Caste Feeling) ఉందని రుజువైంది. బహిరంగ ప్రదేశంలో జనాలు తిరుగుతున్న బస్ స్టాప్ సెంటర్లో చిన్న పాప ఒక ప్లకార్డు పట్టుకొని ఈ విధంగా కార్యక్రమం చేపట్టింది. దీనికి 100 మందిలో 8 మంది మాత్రమే ప్రతిస్పందనగా హగ్, షేక్ హ్యాండ్ ఇచ్చారు.
క్యాస్ట్ ఫీలింగ్‌పై సోషల్ ఎక్స్పర్మెంట్ !
Little Chandana అనే చిన్న స్కూల్ పాప తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఈ సోషల్ ఎగ్స్పర్మెంట్ ప్రోగ్రాంను ఒక 10 నిమిషాలు చేపట్టింది. నడి సెంటర్లో ప్లకార్డు పట్టుకొని క్యాస్ట్ ఫీలింగ్ లేని వారు హగ్ గానీ షేక్‌హ్యాండ్ ఇవ్వండి అని చాలా సేపు నుంచి నిల్చొని ఉంది. కానీ ఆమెను ప్రతి ఒక్కరూ వింతగా చూశారు.
కొంత మంది ఆ పాప పట్టుకున్న ప్లకార్డును చూస్తున్నారు కానీ. పెద్దగా ముందుకు ఎవ్వరూ రాలేదు. ఎవరి పనిలో వారు బిజీగా ఉన్నారు. కొంత మంది మాత్రం చదివి కూడా ఆ పాప దగ్గరకు రాలేదు. ఎవరి దారిన వారు వెళ్లిపోతున్నారు. పాప మాత్రం అలానే చూస్తూ ఉండిపోయింది.
కాలేజీ పిల్లలు మాత్రం కొందరు ఆ పాప పట్టుకున్న ప్లకార్డు చూశారు కానీ కొందరు వెళ్లిపోయారు. వారిలో ఒకరు ఇద్దరు వచ్చి హగ్ ఇచ్చారు. షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ కార్యక్రమం చేపట్టినందుకు పాపను అభినందించారు. అసలు క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఎలా ఉంటుందో కూడా తెలియని ఆ పాపకు ఎక్స్పర్మెంట్ ద్వారా ఒక అవగాహన అయితే వచ్చినట్టు ఉంది. ఇంకా క్యాస్ట్ ఫీలింగ్ సొసైటీలో ఉందని.
లిటిల్ చందన గౌతమీ స్కూల్లో చదువుకుంటుంది. ఈ సోషల్ ఎక్సపర్మెంట్ ఆలోచన ఎలా వచ్చిందో గానీ. చాలా ధైర్యంగా నడి సెంటర్లో నిలబడి క్యాస్ట్ ఫీలింగ్ విషయంపై అవగాహన కల్పించింది. కొంత మంది పెద్ద వాళ్లు చూసి ఆ పాపను అభినందించారు. దగ్గరకు వచ్చి తన పేరును అడిగి చేతిలో చాక్లెట్స్, బిస్కెట్స్ పెట్టారు.
మన దేశంలో క్యాస్ట్ ఫీలింగ్ బాగా ఉందని అర్థమవుతుంది. ఈ విషయం ఆ పాపకు కూడా తెలిసింది. అదే మరేదైనా ఎక్సపర్మెంట్ చేస్తే దగ్గర వచ్చేవారేమో, తెలుసుకునేవారేమో, కానీ క్యాస్ట్ ఫీలింగ్ ఎక్సపర్మెంట్ కు మాత్రం ఆ పాప అనుకున్నంత ఫలితం రాలేదు. ఎవరూ కూడా ఈ విషయంపై సరిగా స్పందన చేయలేదు. ప్రతి ఒక్కరూ క్యాస్ట్ ఫీలింగ్‌పై ఏదో ఒక రూపంలో ఫీలవుతున్నట్టు తెలుస్తోంది. మన దేశంలో క్యాస్ట్ ఫీలింగ్ ఇంకా పాతుకుపోయి అల్లుకుపోతుందనేది అర్థమవుతుంది.
ఇంత ఆత్యాధునిక కాలంలో కూడా మనకు క్యాస్ట్ ఫీలింగ్ అనేది ఒక కత్తిలాగా తయారైంది. సమాజంలో స్వేచ్ఛగా బ్రతకడానికి అడ్డు పడుతోంది. మన దేశంలో ఇప్పటికే మత కల్లోలాలతో, క్యాస్ట్ఫీలింగ్తో ఎక్కడో ఒక చోట అల్లర్లు జరుగుతూనే ఉన్నాయి. హత్యలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ప్రతి ఒక్కరూ ఎదుట మనిషిని మనిషిగా చూసే రోజు వస్తే తప్ప ఈ మతాలు, కులాలు ప్రభావం మనపైన తగ్గక మానదు. కాబట్టి ప్రతి ఒక్కరూ మతాలు, కులాలపై జరిగే అవగాహన కార్యక్రమాల్లో పాల్గొనాలి. మనవంతు ప్రోత్సాహం అందించాలి. భారతీయులమైన మనం అందరం కుల, మత, పేద, ధనిక వర్గాల తేడా లేకుండా కలిసి మెలిసి జీవించాలి.