carrot Juice | వంటల్లో క్యారెట్ వాడటం, అప్పుడప్పుడూ పచ్చిగా తినడం మాత్రమే కాదు, రోజూ గ్లాసు రసం తాగి చూడండి. ఎన్ని లాభాలుంటాయో! క్యారెట్ జ్యూస్(carrot Juice) రోజుకో గ్లాస్ ఫలితాలు ఏమిటో ఇప్పుడు చూద్ధాం!.
క్యారెట్‌లో బీటా కెరొటిన్ ఎక్కువ. ఇది శరీరంలోకి వెళ్లిన తరువాత Vitamin-Aగా మారుతుంది. ఈ రసం తాగడం వల్ల కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో కెరొటినాయిడ్లు అధికం. ఇవి యాంటీఆక్సిడెంట్లలా పనిచేసే శరీరంలోని మలినాలను బయటకు పంపిస్తాయి. శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. ఒత్తిడిని తగ్గించి జీవక్రియలు సాఫీగా జరిగేలా చూస్తాయి.
క్యారెట్‌లోని పోషకాలకు క్యాన్సర్ కణాలతో పోరాడే శక్తి ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ రసం తాగడం వల్ల ముఖంపై ముడతలు తగ్గుముఖం పడతాయి. Skinపై కాంతిమంతంగా మారుతుంది. ఇందులోని విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం, మలబద్ధకం సమస్యలున్నవారు రోజూ గ్లాసు క్యారెట్ రసం తాగితే జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఇందులోని పీచు మలబద్దకాన్ని నివారిస్తుంది.


బరువు తగాలన్నా, జీవక్రియలను మెరుగు పరుచుకోవాలనుకున్నా, పంపాలనుకున్నా, రోజూ గ్లాసు క్యారెట్ రసం(carrot Juice) తాగితే చాలు. త్వరగా ఆకలీ వేయదు. Carrotలోని పొటాషియం చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తపోటును నియంత్రిస్తుంది. థైరాయిడ్ అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు ఈ రసం జ్యూస్ తాగితే మంచిది.