carrots: క్యారెట్లు కంటిచూపు మెరుగుదలకే కాదు, పురుషుల్లో సంతానోత్పత్తికి కారకమైన శుక్రకణాల వృద్ధికి తోడ్పడతాయి. శుక్రకణాలు అండంగా మారడానికి క్యారెట్ల వాడకం ఎంతో ఉపయోగకర మని హార్వర్డ్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ పరిశోధకులు ధృవీకరించారు.
carrots: క్యారెట్ వల్ల లాభాలు!
ఆహారపు అలవాట్లను బట్టి 200 మంది కాలేజీ అబ్బాయిలను పరిశోధనకు ఎంపిక చేసుకున్నారు. వారు తీసుకున్నే కూరగాయలు, పండ్లు లాంటి ఆహారపు అలవాట్లలో మార్పులు చేశారు. ఈ ఆహార మార్పులకు ముందు, తర్వాత వారి వీర్యం పరిమాణం, నాణ్యతలను పరీక్షించారు. వీరు తీసుకున్న ఆహారంలో పసుపు, నారింజ రంగులో ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువుగా ఉండటం వారిలో వీర్య బలం వృద్దికి కారణమని పరిశోధకులు కనుగొనన్నారు.
carrots లు తినడం వల్ల శుక్రకణాల పని విధానంలో మెరుగుదల 6.5% నుండి 8% మధ్యలో ఉంది. విటమిన్-ఏ ఎక్కువగా ఉన్న క్యారెట్లో బీటా కెరోటిన్ ఆరోగ్యకరమైన యాంటీ ఆక్సిడెంట్‌గా మారడం వల్ల బలమైన శుక్రకణాలు వృద్ధి చెందుతున్నాయని పరిశోధకులు తెలుపుతున్నారు. ఈ విటమిన్ – ఎ బ్రొకోలి, చిలకడ దుంపలు, ఓట్ మీల్లో ఎక్కువుగా ఉంటుంది. అంతేకాక ఖర్బూజా, బచ్చలికూర, తోటకూరలలో కూడా ఈ లక్షణాలు ఉన్నాయని, ఇవీ శుక్రకణాల పరిమాణం,నాణ్యత అభివృద్ధికి పనిచేస్తాయని తాజా అధ్యయనం తెలియజేస్తోంది.
ఎరుపు రంగులో ఉండే టమాటాలు ఎక్కువగా తీసుకోవడం పురుషులలో ఆరోగ్యకరమైన శుక్రకణాల వీద్ధికి, అదే విధంగా క్యాన్సర్ కారకాలను నిరోధించే కెమికల్ లైకోపిన్గా కూడా పనిచేస్తుందని ఈ తాజా పరిశోధనలు తెలియజేస్తున్నాయి. అంతే కాకుండా క్యారెట్లు చర్మ సౌందర్యానికి కూడా ఉపయోగపడతాయి. చాలా మంది క్యారెట్‌తో చేసిన వంటకాలను తినేందుకు ఎక్కువ శాతం మంది ఇష్టపడతారు. కొంత మంది క్యారెట్‌ను పచ్చిగ తినడానికి ఇష్టపడతార. క్యారెట్లో అధిక క్యాలరీలు ఉంటాయి. ఇవి పిల్లల శారీరకంగా, మానసికంగా ఎదిగేందుకు, మేధో వికాసానికి తోడ్పతాయని వైద్యులు చెబుతున్నారు.
క్యారెట్లను సలాడ్లు లాగ, జ్యూస్‌ల రూపంలో కూడా తీసుకోవచ్చు. తాజా క్యారెట్ తినడం వల్ల మన శరీరారనికి కావాల్సిన 12 ఖనిజ లవణాలు లభిస్తాయి. విటమిన్ బి, సి లు అధికంగా ఉంటాయి.పొటాషియం, ఐరన్, మెగ్నిషియం, సోడియంతో పాటు సల్పర్, బాస్వరం, క్లోరిన్ వంటి ఖనిజాలను సరఫరా చేస్తోంది. ఎండకు కమిలి, రంగు కోల్పోయిన చర్మానికి క్యారెట్ రసం చాలా బాగా ఉపయోగపడుతుంది. రంగును పెంచడమే కాకుండా చర్మ ఆరోగ్యానికి కార్యెట్ రసం తోడ్పడుతుంది. శరీరంలోని మృతకణాలను తిరిగి ఆక్టివేట్ చేయడంలో సహాయ పడుతుంది.
జుట్టు సమస్యకు క్యారెట్ జ్యూస్ (carrots
తాజా క్యారెట్ జ్యూస్ కొంచెం నీళ్లు, పుల్ల పెరుగు, గుడ్డులో ఉండే తెల్లసొన కలిపి జుట్టకు పట్టించాలి. కొద్దిసేపయ్యాక తలస్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గడమే కాక, శిరోజాలు గట్టిగా ఉంటాయి. ఎండాకాలం లో జుట్టు చివర్లు పగిలిపోయినట్లయితే, క్యారెట్ ఆకులకు కాసింత నువ్వుల నూనె కలిపి మెత్తగా నూరి తలకు పూసుకుని పెసర పిండిని తలకు మర్ధన చేసి స్నానం చేసినట్లయితే జుట్టు చివర్లు తెగకుండా, జుట్టు
నిగనిగలాడుతూ ఉంటుంది.