career after intermediate mpc ఇంటర్మీడియట్ లో ఎంపీసీ ప్రత్యేక కీలకమైన కోర్సు. ఈ కోర్సు తీసుకున్న అనతి కాలంలోనే ఉద్యోగాల్లో సెటిల్ అయినవారు ఉన్నారు. ఎంపీసీ కోర్సుతో శాస్త్ర, సాంకేతిక మరియు ఇంజనీరింగ్ రంగాలలో మంచి భవిష్యత్తు ఉంటుంది. లెక్కలు, ఫిజిక్స్‌పై భాగా పట్టు ఉన్నవారికి ఎంపీసీ చాలా సులభం. అయితే అసలు ఈ ఎం.పి.సి గ్రూపు ద్వారా ఉపయోగాలు ఏమిటి? ఎంపీసీ గ్రూపుతో కెరీర్ ఎలా ఉంటుందో తెలుసు కుందాం!. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలను మెయిన్ సబ్జెక్టులుగా చదవాలన్న ఆసక్తి కలిగి ఉన్నవారు ఈ కోర్సులో చేరవచ్చు. ఈ మూడు సబ్జెక్టులూ వేటికవే ప్రాముఖ్యం కలిగినవి చెప్పవచ్చు.
-నిత్య జీవితంతో ముడిపడి, దాదాపు అన్ని(career after intermediate mpc) రంగాలతో సంబంధం ఉన్న సబ్జెక్టు మేథమెటిక్స్.
-విస్తరిస్తోన్న ఎలక్ట్రానిక్స్/ టెలికమ్యూనికేషన్ వంటి రంగాలలో సుశిక్షుతులను అందించేది ఫిజిక్స్.
-మందులు, రసాయన పరిశ్రమలు వంటి ఎన్నంటిలోనో ఉపాధి పొందేలా తీర్చిదిద్దేది కెమెస్ట్రీ.


కోర్సు తీసుకునేవారి లక్షణాలు
ఓ అంశాన్ని త్వరగా అర్థం చేసుకుని అంతే త్వరగా విశ్లేషించి, వేగంగా అన్వయించే(అప్లికేషన్) నైపుణ్యం ఉన్న విద్యార్థులకు సరైన గ్రూప్ ఎంపీసి. దేశవ్యాప్తంగా ఎంతో క్రేజ్ ఉన్న ఇంజనీరింగ్, సైన్స్ కోర్సుల్లో ఉన్నత విద్య, పరిశోధనల దిశగా అడుగులు వేయించే గ్రూపుగా చెప్పవచ్చు. ఈ గ్రూపు ఎంచుకునే విద్యార్థులకు నిరంతర అధ్యయనం, కొత్త టెక్నాలజీలను అవగాహన చేసుకోవడం, వాటిలో నైపుణ్యం సాధించడం మొదలైన లక్షణాలు అవసరం. చాలా మంది విద్యార్థుల్లో ఎంపీసీ అంటే ఇంజనీరింగ్‌లో చేరడానికే అనే అభిప్రాయం ఉంది. కానీ ఇంటర్మీడియెట్ తర్వాత ఇంజనీరింగ్‌తో పాటు అనేక అవకాశాలు ఎంపీసీ విద్యార్థుల సొంతం. ప్రస్తుతం సైన్స్ పరిశోధనల ప్రాధాన్యం పెరుగుతున్న దృష్ట్యా బిఎస్సీ, ఎమ్మెస్సీ పూర్తి చేసి పిహెచ్డి సాధిస్తే జీవితం బంగారు బాటే. ఉద్యోగ సాధన క్రమంలో ఇంజనీరింగ్‌తో పోలిస్తే, సైన్స్ కోర్సులు టైం టేకింగ్ అనే అభిప్రాయం ఉంది. అయితే ప్రస్తుత ట్రెండ్‌ను పరిగణలోకి తీసుకుంటే, సైన్స్‌లో ఉన్నత విద్య పూర్తి చేసిన అభ్యర్థులు ఇంజనీరింగ్ అభ్యర్థులతో సమాన గౌరవం పొందడమే కాక అంతకంటే ఉన్నత స్థానాల్లో స్థిరపడుతున్నారు. ఇన్ని విలక్షణ అవకాశాలు ఉన్నందు వల్లే ఎంపీసీ ఇప్పటికీ ఎవర్ గ్రీన్.


ఎంపీసీ తర్వాత..!
BTech/ BE (EAMCET – NEET) – 4 YEARS
CSE(Computer Science & Engineering)
EEE (Electrical and Electronics Engineering)
ECE (Electronics and Communication Engineering)
IT (Information Technology Engineering)
Mechanical Engineering
Civil Engineering
Metallurgical Engineering
Aeronautical Engineering
Automobile Engineering
Chemical Engineering
Agricultural Engineering
Industrial Engineering
Food Process Engineering
B.Pharmacy (More than 200 such Courses exists)
DEGREE / GRADUATION
MPC- Mathematics, Physics, Chemistry
MPCS- Mathematics, Physics, Computer Science
MECS – Mathematics, Electronics, Computer Science
MSCS – Mathematics, Statistics, Computer Science
- Brave girl: Indira Gandhi కాలంలో అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించిన Geetha chopra award బాలిక స్టోరీ
- Karpoora Tulasi: ఆధ్యాత్మిక సుగంధం కర్పూర తులసి అని ఎందుకంటారు?
- Coffee: ప్రతి రోజూ కాఫీ తాగుతున్నారా? అయితే ఇది చదవాల్సిందే!
- Discipline: జీవితంలో క్రమ శిక్షణ ఎంతో అవసరం
- Money Problem: పైసలు లేకపోతే ఎక్కడలేని నొప్పలన్నీ వస్తాయట!